ఆదివారం, మార్చి 11, 2012

ఐతే ఆ బాధ ను మించినది భాద్యత అది ఎవ్యక్తినైన కంట్రోల్ చేస్తుంది , చేయాలి .

 

కొనవూపిరితో ఉన్న జటాయువు ను చూసి రాముడు చాలా దుఖించాడు ,
రాముడు మొట్ట మొదటి సారిగా కంట్రోల్ చేసుకోలేక బోరున దుఖించటం . తండ్రి పోయిన వార్తా విన్నపుడు కూడా , సీతా కనబడలేదు అన్నప్పుడు కూడా బయట పడలేదు .
జటాయువు ఆయువు తన కోసము త్యాగము చేసింది అనే భావన చాలా భాదను కలుగజేసింది .
అంత మంది రాక్షసుల అంతమొందించాడు , వెంటనే కంట్రోల్ చేసుకున్నాడు .
ఇక్కడ మానవ నైజం ఒకటి మనకు కనిపిస్తుంది . మనకోసము చనిపోయారంటే చాలా భాద అవుతుంది .
 ఐతే ఆ బాధ ను మించినది భాద్యత అది ఎవ్యక్తినైన కంట్రోల్ చేస్తుంది , చేయాలి . శ్రీ రామునుకి చెప్పాల్సిన పని లేదు . అందుకే అక్కడ ఎవరు రాముని ఓదార్చిన వారు కనబడరు .