ఆదివారం, జులై 29, 2012

చచ్చేదాకా చపలత్వం పోదు .
కోరికలు నాగుపాములై  బుసలు కొడుతుంటే 


శిఖరాగ్రాన  నుంచున్నా  సహాయం  కొరకు 


అర్థించే  చేతులకు  ఆలంబనగా  మేఘమాల  వారధి  పరిచే 


అయినా  చపలత్వం  చావలేదు 


కోరికలలో  మునిగి  లొంగి పొవాలో  


ఆ అమృత  హస్తాల  నందుకొని  ఆవలి  తీరం  చేరాలో 


చపలత్వం  చావదు 


చచ్చేదాకా  చపలత్వం  పోదు .

శుక్రవారం, జులై 27, 2012

సిగ్గు చేటు కాదా ............

పాండవులు  పడరాని పాట్ల  పడ్డా  ధైర్యం  కోల్పోలేదు 


పాంచాలి  పరుల పంచన  దాస్యం  చేసినా ఖిన్నత పొందలేదు 


అరివీర  భయంకరుడు  బృహన్నలైన  దుఖించలేదు  


కొండలనే  పిండి చేసే  భీముడు  వంటవాడైన  వగచలేదు  


వారికన్నా  గొప్పవా  మన కష్టాలు  ....................


ఈ  మాత్రనికేనా  పిరికి పందలై  వుసురులు  తీసుకుంటున్నాము 


సిగ్గు చేటు  కాదా ............ సోమవారం, జులై 23, 2012

సాక్షిగా


స్వేచ్చా విహంగం పరుచుకున్న రెక్కలపై 


వినువీధుల  విహరించని  ప్రేమ  దేవతను 


నిండు గర్భిణి అయిన  నీలి మేఘ ఛాయలలో 


పాడిపంటల  పురుడు  పొసుకొనీ  పుడమి తల్లి 


కారుణ్య నేత్రాల  ప్రకృతి  తల్లి  ఒడిలో 


కలసి  సాగుదాం  చేతులు  కలిపి ఈ ప్రపంచం  సాక్షిగా 

ఆదివారం, జులై 22, 2012

రేపటి వెలుగులు

ఆకాశం  చాల నిర్మలంగా వుంది 


మౌనంగా  బయలుదేరటం  మంచిది 


ఎంతగా  ఏడిచినా 


మొలకలేతవ్వు  పూడ్చిన  విత్తనాలు 


సమాధుల  నిదురించే  కళ్ళు 


కన్నీరు  కార్చలేవు 


జీవితపు  నీలి నీడలు 


పరుచుకున్నాయి  అదృష్టం  పై 


సూర్యోదయ  ఆశా  కిరణాలూ 


నిన్నటి  చీకటిని  నిర్జిస్తాయి 


రేపటి  వెలుగులు  పంచుతాయి .

శుక్రవారం, జులై 20, 2012

చూడు మరీ నా తఢ కా

తిరువెంకట  నాధుని  ప్రసాదం  కూడా  కల్తినా 

మరీ  చోద్యం  కాక పోతే  ఏమిటిది  మరలు , మత్తు , ఉప్పునా ......

మానవ  నీచ  ప్రవృత్తి కి  ప్రత్యక్ష  నిదర్శనం  నిర్లక్ష్యానికి  పరాకాష్ట 

రేపు  విషం  చిమ్మరని  గ్యారంటి  ఏమిటో 

విషపురుగు లకన్నా  నీచమైన  రాజకీయాలతో 

తిరుపతి  లడ్డులో  మరలు , మత్తు , ఉప్పు  

కలిపి  చూడు మరీ  నా తఢ కా  అన్నట్టు  ఉంది 

శుక్రవారం, జులై 06, 2012

ఆత్మ కథ

ఆత్మ కథ  అంటే  ఆత్మస్తుతి  కాదు Adirondack Chair


పరనిందా సుత్తి  అంతకంటే  కాదు 


మానిన  గాయాలను  రేపటం  అంతకంటే  కానే  కాదు 


ప్రజాజీవనం  గడిపేవారు  ప్రాజ్ఞులై  వ్యవహరించాలి