గురువారం, మార్చి 22, 2012

బహవో దుర్లభః చ యేవ యె త్వయా కిర్తితా గుణః

రామాయణం - బాల కాండ 
          సర్గ - 1నారద ఉవాచ :-
               7
బహవో  దుర్లభః చ యేవ యె త్వయా కిర్తితా గుణః 


మునే వక్షయామి ఆహామ్ బుద్ద్వా తైర్ ఉక్తః శ్రుయతాం నరః 


బహువో = చాలా ;


దుర్లభః = కష్టం ;


చ యేవ యె త్వయా = నీవు ఇప్పుడు స్వయముగా ;


కీర్తిత గుణః = కీర్తించబడిన గుణములు కలవాడు ;


వక్ష్యామి =  తెలియజేయుము ;


ఆహామ్ బుద్ద్వ= నీకు బ్రహ్మ ;


తైర్యుక్త = తగిన వాడు ;


శ్రుయతాం = నీవు విన్న ;


నరః = నరుని గూర్చి ;


ఓ వాల్మీకి మహర్షి నీవు స్వయముగా కీర్తించి చెప్పిన లక్షణములు గుణములు గల వాడు లభించటం చాలా కష్టము .నేను బ్రహ్మ ద్వార  తగిన నరుడు గూర్చి తెలుసుకున్నాను .   • లభించటం చాలా కష్టం  అంటే 
  • రాముడు లాంటి వాడు ఏ లోకాలలో లేడు 
  • అనేది స్పష్టము అయినది.
  • త్రేతాయుగాములోనే కష్టముగా వుంటే 
  • ఇప్పుడు మనము ఆశించటం మరీ అన్యాయమౌతుందేమో .
  • నారద మహర్షి పలికిన మొదిటి మాటలు 
 వాల్మీకి ప్రశ్నకు  .....
సమాధానముగా ....
బహు కష్టము  కానీ ....
బ్రహ్మ చెప్పాడు అంటూ ముగించాడు .

ఒక విషయము పై ఆసక్తి కలిగేల చెప్పే విధానము 
మనము చాల నేర్చుకోవాలి .


వక్షయామి / వకాశ్యామి = మొదటి శబ్ద అక్షరం వక్ష - హృదయం అని ... రెండవ శబ్ద అక్షరం వకాశ్యామి  - వచించిన అని అర్థం .
శబ్ద ప్రయోగముతో చక్కటి  రెండు మూడు అర్థాలు వచ్చే విధానముగ అక్షరాలను తీర్చి దిద్దారు .
 ఇలా చాల కనిపిస్తాయి  మన ఈ రామాయణములో