శుక్రవారం, మే 24, 2013

శోష తీర్చమ్మ

ఓ...., 

చిరు జల్లు 

వగాలడిలా వచ్చి 

పలకరించి పోకుమా 

వడగాలుల  సుడిలో చిక్కి  పోతాను 

ఆకులూ రాలినట్లు రాలుతున్న జనాల 

జాలితో  చేరదిసే  చల్లని అమ్మలా వచ్చి  శోష తీర్చమ్మ 
లక్ష్మీనరసింహ కళ్యాణం

ఒక  అందమైన  భావన 

మంచు  ముత్యంలా  కళ్ళ  ముందు  మెరిస్తే 

మనసు యెంతో  భావుకతకు  లోనవుతుంది 

ఒక  అందమైన  ఉహా 

చిరు  దివ్వెలా  వెలుగు పంచుతూ  ఎదురుగా  వస్తే 

హృదయం  యెంతో  ఉద్వేగానికి  గురి అవుతుంది 

లక్ష్మీనరసింహ కళ్యాణం  అంతే  ఉద్వేగానికి  తీసుకొని పోతుంది 

ముచ్చటైన కళ్యాణం

 వేదమంత్రాలు సాక్షిగా 

నాద వాద్యాలు  తోడుగా 

లక్ష్మీ  నరసింహుల కళ్యాణ వేడుక  జరిగింది  

అమ్మవారు  యెందుకో  ఆవైపు  తిరిగారు 

అలుకనేమో  అయ్యవారి పై 

అయ్యవారేమో  ఏమిటో  ఈవైపు  తిరిగారు 

కినుక  వహించారేమో  ఆమె పై 

కొంచెం  కష్టమైనా  చాల ఇష్టమైన  పెళ్లి 

సకల జనుల  ఆమోదమైన  అందమైన  పెళ్లి 

లక్ష్మీ  నరసింహుల ముచ్చటైన  కళ్యాణం జరిగే లోక కళ్యాణార్ధం   !!

గురువారం, మే 23, 2013

ఇలా ఉన్నాను

ఈ  కోట  శిధిలాలలో 

నా మనసు అద్దం పారేసుకున్నాను 

ఆ పగిలిన అద్దం ముక్కల వలె  

ఈ  మొండి  ప్రాకారాలతో ఇలా ఉన్నాను 
మరణాన్ని సహితం ఆహ్వానిస్తాను

ఈ చల్లన్ని పిల్ల  తెమ్మెరలు 

ఆ  నింగిని  ఎగిరే  తెల్లని  పావురాలు 


నిదురించే  ఊహలకు  ఊపిరులు  పొస్తాయి 


మొలకలెత్తె  కలలకు  ఇంద్ర ధనస్సు  రంగులు  పూస్తాయి 


స్వేచ్చకు  ప్రతీకాలు  ఈ  ప్రకృతి  ప్రతి  రూపాలు 


మరణం  సహితం  అందులో  భాగమే 


అందుకే   మరణాన్ని  సహితం  ఆహ్వానిస్తాను - స్వేచ్చ లభిస్తుదంటే  !!
బుధవారం, మే 22, 2013

స్వయం ప్రకాశుడే

తన దేదీప్యైమైన కాంతులతో 

అందరిని అలుముకున్న చీకట్లు తొలగించే ప్రమిద 

తన అడుగున ఆక్రమించు కున్న చీకటిని  తొలగించలేదు  

యెంత  జ్ఞానవంతుడైన తనలోని అజ్ఞానాన్ని తొలగించుకో లేడు 

అహంకార  అజ్ఞాన చీకట్లను తొలగించుకొనువాడు స్వయం ప్రకాశుడే 

ఏ సూరీడు కానడు

ఆకాశం ఆవాల 

నిదురించే  ఊహలను 


నీ వాడి చూపులతో చెదర గొట్టకు 


తెనేటిగల్లా చుట్టుముట్టె  మొహాలను  ఒదార్చలెవు !!


కాటుక కన్నుల బరువు మోయ గలవాడు ఈ భూ మండలం పై లేడు !!


ఎర్రని పెదవుల మాటున బరువెక్కిన గుండెల బాధలు ఏ సూరీడు కానడు !! మంగళవారం, మే 21, 2013

చేపల గబ్బు కంపు


నిజ జీవన చిత్రాలు 

చిత్ర విచిత్ర సమాహారాలు కావు 

మన ఊరి మనుషుల్లా సాద సీదా 

ఊహల్లో ఊరి చెరువు చేవులురిస్తుంది 

యెదురుగా నుంచుంటే చేపల గబ్బు కంపు  

ఇంతకన్నా జీవన సత్యం యే పాఠం తెలుపలేదు , తెలుసుకొంటే !!


నా చిన్ని కన్నా
నల్లనయ్యాయని 


నవనీతచోరాయని 

నిందలాడిన గొల్ల భామలను 

విషముకుడుపగా వచ్చిన పూతనను 

సాందీప మునిని , సఖుడు కుచేలులను 

తారతమ్యం యెరుగక కరుణతో బ్రోవ లేదా 

నేనేమి చేసితినని నాపై కినుక వహించితివి నా చిన్ని కన్నా 

సీనియర్ న్యాయవాది శ్రీ కామగారు రామకృష్ణ రావు


సీనియర్ న్యాయవాది

శ్రీ  కామగారు రామకృష్ణ రావు గారు

కానరాని లోకాలకు తరలి వెళ్లి నారు

తన  కీర్తి  శిఖరాలను మనకు గుర్తుగా వదలి

వారి ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ...

వారికివే మా నమః సుమాంజలులు .. జోహారులు 

సోమవారం, మే 20, 2013

శ్రీ లక్ష్మి నరసింహపిలిచినంతనే ..

స్తంబము  చేధించి 

హిరణ్యకుని  వధించి 

బ్రోవ లేదా  ప్రహ్లాదుని  !!

మొరాలించినంతనే .... 

ఒడలు మరచి పరుగు పరుగున 

మకర  మృత్యు  ముఖం  దృంచి 

కాపాడలేదా  కరి రాజుని  !!

యెంత పిలిచినా...  

యేమారక ఉండేవు 

అంత వారము  కాము 

కాని , నీ నిజ భక్తులము 

కరుణించవయ్యా  శ్రీ లక్ష్మి నరసింహ !!
పాకుడు రాళ్ల

 క్షార జలముల వీడి 

క్షీర  జలముల  జేరు 

మోక్ష  మార్గపు  మెట్లు  పట్టు చిక్కు !

పాకుడు  రాళ్ల పై  పట్టు నెటుల చిక్కు 

పక్ఖు మని నవ్వరా  పరమ పురుషా  !!

నారసింహుని నమ్మునారసింహుని  నమ్ము 

నరకములు ఏవి నిన్ను అంటవు 

కష్టములనే కరి రాజములు భీతిల్లు 

మృగధర రాజీవ నేత్రముల ఎరుపు జీర జూసి 

స్తంభం ఛెదించి, నిభిడాంద కారముల ద్రుంచి 

కావగ లేదా పసివాని పరమ పావనుని ప్రహల్లదుని 


నారసింహుని  నమ్ము 

నరకములు ఏవి నిన్ను అంటవు 
ఈయన మహిమే

భలే చోద్యం 

పాత్రికేయుల  సేద్యం 

ఈయన హస్తినకు వెళుతున్నాడు అని 

ఆయన ఇద్దరు మంత్రుల తొలగించాడు అట 

మరీ చోద్యం కాక పోతే ప్రతి ఒక్కటి ఈయన మహిమే అనలేదు !

శనివారం, మే 11, 2013

నీ దంటు ఒక ప్రత్యేక స్థానం ఉంది

అనంతమైన  విశ్వంలో 

పయనం  ఎటు వైపో నీది 

లెక్క లెన్నని  దారులు 

ఆత్రంగా పిలుస్తున్నాయి నిన్ను 

అయినా ........   ఆఖరికి...... 

అన్ని నదులు పారేది సంద్రం లోకే 

అన్ని నడకలు  సాగేది మరుభూమికే 

అలా అని  నిరాశ  నిశ్రుహులతో  గడపకు  జీవితం 

జీవితాన్ని  హుందాగా , ఆహ్లాదంగా  జీవించటం నేర్చుకో 

అనంతమైన  విశ్వంలో  నీ కంటూ , నీ దంటు  ఒక ప్రత్యేక స్థానం ఉంది 

బీడువారిన గుండె

ఓ .... వానా !

ఓహో  ...... వానా 

పైన మబ్బుల్లో దాక్కునావా .... 

క్రింద నీ కోసం ఎండిన గొంతులు తడుపుకుంటున్నాము 

మబ్బుల విహారం నీకు హాయి ..... హాయి ... 

బీటలు వారిన గుండెలతో మా బతుకులు బండ బారాయి  !

ఆ వంక పాల పుంత దారినుంచి  గంగమ్మ లా ఉరికి వురికి రా ! 

ఆ మహా దేవునిలా నిన్ను ఆసాంతం ఈ బీడువారిన గుండెల్లో

 కలకాలం  పదిలంగా దాచు కుంటాను..............................  !!


బుధవారం, మే 08, 2013

అంతా కాల గర్భంలోకే

పుట్టుక ముందు అన్ని వుహలే 

చచ్చాక అంతా ఏడ్పులే ఎక్కడైనా 

మధ్య జీవితం ఒక పెద్ద పర్వతారోహణం 

అన్ని ఆలోచనలు ఆగేది సమాధి వద్దే 

మిగిలినవి వెనక ఉన్నవారి జ్ఞాపకాల్లో 

ఆ తరువాత అంతా కాల గర్భంలోకే 

పీకి పాకేసిన

ఇంట్లో 
ఎలుకలు ఎక్కి పారుతున్నాయని 
ఇల్లు పీకి పాకేసిన  కర్ణాటక బి. జె. పి . 

అల్లుడా వచ్చి చక్కగా ఏలుకోవయ్య 
అంటే 
గిల్లుడై గిల్లికజ్జాలతో ఉన్నది పోగొట్టుకున్న కర్ణాటక బి. జె. పి .


ఎగిరెగిరి పడ్డ ఎడ్ద్యురప్ప 
ఎంగిలాకుల ఎన్నికలలో యెగిరి పోయె 

శుక్రవారం, మే 03, 2013

శూన్యం

జ్ఞాపకాలు 
గుండె తలుపు తట్టాయి 
హృదయపు కవాటాల కిటికీ నుంచి 
శూన్యం తొంగి చూసి వెక్కిరించింది