శుక్రవారం, అక్టోబర్ 19, 2012

ఋషికొండ అలలు

ఋషికొండ అలలు 

అమాయకులైన 


పసిపిల్లలను 


ఒడిసి పట్టుకుని 


పోతుంటే 


అందరం 


నిశ్చేష్ట  స్వరూపం లై 


చేష్టలుడిగి 


శవాలతో  పోలేని 

జీవశవాలై  మిగిలాము 

ఆదివారం, సెప్టెంబర్ 16, 2012

ముదిమితనం

భూమి అంచుల నిలబడి 

ఆకాశం  అంచులు  తాకాలని 

యెన్నో మార్లు  అనుకున్నా 

భూమి  అంచులే  కనబడనప్పుడు 

ఆకాశం  అంచులు  తాకేదేలా 

మరుగ్గుజులకు  అంతా అఖండమే 

ఖండాన్చుల  చేరాలంటే  ఎదగాలి  పై పై కి 

ఎదిగే  అవకాశాలు కోసం అన్వేషణలో  

ఎదురై  నిలిచింది  ముదిమితనం  నేనున్నానంటూ .

మంగళవారం, ఆగస్టు 21, 2012

చివరి వరకు .....నీవు  నడచి  వచ్చిన  దారి 

క్రమేణా  కనుమరుగు  అవుతూ  ఉంది 

దారి  చూపిన  మైలు  రాళ్లు  ఒక్కోకటి  మాయమౌతున్నాయి 

తిరుగు  లేని  ఈ  ప్రయాణంలో  మౌనంగా  సాగిపోవటమే  చివరి  వరకు.....

నీ  ముందు  వున్న  దారి ........................|

మంగళవారం, ఆగస్టు 07, 2012

ఆరాధన

మేఘ మంగళ  జర్ఝారి  ఘోష తరంగాలలో 


ముకుళిత వందన హస్త్తుడఆయే వాన దేవుడు 

భీషన సుడిగాలుల  వీచేటి వాయు దేవుడు 

సుమగందముల మరిచికల  వీచే  మనోహరముగా 

అనాధ నాద సర్వజ్ఞా  సర్వజనులు 

నీ ముందు మోకరిల్లిరి 

కరునాతరంగా కమలాలయా 

కాన్చవయా  మా కరువుతీర 

నీ ఆరాధనా కోరి 

నీ ఆరాధనకు  వచ్చాము 

ఆదరించవయ్య  మమ్ముల 

శ్రీ సద్గురు  రాఘవేంద్ర 
గురువారం, ఆగస్టు 02, 2012

వెలుగు తెచ్చే ధైర్యం


పశ్చిమాద్రి లో  పర్వతాల  అనుంచు నుంచి 


జాలువారుతోంది  వెలుగు రేఖ నెమ్మది నెమ్మదిగా 


ఆవురావురు మంటూ  పెను చీకటి  ఒడలు విరుచుకుంది 


వెలుగు రేఖలను  అమాంతం  తనలో   కలుపుకుంది 


నిశ్చేటలైన  జీవరాసులు  గుంపులు గుంపులు  గూటికి  చేరుకున్నాయి .


బిక్కు బిక్కు మని  దాకున్నాయి 


ఉషోదయం లో  మళ్ళి  వచ్చిన  సూర్యుణ్ణి  చూసి  కిల కిలా  రావాలతో 


కలకలములు   శ్రుష్టించాయి .


వెలుగు  తెచ్చే  ధైర్యం 


చీకటి  పెంచిన  భయాన్ని  తొలగించింది .

బుధవారం, ఆగస్టు 01, 2012

సెలవు నేస్తం

నెలల పాపగా వచ్చావు 

నేలరేడువై  వెలిగావు 

పప్పీ గా స్థానం పదిలపరుచుకున్నావు 

పన్నేడుల్లు  మాలో  ఒకరిగా  జీవించావు 

తుది శ్వాశ  నా చేతులలోనే  వదిలావు 

వీడుకోలు  వేడుక కూడా  నా చేతుల్లోనే  తీర్చుకున్నావు 

నా రాక  కొరకు  ప్రాణాలు వుగ్గబట్టినావు  సెలవు  నేస్తం 

సెలవు  నేస్తం 

అందుకే నీవు దేవుడవు

ఇరు సంధ్యలలో  బంగారు పూలతో  పూజించు 

నిను  సూర్యభగవానుడు  స్వయముగా తానే 

15 దినములకోకమారు  వెండి వెన్నెలల ధూళి తో 

నిను సేవించి  తరించును  ఆ రే రాజు ఎలప్పుడు 

10 మాసముల కొకమారు  వర్ష రుతువులో 

నిను  అభిషేకించు  ఆ వరునదేవుడే  స్వయముగా 

అను నిత్యం  పూల  పరిమళాలు వేదజేల్లి 

నీ  సేవలో  తరించి పులకిన్చిపోవు  పూల కొమ్మ 

అయితే  నేను  ఏనాడు  

నిను  దర్శించి  ఎరుగను , తలచి  ఎరుగను 

అయినా  నా పై  అపరా కరుణ కురిపించినావు 

అందుకే  నీవు  దేవుడవు 

అందుకేనేమో మనిషికి ఈ చపలత్వం

కాంతి కిరణాలు  చక్కగా  నిలువుగా  వుంటాయి 

నీటి  బిందువులు  వృతాకారం గా  వుంటాయి 

ఆలోచనేలే  వంకర టింకరగా  వుంటాయి 

అందుకేనేమో  మనిషికి   ఈ  చపలత్వం 

మృత్యు ఘడియలు సమీపించు వేళ

అన్న పానీయములు  రుచించవు 


ఆర్భాటము  ఆవేదనా  తప్ప 


మృత్యు  ఘడియలు  సమీపించు  వేళ 

ఆదివారం, జులై 29, 2012

చచ్చేదాకా చపలత్వం పోదు .
కోరికలు నాగుపాములై  బుసలు కొడుతుంటే 


శిఖరాగ్రాన  నుంచున్నా  సహాయం  కొరకు 


అర్థించే  చేతులకు  ఆలంబనగా  మేఘమాల  వారధి  పరిచే 


అయినా  చపలత్వం  చావలేదు 


కోరికలలో  మునిగి  లొంగి పొవాలో  


ఆ అమృత  హస్తాల  నందుకొని  ఆవలి  తీరం  చేరాలో 


చపలత్వం  చావదు 


చచ్చేదాకా  చపలత్వం  పోదు .

శుక్రవారం, జులై 27, 2012

సిగ్గు చేటు కాదా ............

పాండవులు  పడరాని పాట్ల  పడ్డా  ధైర్యం  కోల్పోలేదు 


పాంచాలి  పరుల పంచన  దాస్యం  చేసినా ఖిన్నత పొందలేదు 


అరివీర  భయంకరుడు  బృహన్నలైన  దుఖించలేదు  


కొండలనే  పిండి చేసే  భీముడు  వంటవాడైన  వగచలేదు  


వారికన్నా  గొప్పవా  మన కష్టాలు  ....................


ఈ  మాత్రనికేనా  పిరికి పందలై  వుసురులు  తీసుకుంటున్నాము 


సిగ్గు చేటు  కాదా ............ సోమవారం, జులై 23, 2012

సాక్షిగా


స్వేచ్చా విహంగం పరుచుకున్న రెక్కలపై 


వినువీధుల  విహరించని  ప్రేమ  దేవతను 


నిండు గర్భిణి అయిన  నీలి మేఘ ఛాయలలో 


పాడిపంటల  పురుడు  పొసుకొనీ  పుడమి తల్లి 


కారుణ్య నేత్రాల  ప్రకృతి  తల్లి  ఒడిలో 


కలసి  సాగుదాం  చేతులు  కలిపి ఈ ప్రపంచం  సాక్షిగా 

ఆదివారం, జులై 22, 2012

రేపటి వెలుగులు

ఆకాశం  చాల నిర్మలంగా వుంది 


మౌనంగా  బయలుదేరటం  మంచిది 


ఎంతగా  ఏడిచినా 


మొలకలేతవ్వు  పూడ్చిన  విత్తనాలు 


సమాధుల  నిదురించే  కళ్ళు 


కన్నీరు  కార్చలేవు 


జీవితపు  నీలి నీడలు 


పరుచుకున్నాయి  అదృష్టం  పై 


సూర్యోదయ  ఆశా  కిరణాలూ 


నిన్నటి  చీకటిని  నిర్జిస్తాయి 


రేపటి  వెలుగులు  పంచుతాయి .

శుక్రవారం, జులై 20, 2012

చూడు మరీ నా తఢ కా

తిరువెంకట  నాధుని  ప్రసాదం  కూడా  కల్తినా 

మరీ  చోద్యం  కాక పోతే  ఏమిటిది  మరలు , మత్తు , ఉప్పునా ......

మానవ  నీచ  ప్రవృత్తి కి  ప్రత్యక్ష  నిదర్శనం  నిర్లక్ష్యానికి  పరాకాష్ట 

రేపు  విషం  చిమ్మరని  గ్యారంటి  ఏమిటో 

విషపురుగు లకన్నా  నీచమైన  రాజకీయాలతో 

తిరుపతి  లడ్డులో  మరలు , మత్తు , ఉప్పు  

కలిపి  చూడు మరీ  నా తఢ కా  అన్నట్టు  ఉంది 

శుక్రవారం, జులై 06, 2012

ఆత్మ కథ

ఆత్మ కథ  అంటే  ఆత్మస్తుతి  కాదు Adirondack Chair


పరనిందా సుత్తి  అంతకంటే  కాదు 


మానిన  గాయాలను  రేపటం  అంతకంటే  కానే  కాదు 


ప్రజాజీవనం  గడిపేవారు  ప్రాజ్ఞులై  వ్యవహరించాలి 

మంగళవారం, జూన్ 26, 2012

ఆఖరికికరిగే కాలంలో శిలలా ఎన్నాళ్ళు  ఇలా  మిగిలిపోతావు 

కసి ద్వేషం దుర్మార్గం స్వార్థం  చేతుల్లో  ఎన్నాళ్ళు  ఇలా  నలిగిపోతావు 

నిన్ను నమ్ముకున్నవారిని ఇలా ఎన్నాళ్ళు  కుళ్ళబెడతావు 

నీవు  సాధించింది  ఏమిటి  నిశ్శబ్ద  స్మశాన  సామ్రాజ్యం 

ఎలటానికి  సమాధులు  తప్ప  ఎమ్ముంది  ఇప్పుడు 

ఇప్పుడైనా  మారు  లేదా 

ఆ సమాధులలో  నీవు ఒక సమాధి అవుతావు  

ఆఖరికి 

ఆదివారం, జూన్ 24, 2012

k.venkoba rao and smt. k. anasuyamma

                         ప్రాణానికి  ప్రాణం  అయిన  ప్రాణ నాధుడు పోయే 


పతివియోగ  దు :ఖం  దూరం కాదు సతి  కంట  కన్నినీరు  నిలిచి పోదు 


రెక్కలు  తెగిన  పక్షిలా  పక్షవాతం  కమ్మి  విగతజీవి లా విలపించే 


భవ భందనములు  తెంప  ఆ రాఘవేంద్రుడే  ఒసగే       కడకు  మోక్షము 

కీర్తి శేషులు శ్రీ k . వెంకోబరావు మరియు శ్రీమతి అనసూయమ్మ

కీర్తి  శేషులు  శ్రీ  k . వెంకోబరావు  మరియు  శ్రీమతి  అనసూయమ్మ 
జంట  బాయని  జంట ; జంటగా ఎగిరిపోయే భువినుంచి దివికి   

బుధవారం, జూన్ 20, 2012

ప్రకృతి

తొలకరి వానలతో

వనాలు , గిరులు , ఝరులు

పులకరించి  పోతున్నాయి

తడిఆరిన  గొంతులు

మెలమెల్లగా  లేస్తున్నాయి

కుహు  కుహు  రాగాలతో

కొండలు కోనలు  మారుమ్రోగి  పోతున్నాయి

నింగి  ఘాడ పరిష్వంగంలో

నేలతల్లి  పరవశించి  పోతున్నది

ప్రకృతి కాంత లా  పరుగులు  తీస్తున్నది 

అన్యాయ మూర్తి
ఆఖరికి  జడ్జి కూడా  జైలు పాలు 


పట్టాభికి  గాలి సోకింది 


లంచం దెయ్యం పట్టింది 


అంతటి  అవినీతి న్యాయమూర్తి   


చివరికి  అన్యాయ మూర్తి గా నిలిచాడు 

ఆదివారం, జూన్ 17, 2012

మనసు
పరి పరి విధముల పరిగెత్తేనే  


ఊసులు పోకా  ఊపిరాడక 


ఊయల మంచపు డోలికలాగే 


డో లనమాయే  నా మనసు 


ఆందోళనమాయే  నా మనసు 

సోమవారం, జూన్ 11, 2012

మృత్యువు


మృత్యువు  కౌగిలి  కోరేవారు  ఏ  కోరికల కై  పరుగులు  తీయరు 


అసహాయ  జీవుల  అంతరంగ తరంగం లో  ఆఖరి అంకం  అదే 


కాలయముని  కరుణా  కటాక్ష కొరకు  ఊపిరి  ఉగ్గ  బట్టి  బ్రతుకు  బండి లాగుతుంటారు 


ఆఖరి ఘడియల  ఆవిష్కారానికి  ఆశకావేశాలతో  రగిలి పొగిలి పోతువుంటారు 


జుగుప్స  గగ్గుర్పాటు  ఏవగింపు  ఏడ్పు  కలగలసి  జీవిత చరమాంకం  అంచుల  అటునిటు  ఊగి  పోతారు 


నిస్సహాయులై  నిసృహుల  నిట్టురుపుల  నిప్పులలోన  మగ్గి  మగ్గి  మసి  బారి పోతారు 


ఏ స్పర్స  స్వాంతన  నివ్వదు  ఏ  మందు  పని  చేయదు  యమ కర స్పర్స తప్ప 

ఊహా సుందరి

ఎగిరే గాలి పటంలో  సూత్రం లా 


దాగున్న పూలదండ లో  దారం లా 


చిగురాకుల చివురులలో మెరిసే  మంచు ముత్యం లా


లేత గులాబి అధరాల పై మురిసే చిరునగవుల దరహాసం లా 


నీలో మిగిలిపోనా  నిన్నంటుకునే  నీ నీడలా నిలిచిపోనా 

ఆదివారం, జూన్ 10, 2012

చట్టం కళ్ళు ఎదురుగా విడివడి పోయే

యెట్టకేలకు  వివాహబంధం  తెగిపోయింది  
న్యాయం చట్టం సాక్షిగా 
బాసలు ఆశలు  అడియాసలు అయ్యాయి 
కలలు కోరికలు కన్నీటి చుక్కలై  దొరలిపోయాయి 

పాషాణ హృదయం కటిన కాసారమై పోయే 
కన్నీరు వరద కూడా కడగలేక పోయే 
బంధాలు బాంధవ్యాలు బందనాలను నిలుపలేక పోయే 
సుడి గాలిలో చిగురాకులా చిరిగి చిరిగి పెలికలైపోయే 

అహంకారం ముందు మమకారం ఆవిరైపోయే 
అవివేకము  ముందు  వివేకం విస్తుపోయే 
అనలోచితలలోకంలో అనాలోచిత సుడిగుండంలో 
అన్ని ఆశలు ఆశయాలు వడి వడి గా సుడి వడి పోయే 

విడాకులే మామిడాకులై వియోగమే సమాగమై 
చట్టం కళ్ళు ఎదురుగా  విడివడి పోయే 

శుక్రవారం, మే 25, 2012

చక్కని రంగుల రాట్నం .
భావ  వ్యక్తీకరణ  ఒక  చక్కని  విద్య  

చూపులతో  భావ  వ్యక్తీకరణ  అందులో  మహోన్నతమైనది 

హావభావాలతో  వ్యక్తీకరించటం  మరో  చక్కని  మార్గం 

అతి ప్రేమ  జీవులలో  అసహన  జీవులలో  ఇది  ఎక్కువగా  కనిపిస్తుంది 

అసహనాన్ని  ఎంత  అహస్యంగా  చూపుతారో  అబ్బో  అనిపిస్తుంది 

ఎందుకు  కదిలించామురా  బాబోయి  అనిపిస్తుంది 

ఇందుకు  పూర్తి  విరుద్దము  అతి  ప్రేమ  ఇదేమి  ఫెవికాల్  రా అబ్బో  అనిపిస్తుంది 

మధ్యస్తంగా  వుంటే  గర్వం  అనుకున్న   దూరంగా  వున్నా మర్యాద  ఇస్తారు 

ఇలా  అన్ని గుణాలలో  మూడు  నాలుగు    రకాల  మనుషులు  అగుపిస్తారు 

ఎందుకు  ఇంత  వైదిధ్యమైన  పాత్రలు  ప్రతి  సమాజంలో  కనిపిస్తారు 

 వారే    ఈ  జీవన   గుభాలింపులు  తిరగమాత  లాంటి  వారు , వారు  లేకపోతే  జీవన  వైవిధ్యమే  లేదు .

 షడ్రుచులలా  అన్నిరకా ల  పాత్రల  సమ్మేళనమే  రంగు రంగుల  జీవితం 

  చక్కని  రంగుల  రాట్నం .

గురువారం, మే 24, 2012

ఓ నాటి అమ్మను నేటి ఆట బొమ్మనుచిన్నారి  పొన్నారి  ఆశలతో  పూచిన  పూ రెమ్మను  అందరిలా 

ఆశలతో నా అత్తగారింట  అడుగుడిన  ఆడపడుచును  అందరిలా  

పిల్లలతో పాపలతో హాయిగా సుఖసంతోషాలతో  సాగిని సంసారమే   

కూతురు అల్లులు కొడుకు కోడళ్ళు మనమలు మనుమరాండ్రు లతో  వర్ధిల్లిన  జీవితం  

విధి కేమైనదో  జంటగా  ఉన్న   మమ్ము విడదీసింది   నను ఏంతో  వేధించింది  వ్యధల  పాల్జేసింది 

తుదకు కసి తీరక  నా రెక్కలు విరచి  అవిటి దాన్ని చేసింది పక్షపాతంతో  నాకు  పక్షవాతం ఇచ్చింది 

నేను  ముద్దాడిన  నా కొడుకే  నాకు అమ్మ  అమ్మనైన  నేను  ఆఖరికి  నా బిడ్డ   చేతి  బొమ్మనైపోయను 

వ్యధ  ముసరగా  ముద్దదిగదు  అచేతనంతో  ఆఖరి పిలుపుకై  ఎప్పుడా అని  ఎదురుచూస్తున్నాను 

ఓ  నాటి  అమ్మను   నేటి  ఆట  బొమ్మను 

దేవుడు  ఆడిన  చదరంగలో  ఆఖరికి  ఓడిన  రాణిని  - విరాగిణిని 

స్నేహం


స్నేహం  ఒక  తీయని  బాట  

పడదోయదు  ఏనాటికి 

గన్నేరుల  పల్లెరుల  రానీయదు  దరి 

దుఖః ముల   దాహముల  తీర్చేటి  దొరి 

 నీ నీడ నీజాడ మరిచినా  నిను ఏనాడు  మరువని తోడు 

నీ వారు  నిను  ఎవగించిన  నిను ఏనాడు  వీడని జోడు 

ప్రతిధ్వనిలా  ఓయని  పలికే  నీ  ఆమని 

ప్రతిక్షణము  నిను పరిరక్షచించే ఒక  పరిభ్రమణ  సుదర్శన  చక్రం 

స్నేహం  పరమ  పవిత్రం  ప్రియురాలి  వలపుల కన్న  

స్నేహం  ఒక  నిశ్చల  తత్వం  చలించదు  జవరాలిలా 

పరీక్షల  రాళ్ళు  వేసి  చెడగొట్టకు ఆ  నిశ్చల  అంతరంగాన్ని 

చెడగొట్టకు  ఆ  నిర్మల  నిశబ్బ్ద  ఘాడ  సమాధి  స్థితిని .

బుధవారం, మే 23, 2012

నేను మీ వికృత స్వరూపాన్ని

Fire World

గగనతలం నా  ఛత్రం -  దిన  పాలకులు  నా  దిక్పాలకులు 

కాలం నా ముంజేతి  కంకణం - యమపాశం  నా  చేతి  శూలం 

నిత్యాగ్నిహోత్రాలు  నా  రెండు  కళ్ళు - బుగబుగలు  బుసబుసలు  నా  దీర్గశ్వాసాలు 

రుద్రులకు  రుద్రుడను  మహావీర  భద్రుడను - నేనే  ప్రళయకాల  ఘోషా  సముద్రుడను 

నా ధీర్ఘ   బాహువులు  ఉప్పొంగే  ఉప్పెనలు  -  నా  దీర్ఘ  శ్వాసలు  సుడులు తిరిగే వడగాడ్పులు 

నా ఉదరాగ్ని గోళాలు బడబాగ్నులు చిమ్ము -  నా  పదఘట్టలు భునభొంతరముల  కుదుపు 

మీ  పాపపంకిలల  ప్రతిఫలాన్ని - మీ హ్రుదయాన్తరంగాల  చీకటి  కోణాన్ని 

మిమ్ము  దహియించ  వచ్చిన  మీ  భస్మాసుర  హస్తాన్ని - నేను  మీ  వికృత  స్వరూపాన్ని  

సోమవారం, మే 21, 2012

ప్రజలను దేవుళ్ళను చేసి చూపులు నీకు మేపులు మాకు  •   నీతి  నేతి  బీరకాయ అయింది  జాతి  రూపురేఖలు  మార్చింది 


  •   వార్తలు  రసవత్తర  కథలతో   యదార్థ  స్వరూపాన్ని పోగొట్టుకుంది 


  •  ప్రేక్షకుల  విశ్లేషణా  గుణాన్ని నాశనం  చేసి అయోమయంలో  తోసింది 


  •  అన్నిటికి  ఆ దేవుడే  చూస్తాడు  కాస్త  అంతా  ప్రజలే  చూస్తారు అయింది 


  • రాజకీయనాయకులు  , పేపరోల్లు , టివి వాళ్ళు , వారు వీరు అనే  భేదం లేదు  అందరు  ప్రజలు  ప్రజలు  చూస్తారు , బుద్ది  చెపుతారు , గట్టిగ  నిలదీస్తున్నారు  అంటారు .
ప్రజలను  దేవుళ్ళను  చేసి  చూపులు  నీకు  మేపులు  మాకు 
అనే  అవలక్షణం  పెరిగిపోయింది , పెరిగిపోతుంది  చివరకు  అందరిని  ముంచబోతుంది 

  

నరుల మర్యాదలు నాలుగు రోజులు వుండు

Lord Venkateswara, SVBC studio in Alipiri, Tir...


నరుల  మర్యాదలు  నాలుగు రోజులు  వుండు 

నారాయణ  దీవెనలు   మన     వెంట  కలకాలముండు 

హారతి కర్పూర అ ర్థం  కోపాన్ని జ్వలించి  వెలుగును పంచమని  

తీర్తప్రసాదలకర్థం  తీవ్రమనో దోషాలమింగి మంచిని పంచమని 

దేవదేవుడే  నపుడు ఎదురేగి  వస్తాడు  కొండంత  వరముల   ఆశీస్సులు  ఇస్తాడు  

ఎదలోన  నిలుపుకొని పులకించిపో   దిన  దినము  తలుచుకుని  సేవించుకో 

ఆదివారం, మే 20, 2012

మోసం

Graphic representation of the brazilian RPG se...

మోసం  ఒక  మసక  తెరలాటిది  - తేర  చాటున  దాగిన  మోహాన్ని చూడనీయదు 

మర్యాదనే   మంచు గోడ  చాటు చేసుకొని  - మొహమాటమనే  ఐసు  నీళ్ళు  చల్లుతుంది 

మాటలతో   మన  మాట  పెగల  నివ్వ దు  - చేష్టలతో    మనలను  నిస్చేష్టలను  చేస్తుంది 

స్నేహం  ప్రేమా  అనే  బంధనలతో  అటు ఇటు మెదలనివ్వదు  - మెడ  మీది  తల  గొరిగేస్తుంది 
శనివారం, మే 19, 2012

ఆకాశం , చంద మామ రోజు మన పెరట్లో కనిపిస్తారని

Moon


ఆకాశం , చంద మామ  రోజు  మన  పెరట్లో  కనిపిస్తారని

 మనకొక్కరికే  హక్కులంటే  ఫక్కున  నవ్వదా  భూలోకం

పారే నీళ్ళు  వీచే  గాలి ప్రతిరోజు  మన  గుమ్మములో కి  వస్తాయని 


 మా ఒక్కరి చుట్టలంటే  ముక్కున  వేలువేసుకోదా  ఈ    లోకం 


మనకు అందుబాటులో ఉండి  మనవి  కానివని  తెలిసి వదులుకోలేము  అనుభంధం 


కన్నపేగు తెంచుకొని  పుట్టిన  మన  పిల్లల  పై  ఎలా  ఒదులు కొగలం  మమకారం 


మన  కందనంతా దూరాన    వున్నారని  మన  కందకుండా  పోయారని 


సర్వే  జన  సుఖినో భవంతు  అనే  మనం  మన  పిల్లలు  సుఖంగా  వుండాలని  కోరుకుంటాం .

ఆరాధనా నిలుపుకోవాలంటే ప్రేమించటం నేర్చుకోవాలి అహంకరించటం కాదు .

యెంత  పెద్ద   వారైన   దురహం కారులు  కారాదు  

ఎదిగే కొద్ది  ఒదిగి  ఒదిగి  వుండాలి  బంగారంలో  పచ్చ  నద్ది నట్లు 

ముద్ద   బంగరాన్ని  కూడా  మూలన  పెడతాము  మెనినా  తోడగం 

ఆరాధనా నిలుపుకోవాలంటే  ప్రేమించటం  నేర్చుకోవాలి  అహంకరించటం  కాదు .

శుక్రవారం, మే 18, 2012

wish you a happy birth day

నా  ఊహలకు రంగులు  అద్ది

 మన  కలలకు రూపం నిచ్చి   

చక్కని  కావ్య  సుందరిలా  

నిను తీర్చి  దిద్దనా 

పూ పెదవుల  పుపొడ్డి గంధం నలరి  

విరితావుల  పరిమళం నద్ది

  నీ మేన  అత్తరులు చల్లనా 

కరి మబ్బుల మెరుపుల ఒరసి 

 జలధారల  ఒరుపులు ఒడిసి 

 నీ  నేన్నడుమున   సోయగ మద్దనా   

వన  సీమల  తారేడే  గగన  సీమల  తిరుగాడే 

వలపుల  చిలుకల  కిల కిలలు 

 నీ చిరునగవుల  చిరునవ్వులు   మెరిపించనా 

పుణ్య  నదీమ  తల్లుల  పుష్కర  తీర్థాల  తెచ్చి 

నిను  పుణ్య వతిగా  అభిషేకం  చేయనా 

నా పూర్వ  జన్మ   శుకృ తమా  

నా  సహ  ధర్మ   చారమా 

నా  ప్రాణమా  

అందుకోమా  నా ఈ   జన్మ దిన  శుభాకాంక్షాలు .