సోమవారం, ఏప్రిల్ 30, 2012

ఎద చీల్చుకొని వచ్చేఈ శోకము ఆ శోక వనిలోని సీతకై

పుడమి తల్లిని చీలుచ్చుకొని వచ్చే వెదురు పొదలార
నీలాఆకాశపు  అంచులు తాకే   నేరేడు  కొమ్మలార 

జల జల గిరులంచుపైనుంచి జాలువారేటి ఝారులార 
తరులార , లతలార , పూతెనె తావేటి తుమ్మెదలార 

సర్వ వనచరులార  నా సహచరులార  నా సహధర్మ చారిణిని కంటిరా 
సకల లోక పావనిని  జనక రాజ పుత్రిని నా సీతను కనుగొంటిరా

జాడ లెరుగను జాబిల్లి నీవైన చెప్పవా 
అడుగు జాడలు లేవు అడివంతా వెతికినా 

నీడ నిచ్చి సేద తీర్చేటి ఫల రాజ వృక్షమా
నీ ఆశ్రయములోన  నిలిచిందా చెప్పుమా 

నింగిపై  ఎగేరేనా నీటి పై సాగెన  బిలములో దూరేనా పొదలలో దాగెన 
ఏడ  తా నున్నదో  నా సీతా  ఎండ కన్నేరుగని భూజాతా

ఎద చీల్చుకొని వచ్చేఈ శోకము ఆ శోక వనిలోని సీతకై 
ఆదివారం, ఏప్రిల్ 29, 2012

ప్రేమంటే ఏమనుకున్నావు

 ప్రేమంటే ఏమనుకున్నావు  - ప్రేమిస్తే సరిపోనా 
  విరహంలో వేగిరమంటూ  - విహరిస్తే సరిపోనా 

 ప్రేమంటే ఏమనుకున్నావు - భాద్యతలకు తొలిమెట్టు 
 ప్రేమంటే ఏమనుకున్నావు - బంధనాలకు అది పట్టు  

 ప్రేమంటే ఏమనుకున్నావు - శ్రీనాధ ప్రభంద కావ్యం 
 ప్రేమంటే ఏమనుకున్నావు - పోతన గజేంద్ర మోక్షం 

 ప్రేమంటే ఏమనుకున్నావు - శృంగారం , సింగారం , బంగారం 
 ప్రేమంటే ఏమనుకున్నావు  -  కర్త కర్మ క్రియ అంతః కరనేన్ద్రియం


పునాదేలేని శిధిలభవనంలా మిగిలిపోయిందిలా

 అనాధకు లేదా ప్రేమించే అర్హత  
 అనాదినుంచి చేస్తున్నావివక్షత 
 ప్రేమకు సమాధి కడతారు     
 పెద్దలమంటూ చెపుతారు 

 అనాధ నాధ బంధాలు  ఈ పై పై మనిషికే 
 అందరూ నా బందువులే నాలోని మనసుకు 

 బెదిరిస్తే ఎదిరిస్తామని 
 మాటల మంత్రం వేసారు వేరు వేరుగా చేసారు 
 చేతల గారడి చేసారు జీవశ్శవాల  జేసారు 

 విరిచేస్తే విడిపోతామని 
 విరుపు మాటలు విసిరారు విడి విడిగా చేసారు 
 మాటల తూటాలు పేల్చారు ప్రేమను సమాధి చేసారు 

 అనాధ ప్రేమ  అయింది అనాధలా 
 పునాదేలేని శిధిలభవనంలా మిగిలిపోయిందిలా
కుప్ప కూలుతున్నాయి సరుకేలేని స్టాకు మార్కెట్ లా

కాటుక కన్నులు కరువాయే  జాజుల సిగలే లేవాయే 
గాజుల గలగలలు ఎటుపోయే  మొగ్గల సిగ్గులు ఏమాయే 

నుదిటి కుంకుమలు కానరావాయే పెదవుల చిరునగవులు విరియవాయే 
ముంగిట ముగ్గులు విచిత్రమాయే  ముంగిళ్ళు లేని లోగ్గిల్లాయే 

గడప నెరుగని గుమ్మాలు , గుమ్ము పాలే తాగని పిల్లలు 
బాల్యం నెరుగని  భావి పౌరులు భవిష్యత్తు పై భయాందోళనలు 

కంప్యూటర్ల పై కసరత్తు  కాగితాలపై భవిష్యత్తు 
కాలువ సేద్యం కానరావు  అరకలు మడులు సరిపోవు 

నేలను విడిచిన సాము నింగికి నెగరని బ్రతుకులు 
కుప్ప కూలుతున్నాయి  సరుకేలేని స్టాకు మార్కెట్ లా 

సేద తీరంగా రావేమి చల్ల చల్లంగా రావేమి

నవమి దాటినా ఇంకా రానే రావేమి ఈ వానలు 
వస్తే వడగండ్ల వాన లేదా సుడిగాలి  జత తోనా 
పంటలు తోటల నాశనం రైతులకు యమ పాశం 

చల్ల చల్లని వాన చల్లంగా రావేమి 
పుడమి తల్లికి  నిండ సేదతీరంగా  రావేమి 

పశువులు పక్షులు మానులు మనుషులు 
క్రిమి కీట కాదులు సర్వ జలచరులు వనచరులు 
సేద తీరంగా రావేమి  చల్ల చల్లంగా రావేమి 

గిరులు ఝరులు నిండు కోనేరులు కుంటలు 
నిండుకున్నాయి  ఎండి బోసి పోయాయి 
సేద తీరంగా రావేమి  చల్ల చల్లంగా రావేమి 


రాముడివి రహీమ్ వి  అల్లావు యేసువు 
అన్ని దేవుళ్ళ నీవే అందరి దాహార్తి నీవే 
సేద తీరంగా రావేమి  చల్ల చల్లంగా రావేమి 

ఎండలు - శ్రుష్టికి ప్రతి శ్రుష్టి చేసిన మానవ విద్ద్వంసకర కృత్యాలు

ఎండలు - బడబానలు రేపే వడగాల్పులు 
ఎండలు - పొడిబారిన కన్నుల మెదిలే ఎండ మావులు 
ఎండలు - తడియారిన గొంతుల సలిపే ఎండిన చెలిమెలు
ఎండలు - ఎండి పోయిన బ్రతుకుల మిగిలిన  ఎడారి బాటలు 
ఎండలు -  విరుచుక పడబోతున్న ప్రకృతి వికృతి చేష్టలు 
ఎండలు - శ్రుష్టికి ప్రతి శ్రుష్టి చేసిన మానవ విద్ద్వంసకర కృత్యాలు 

ఆడుతూ పాడుతూ నేర్వని బాల్యం భయపడుతూ జీవించే భవిషయ్యమౌతుంది

జాలువారే పార్వతి కొండలపై జరా జరా పాకుతూ ఎక్కి యెగిరి గంతులేసిన రోజులెక్కడా
మన్రో తోపులో చింత చెట్లపై కొమ్మ కొమ్మలు  కోతి కొమ్మచ్చులాడిన
ఆ కోతిమూక లెక్కడా 
బావిలో ఈతలు, బయలులో చిల్లాకట్టలు,  సాయంత్రాలు గోలిలాటలు
బాల్యం బడలిక నెరుగని ఒక బతుకు బాట 
భావి భవిష్యానికి వేసే బంగారు బాట 
ఆడుతూ పాడుతూ నేర్వని బాల్యం భయపడుతూ జీవించే భవిషయ్యమౌతుంది

బాల్యం అంటే బరువు కాదు భలే భలే భలే అనేలా వుండేవాళ్ళము.

ఒరేయ్ వీర స్వామి...................
 రారా .....................................
పట్టు జారి పోతుంది ...............
కొంచం పట్టుకోరా .. పడిపోకుండా .........
కొండి గాడు అదే కొండయ్య రాలేదా ....................................

తూర్పు రేఖలు విచ్చుకోరాదు ...... 
తుర్ర్ మనే పిట్టలకన్నా ముందుగానే ...........
మా మిత్ర బృందం మంద్రతోపులో కలిసేవారము .

నేను వీరు రాజి ఇంకా బోలెడంత మంది లేచినది మొదలు ఆటలే ఆటలు.
బాల్యం అంటే బరువు కాదు భలే భలే భలే అనేలా వుండేవాళ్ళము.

మధ్యన్నాము వరకు పార్వతి కొండల పై విహారము , ఆపై తోట బావిలో ఈత కొట్టడము .
తలకు ఆముదము పెట్టేవాళ్ళు , దానివల్ల తడిసిన తల బరువెక్కి తల పోటు వచ్చేది . అయినా కూడా ఈతలు మానేది లేదు .

మండుటెండలో చిల్లా కట్టే  నీ క్రికెట్ ఎందుకు పనికి రాదు .

సాయంత్రం గోలీలాట ఆడీ ఆడీ  రెండో వేలు మిస్సిల్  లా గోళిని ఎంత దూరమైనా విరజిమ్మేది.
టార్గెట్ టుప్పున చెల్లా చెదురు కావాల్సిందే .

ఎండకు చింతామణి మజ్జిగ తాగాల్సిందే , ఆహా అంటూ మూతి తుడుచుకుంటూ పోవలసిందే .

బుధవారం, ఏప్రిల్ 04, 2012

రాముని మొదటి పలుకులు ప్రత్యక్షముగా మన తోఆ కోదండ రాముడు మొదటి మాటలు తన పుత్రులను ముని పుత్రులుగా గొప్ప తపస్స్విలుగా రాజసం వుట్టి పడే లవ కుశులు గా సభకు - అందరికి పరిచయం చేస్తాడు . చాల చాల విచిత్రం రామ దర్శనం రాజ మార్గములో రథం పై నుంచి రాజమందిరములో లవ కుశుల తో సభికులకు పరిచయ వాక్కులు పలుకు తో .... మొదలు .

ఇమౌ మునే పార్థివ లక్షనాన్వితౌ
కుశీ లవౌ ఏవ మహా తప్స్వినౌ 
మమ ఆపి తత్బుతి కరం ప్రచాక్ష్యతే 
మహానుభావం చరితం నిభోదత


రాముని మొదటి పలుకులు ప్రత్యక్షముగా మన తో 

సీతా మాత హృదయం గాంచి కన్నులు తుడవని కరములు లేవు


సీతా మాత హృదయం గాంచి కన్నులు తుడవని కరములు లేవు 
లక్షమన భరత శత్రుజ్నల గాంచి  మెప్పులు పొందని భుజములు లేవు 
హనుమత్ భక్తీ శక్తి గాంచి వురములు చరచని పురుషుడు లేడు
లంక నాశం రావణ కాష్టం చూచి   ఉప్పొంగి పోవని హృదయమే లేదు
రామ కథ రామాయణ మెరిగి మ్రొక్కులు మ్రోక్కని చేతులు లేవు 
లవ ఖుశ గానామృతం లో తడిసిమునగని  జీవితమే లేదు 
వాల్మీకి విరచిత రామ కథ సీతా రాముల దివ్య కథ .


రాజ మార్గంలో రథము పై వెళుతున్న రాముడు ఈ లవ కుసుల చూచి 
రాజ మందిరం లో సత్కార్యము చేసి సన్మానించాడు .


వారి చే సీతా హృదయము తెలుసుకున్నాడు . 
ప్రభువుతో పాటు ప్రజలు తెలుసుకున్నారు 


సీతా రామ కథ గానామృతము లో ఒలలాడు తున్నది ఈ సుధ.


కైమోడ్చి మ్రొక్కుడు ఇనకుల తిలకునకు 
కైవారా మొనర్చుడు ఇందీవర శ్యామునకు 
సీతా రాముల ఆశ్రిత పాదపద్మముల వదలకు 
సీతారాముడు ఇకనిన్నోదలడు వదలడు గాక  .


ఇరువది నాలుగు వేల శ్లోకాలను 
ఇనసొంపుగా గానము చేసిరి లవ కుశ లు 
మొదటి శిష్యులు వారె మొదటి గాయకులూ వారె 
సీతా రామ కథ గానామృతము లో ఒలలాడు తున్నది ఈ సుధ.

వాల్మీకి మహర్షి దర్శించి వ్రాసాడు అందుకే రామాయణం దృశ్య కావ్యము అయినది.వాల్మీకి మహర్షి దర్శించి వ్రాసాడు అందుకే రామాయణం దృశ్య కావ్యము అయినది.


దర్శించితి  రఘునంద  వంశము  - దర్శించితి రఘునందన యశము 
దర్శించితి  జనకుని చరితం - దర్శించితి జానకి హృదయము 
దర్శించితి సోదర ప్రేమ  - దర్శించితి లక్షణ సేవ 
దర్శించితి  హనుమద్ భక్తి  - దర్శించితి లంకా దహనం 
దర్శించితి రావణ మరణం - దర్శించితి అగ్ని ప్రవేశం 
దర్శించితి రామ పట్టాభిషేకం - పరిరక్షించితి లవ కుస మాత లను భాగ్యంబుగా .

మన జీవిత సంసారం నది ప్రవాహముల చక్కగా సాగి పోవాలంటే మనలో వుండే చెడ్డ గుణాలను కాలానుగుణముగా పాశం లోగాని , మొహం లోగాని పడకుండా సరి చేసుకుంటూ దాటుకోవాలి అని మార్గ నిర్దేశనము చేసేదే ఈ రామాయణము .


క్రౌంచ పక్షుల జంట ఒక పక్క 
నిషాదుడు వాడి బాణము ఒక పక్క 
అద్దంలా మెరిసే తామస నది తీరం మరో పక్క 
పచ్చటి రమణీయ ప్రకృతి మరో పక్క .


 క్రౌంచ్ జంట అంటే భార్యాభర్తల జంట ;
మిధునం అంటే సంసారము ;
 తామస అంటే తనువూ , మనసుల ప్రతీక ;
నది అంటే జీవితం ప్రతీక  ;
 తీరం అంటే జీవితపు ఒక మజిలికి ప్రతీక;
నిషాదుడు అంటే చెడ్డ గుణానికి గుర్తు ;
బాణము అంటే కాలం/పాశం;


మన జీవిత సంసారం నది ప్రవాహముల చక్కగా సాగి పోవాలంటే మనలో వుండే చెడ్డ గుణాలను కాలానుగుణముగా పాశం లోగాని , మొహం లోగాని పడకుండా ప్రతి మజిలిలో  సరి చేసుకుంటూ  దాటుకోవాలి అని మార్గ నిర్దేశనము చేసేదే ఈ రామాయణము .

రామాయణము కథలా సాగదు - ఒక దృశ్య కావ్యముల వినిపిస్తుంది .


చాలా విచిత్రమైన అవస్త.....


నారద మహర్షి రామ కథ సంక్షిప్తంగా చెప్పాడు .
బృహత్ర కావ్యాన్ని లిఖించమన్నాడు  .
 ఎలా  ?
ఆయన ప్రేరణతో , క్రౌంచ కిరాతక ఘట్టం తో 
ఒక చక్కటి శ్లోకం ఆ క్రౌంచ్ వధ శోకం నుండి ఉద్భవించినది .
ఒక శ్లోకం తో సరి పోతుందా.....
కల్పించి మనము కథ లల్లినట్లు అల్లరాదు.
వాస్తవం మాత్రమే వ్రాయాలి అది నియమము , నిబద్దత 
ఎక్కడ రాముని గడచిన జీవితము , తానెక్కడ
 తన తరం అవుతుందా ....
ఈ చక్కటి శ్లోకం ఎలా వచ్చింది , ఏమి దీనియొక్క అర్థం 
శాపం కాస్త శ్లోకం అయినది.
శిష్యులతో చర్చ అందరు మెచ్చుకున్నారు . 
ఇది రామతత్వమే అని .
ముందుకు............. 
ఎలా ... సాగాలి ......


ఆ తపన పోగొట్టడానికి ఆ విధాతనే దిగి వచ్చాడు .
కోరకుండానే కొండంత వరమిచ్చాడు .
అందరి తల రాతలు తెలియజేసే శక్తిని ఇచ్చాడు .
కాల చక్రము లో గతానికి వెళ్లి నీడలా రామునితో పాటు ప్రయాణించే శక్తి నిచ్చాడు .
రాముడు తెలుసుకున్నవి ,
 రాముడు కలుసుకున్నవి ,
 రాముడు నేర్చుకున్నవి
 సమస్తం అవగతము అయినది .
రామాయణము కథలా సాగదు - ఒక దృశ్య కావ్యముల వినిపిస్తుంది .

మంగళవారం, ఏప్రిల్ 03, 2012

కాల చక్రం వెనుకకు తిప్పి దాని వెంట పరిగెత్తినాడు


యోగ దృష్టి తో వాల్మీకి మహరిష రామకథను అంత తెలుసుకున్నాడు .


కాల చక్రం వెనుకకు తిప్పి దాని వెంట పరిగెత్తినాడు 
రామ సీతా లక్షమణ అడుగు జాడలు తెలుసుకున్నాడు .
రఘు వంశ చరిత మొదలు రావణ పరాకాష్ట వరకు 
రామ జననం నుండి రాజ్యాభిషేకం వరకు 
చూడ వలసినవి ఎల్ల చూసినాడు తరించినాడు 
చూడ రానివి చూసి సిగ్గు తో హనుమన లా తలవంచినాడు .
అలసట లేదు ఆకలి లేదు రాముని తో పాటు  బల అతిబల విశ్వామిత్రుని ద్వార నేర్చుకున్నాడు .
ఆయన ప్రతి అడుగు ఒక పదము అయినది
ఆయన ప్రతి మాట ఒక పాదము అయినది 
సీతమ్మ ముచ్చట్లు యతి ప్రాసలు అయినవి
రాక్షస సంహారం  యమకాలు గమకాలు అయినవి 
శోకరసము అశోక వనములా శోభాయ మానముగా పండినది .
నవ రస పోషణ నవ్య భవ్య కావ్యమైనది అన్ని కలసి మహత్తర రామాయణ కావ్యమై భాసిల్లింది . ఈ జగతికి మార్గ దర్శకమై నిలిచింది .

ఇల పై పర్వతాలు ఉన్నంతవరకు , నదులు పారుతున్నంత వరకు నీ రామాయణ కావ్యం నిలిచి వుంటుంది . రామాయణ కావ్యం నిలిచి ఉన్నంత వరకు నీవు నిలిచి ఉంటావు .
చతురు ముఖ బ్రహ్మ వరం ......


వాక్దేవి సరస్వతి నీ నోట పలికించింది రామ కథ .
నీవు పలికేదేల్ల సత్యం , అందులో అపశ్రుతి లేదు , అనృతం అంతకంటే లేదు .
సందేహమే వలదు . నారదుడు చెప్పినట్లు గా రామ కథ రచించు .
ఆ లోకోత్తర పుణ్య పురుషుడు , ఆ లక్ష్మణుడు , ఆ మహా తల్లి వైదేహి   భాధలు తెలిసినవి , తెలియనివి
 ఆ రాక్షస గుణాలు  అన్ని నీకు భవిష్యత్తులో ,నీవు రచన చేస్తూ పో  అవగతమౌతాయి  వాటికవే .


ఇల పై పర్వతాలు ఉన్నంతవరకు  , నదులు పారుతున్నంత వరకు 
నీ రామాయణ కావ్యం నిలిచి వుంటుంది .
 రామాయణ కావ్యం నిలిచి ఉన్నంత వరకు నీవు నిలిచి ఉంటావు .

కవులు పండితులు రాగయుక్తంగా తిడతారట


కవులు పండితులు రాగయుక్తంగా తిడతారట
శాపము పెట్టక గాని అర్థం కాలేదు ఎవర్రికి .
 ఏంటి ఇయన తిడుతున్నాడ పాట పడుతున్నాడ అని 
ఈ నానుడి ఈయన నుంచే వచ్చిందేమో 

అలాగే  వుంది మన వాల్మీకి మహర్షి శాపము 
చక్కగా అమరిన 8 పదాలతో ,
 రెండు పాదాలతో చక చక శ్లోకం సాగింది .

" మా ని షా ద ప్ర తి స్తట వం 
  మా గ మ శా శ్వి తి స మా "

శోకము కూడా శ్లోకంగా మారింది . కారణం తను నారద మహర్షి చెప్పిన 
సంక్షిప్త  రామ కథ  నుంచి ఇంకా బయటకు రాలేదు .అదే ద్యాస 

ఇదే రామాయణములో వాల్మీకి మహరిషి పలికిన తోలి శ్లోకం .

రెండెడ్ల బండి మహా జోరుగా పోతుంది అందుకే  4 + 4 = 8 
రెండు పాదాలు - సరి సమముగా పరిగేట్టం .మన రెండు పాదాలు సరి సమంగా రితమిక్గా అడుగులు పడితేనే కదా నడక సాగేది .

శాపం పోయి వరం వచ్చింది అన్నటుల గా

తన మాటలు తనకే ఆశ్చర్యం కలిగించాయి . ఎందుకంటె .అంతకు ముందు ఆయన ఏ కవితలు కథలు  వ్రాయలేదు , చూడలేదు , చదవ లేదు .

ఇదే మొదటి సారి. ఒక విధమైన తీయని భాద ఆ మహారిషిని వేధించ సాగింది . తను ఒక రుషి , వాడు ఒక బోయ వాడు ఎందుకు అంత ఇదిగా తను ప్రవర్తించ వలసి వచ్చింది .
పోనీ తను పలికింది శాపమా .... శ్లోకమా ఇంత రాగయుక్తంగా ఎలా వచ్చింది . ఏమిటి ఇందులో గుడార్థము... అనే ఒక తీయని భాధ వెంటాడ సాగింది రుషి మనసులో .


ఇంతలో ఆ చతురు ముఖుడే దిగి వచ్చాడు .
వాల్మీకి అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి


నారద మహరిషి చెప్పినట్లు రామాయణ గుణగానం చేయమని ఆశీర్వదించాడు.


అనృతం బొక్కటి లేదు నీవు నుడివిన్దేల్ల సత్యం
తత్యమిది రామకథ సారము సంసార దుఖః హరము  .

ఆ సమయము గాని సమయములో బాణము వేయటం చాల తప్పు .అమర్యాద కరమువేటగాళ్ళు కూడా కొన్ని ధర్మాధర్మాలు వున్నాయి .

యెట్టి పరిస్తితిలోనూ
 రోగముతో వున్న,
 బలహీనగా వున్న , 
గర్భం తో వున్న ,
 పిల్లల తల్లి ఐన ,
 మిధునములో వున్న 
ఇలాంటి కొన్ని అవస్తలలో వున్న పసుపక్ష్యాదులను
 ఏ వేట గాడు వేటాడ రాదు .

ఈ నియములు కొన్ని ఆరోగ్య సూత్రాల పై 
మరికొన్ని పశు పక్ష్యాదుల వృద్ది కొరకు
 ఆహార లోటు రాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా నియమిత మైనవి .

వాల్మీకి మహర్షి ఒక్కప్పుడు వేటగాడే
 అందుకే మా  నిషాద ప్రతిష్ట మొత్తం నాశనం చేసావు అంటారు .

ఆ క్రౌంచ జంట మైదునములో ఉన్నాయి పరిసరాలను మరచి ఉన్నాయి .
ఆ సమయము గాని సమయములో బాణము వేయటం చాల తప్పు .అమర్యాద కరము 

నిషాదుడే రావణాసురుడు - క్రౌంచ జంటే సీతారాముల జంట . ఆ విషాదమే రామాయణ సారము


తమసా - తామస - త - తను ,మ - మనస్సు , స - శుభ్రం .
అద్దంలా మెరుస్తున్న - లోపల దహించుకొని  పోతుంది .

రామ కథను విన్న వాల్మీకి మనసు పరిపరి విధముల 
ఆలోచనా తరంగాలతో దహించుకొని పోతుంది .

క్రౌంచ - పురివిప్పిన కోరికల సంకేతం లా ధ్వనిస్తుంది .
పక్షి - విహంగం - విహారము - యగురుట స్వేచ్చగా ....
పురివిప్పిన కోరికలు - స్వేచ్చా విహంగములు .

ఎందుకు వాల్మీకి తమసా నది వద్దే ఆగిపోవలసి వచ్చిందో 
ఎందుకు ఆ క్రౌంచ పక్షుల జంట కంట పడిందో 

చెప్పకనే ఆ ప్రకృతి మనకు చెప్పింది .

తాపసుల మనసు గెలిచిన ఓ తమసా నదీమ తల్లి
నీకు ఇవే శిరసాబివందనములు .
అంతర్గతంగా నీలో ఉన్న ఆవేశం ఆ తాపసి నోట పలికించావు 
తమసా ప్రేరితమైన వాల్మీకి నోట కదలి వచ్చింది రామాయణ శ్లోకం 

నిషాదుడే రావణాసురుడు - క్రౌంచ జంటే సీతారాముల జంట .
ఆ విషాదమే రామాయణ సారము 

సోమవారం, ఏప్రిల్ 02, 2012

3.క్రౌంచ మిదునాథ్ ఏకః మ వధి: శోకమస్యనసుఖేన


క్రౌంచ మిదునాథ్ ఏకః మ వధి: శోకమస్యనసుఖేన 

మన జాతి ప్రతిష్ట సర్వం నాశనం చేసావు .
 మిధునములోవున్నా ఆ క్రౌచ పక్షుల జంటను చంపావు .
 నీవు సంసార సుఖము లేక నీ జీవితాంతం భాదను అనుభవించు 
ఇదే నా శాపం 

తన తోడూ పక్షి కారు తగిలి చనిపోతే క్రిందుగా ఎగురుతున్నప్పుడు , జత పక్షి దానికోసం విలపించటం పై శ్లోకానికి గుర్తుగా వచ్చిందేమో . ఆ నాడు వాల్మీకి మహర్షి చూసింది కల్పితం కాదు అని చెప్పేదానికి .

2.క్రౌంచ పక్షులు జంట - కోరికలే రెక్కలై స్వేచ్చగా జంటగా ఎగురువేళ


క్రౌంచ పక్షులు జంట - కోరికలే  రెక్కలై  స్వేచ్చగా జంటగా  ఎగురువేళ


నిషాదుని శరము విషాదము చిమ్మింది -
మగటి నేల కొరిగింది  పెంటి గుండె పగిలింది 
అసువులు బాశాయి ఆ క్రౌంచ పక్షులు  రెండు  
అశ్రువులు కురిశాయి కవి కోకిల కన్నులు రెండు  .


క్రౌంచ పక్షుల మైదునపు రావాలు , మన వాల్మీకి  దృష్టిలో పడ్డాయి .
శ్రుష్టి కార్యములో మునిగి ఉన్న ఆ చూడ ముచ్చట ఐన జంట లో చాటున ఉన్న బోయవాని బాణము తగిలి మగ పక్షి మరణించినది , దాని చుట్టూ తిరుగుతూ తల ను బలంగా ఎగిరేగరివచ్చి నేల కు కొట్టుకొని ఆ ఆడ పక్షి కూడా చనిపోయింది .ఆ భాదాకర దృశ్యము మన మహారిషిని వీపరితంగా    దు:ఖితుని  చేసింది .


ఆ మహా శోకము నుంచి వచ్చింది మహోన్నతమైన  శ్లోకం 


" మా నిషాద ప్రతిష్టాంత్వ మగామః శాశ్వితి: సమః 
   యత్ క్రౌంచ మిధునాత ఏక మవధి: కామ మోహితం 
  
   తస్య ఏవం భ్రువతః చింతా బభూవ హృది వీక్షితః 
   శోకత్రేనా అస్య శకునే: కిం ఇదం వ్యహరితాం మయః "
1. తమసా- తనువును మనసును పూర్తిగా శుభ్రము చేయునది
తమసా- తనువును మనసును పూర్తిగా శుభ్రము చేయునది 
జాహ్నవి - గంగనది కి  కొంత దూరం లో వుంది .


నదీ పరిశుబ్రత పై ఆనాడే ఎంతో అవగాహనవుంది అనేదానికి 
"తీరం అక్ద్రమం"  తీరము మాలిన్యా రహితం అని అన్నాడు .
నది తీరాలు ఆ కాలములో కూడా కలుషితాలు అనేదే మనకు తెలుస్తూ వుంది

అద్దంలా వున్నా ఆ తమసా నది తీరంలో స్నానానికి    వుపక్రమిస్తాడు 
మన వాల్మీకి మహర్షి  వెంట శిష్యులు భరద్వాజ మొదలగు వారు వున్నారు . 

ఆదివారం, ఏప్రిల్ 01, 2012

ఈమె చేతిని నీ చేతిలోనికి తీసుకో- నీ నీడలా నిను అంటి వుంటుంది .


ఇరు వర్గాల బంధు మిత్రులతో , ప్రజలతో  శోభాయమానముగా 
 తీర్చి దిద్దిన వీధులతో మందిరాలతో , విందులు వినోదాలతో , దాన ధర్మాలతో మిల మిల మెరిసిపోతువున్నది మిథిలాపురి.


వరపూజ చేశాక తోడుకొని పోయిరి కళ్యాణ వేదికకు .
గౌరీ పూజా గావించి తోడ్కొని వచ్చిరి సీతమ్మను .


అగ్ని సాక్షిగా జనకుడు సీతమ్మను రామునికి చూపిస్తూ ......
రామా..... ఈమే  నా పుత్రిక సీతా
ఈమె చేతిని నీ చేతిలోనికి తీసుకో
ఈమె పతి వ్రత  నీ సహధర్మచారిణి 
నీ నీడలా నిను అంటి వుంటుంది .
అంటూ మంత్ర జలము రాముని చేతిలో పోశాడు.


మంగళ వాయిద్యములు , దేవ దుందుభులు కరతాళ ధ్వనులు మిన్ను ముట్టి నవి . దేవతలు పూల వర్షం కురిపించారు . మంగళ సుత్రాధారణ జరిగింది - మన మసులు ఉప్పొంగి పోయాయి .
కన్నుల నిండా ఆనందభాష్పాలు , చేతులనిండా అక్షింతలు 
చిరుజల్లు లా అక్షింతలు ఆ నవ వధూవరుల పై కురిపిస్తూ
 పెద్దలు ఆశీర్వదిస్తూ , పిన్నలు ఐన మనము నమస్కరిస్తూ 
నయన  మనోహరంగా అత్యంత వైభోగాముగా సీతా రాముల కళ్యాణము జరిగింది .

అంతటి మణి దీపాన్ని పోదువుకోవాలంటే ఇంతటి గగన సద్రుశాకరుడే కావాలి .


నిలువెత్తు వినిలాకాసం లా నీల మేఘ వర్ణుడు  రాముడు ఒక పక్క .....


మల్లెలు జాజుల రోజాల సరోజల సుగంధ సుపరిమలలు జల్లే జాబిల్లిలా         జానకి ఒక పక్క 


కరతాళ ధ్వనులతో కలకలముల రేపు జన సంద్రంయోప్పు  ప్రజలు ఒక పక్క 


వీరాధి వీరులు వివిధ దేశాదిపతులు గండు తుమ్మెదల గుంపుల యొప్పు     రాజులోక పక్క 
జనక మహారాజు , విశ్వామిత్రుడు తదితర మహా ఋషులు , మునిపున్గవులు మరో పక్క 


ఈ మహా స్వయంవర  వేదిక పై  ధనుస్సు నేత్తలేని రాజులెల్ల నత్తల వలె మెల్లగా జారుకున్నారు . పిలవకే వచ్చిన రావణుడు  పిరికిపందలా పారిపోయాడు .


ఎవరు లేరా ఇంతటి మహా సభలో అని ఎంతో హృద్యంగా పలికిన జనకుని పలుకులకు ,
విశ్వామిత్ర ఆదేశం పై  రాముడు అందుకున్నాడు  శివ ధనుస్సు ,
ఒక శృంగం నేలపై వుంచి కదలకుండా బొటనవేలు నదిమి , మరొక శృంగానికి  వింటిని వంచి  వింటి నారిని సంధించబోగా.......


 భునభోంతరాలు దద్దరిల్ల  పెళ పెళ ఆర్భాటంతో  పెటిల్లున వింటి పైభాగం తటిల్లున మెరుపులు మెరుస్తూ విరిగి  పడి పోయింది .


వింటిపై పొదిగిన వజ్ర వైడుర్యాలు మరకత మాణిక్యాలు చటిల్లున నింగికి కెగసి  పాలపుంతల పరచుకొని విధ్యుత్ తళతిలత కాంతులు వెదజల్లి అందరి మనసుల మురిపించి మెరిపించాయి .


శృంగపు కొనకు సింగారముగా కట్టిన ముత్త్యాల సరులు , మువ్వల పట్టిలు  ఎగిరెగిరి చిరుజల్లులా సభికులందరి పై పడి ఆహ్లాద పరిచాయి .
చిరు చెమటలు పట్టి  ఈ వజ్ర వైడూర్య , మరకత మాణిక్యాల ధూళి సోకి  మణి దీపంలా దేదిప్యమానముగా వెలిగి పోతున్న సీతమ్మను ,
కంటి శృంగమున చూశాడు రాముడు  వింటి శృంగం తోలగుటవల్ల.


సునీలవర్ణ శ్యాముడు  విల్లు నేగచిమ్మిన పాలపుంతల జిలుగు మెరుగుల జిగిబిగి తళుకుల ధూళి తో నిండి ,
 తార మండల గగన సద్రుస్యమై శోబిల్లినాడు.


అంతటి మణి దీపాన్ని పోదువుకోవాలంటే  ఇంతటి  గగన సద్రుశాకరుడే కావాలి .
 ఈ జంట నభోతో నభవిష్యతి .
జంట అంటే ఇదే జంట 
వీరికి లేరు మారు , రారు ఎవరు సాటి .


కాంతుల ప్రతి కాంతులు తల వంచిన సీతమ్మ కంట పడి ........
 పరికించి చూడ ఎక్కడిది ఈ కాంతి అని ............

నిలువెత్తు వినిలాకాసంలా నీల మేఘ వర్ణుడు  రాముడు అగుపించెను .

వరమాలా అలంక్రుతుని  జేసింది .
శివ ధనుర్భంగ పెళ పెళ ఆర్భాటములు-శివ ధనస్సు - ఇదో గొప్ప ఇంద్రధనస్సు అన్ని రసాలను కలిపిన మహా షడ్రసం .
శివ ధనుర్భంగ పెళ పెళ ఆర్భాటములు


వర మాల తో నున్న సీతమ్మ కు ...
మంగళ తుర్యములై  తోచే . 


నిరుతత్తలో నున్న రాజవరేన్యులకు...
ప్రళయ కాల మేఘ గర్ఘోషలై తోచే .


వర చింత లో  నున్న జనక మహారాజు కు .....
హృదిలోని చింత లన్ని బాపే   అతి పెద్ద చిటిక  ధ్వని లా తోచే .


హేయంగా ఓడిన రావణాసురునకు  ....
ప్రళయ కాల రుద్రా ఘంటికలా తోచే .


ఆహ (.. అని  ఆశ్చర్యంగా చూసే మనకు ....
భయానంద డోలికా రవములై  తోచే .


ఇంతమందికి ఇన్ని ఇంద్ర ధనువుల నొసగే ఆ శివ ధనుస్సు 


శివ ధనస్సు -
ఇదో గొప్ప ఇంద్రధనస్సు అన్ని రసాలను కలిపిన మహా షడ్రసం .

ఆ శివ ధనుస్సు ను అలా ఎత్తి ఇలా విరిచాడట . పసి కందు పరక గడ్డిని విరచినట్టు .


  •   అతి పెద్ద బల్ల కట్టు  ఎనిమిది  బండి చక్రములు గలది  విష్ణు చక్ర సమము అయినవి .
  • దానిపై సర్వలంకారాశోబిత భూషితమయిన అరి వీర భయంకరమైన త్రిపురాసుల మర్దించిన శివ ధనుస్సు .
  • ఐదు వేలమంది సుశిక్షితులు  మహా బలసంపన్నులు అయిన యోధులు బల మైన పగ్గములు కట్టుకుని అతి కష్టముగా బరువైన అడుగులతో  పూజా మందిరం నుంచి స్వయంవర సభా మద్యమునకు తెచ్చారు .
  • ఆ  పెద్ద పెద్ద ఇనుప చక్రాలు దొరలుతూ చేసే శబ్దం  నల్లని బలసిన మదమెక్కిన మహిషములు అన్ని ఒక్క సారిగా రంకె వేస్తే ఎలా  భయంకరముగా వుంటుందో  అలా ఉందట .
  • అక్కడ కూర్చున్న వారి గుండెలు అవిసి పోయాయట .
  • అందరు  కళ్ళప్పగించి చూస్తూ  నిశ్చేష్టులై కుదేలైపోయారు .
  • అదిగదిగో రామ ..........
  • అదే అదే శివ ధనుస్సు అని విశ్వామిత్రుడు చూపుతుంటే 
  • అల ఒకగా క్రీగంట నొకకంట పరికించాడట.........
  •  ఆ మహా గంభీర ధీర దశరత సుతుడు .
ఆ శివ ధనుస్సు ను అలా ఎత్తి ఇలా విరిచాడట .
 పసి కందు పరక గడ్డిని విరచినట్టు .

ఆ రాముడు అనే ఆ పసి కందు చేష్టకు ఆ మహా దేవ దేవుడైన  పర శివుడు అమ్మవారితో కలసి ముచ్చటిన్చుకున్నాడట
 చూసావా  పార్వతి మన రాముడు ఆట బొమ్మ అనుకోని ఎలా విరిచాడో అని .
ఆ అది దంపతుల సాక్షిగా ఆ అది దంపతుల అస్సిసులతో  జరగబోతుంది  శ్రీ సీతా రాముల కల్యాణం కమనీయముగా 
రండి రండి చూతం రా ... రండి .