శుక్రవారం, మే 25, 2012

చక్కని రంగుల రాట్నం .
భావ  వ్యక్తీకరణ  ఒక  చక్కని  విద్య  

చూపులతో  భావ  వ్యక్తీకరణ  అందులో  మహోన్నతమైనది 

హావభావాలతో  వ్యక్తీకరించటం  మరో  చక్కని  మార్గం 

అతి ప్రేమ  జీవులలో  అసహన  జీవులలో  ఇది  ఎక్కువగా  కనిపిస్తుంది 

అసహనాన్ని  ఎంత  అహస్యంగా  చూపుతారో  అబ్బో  అనిపిస్తుంది 

ఎందుకు  కదిలించామురా  బాబోయి  అనిపిస్తుంది 

ఇందుకు  పూర్తి  విరుద్దము  అతి  ప్రేమ  ఇదేమి  ఫెవికాల్  రా అబ్బో  అనిపిస్తుంది 

మధ్యస్తంగా  వుంటే  గర్వం  అనుకున్న   దూరంగా  వున్నా మర్యాద  ఇస్తారు 

ఇలా  అన్ని గుణాలలో  మూడు  నాలుగు    రకాల  మనుషులు  అగుపిస్తారు 

ఎందుకు  ఇంత  వైదిధ్యమైన  పాత్రలు  ప్రతి  సమాజంలో  కనిపిస్తారు 

 వారే    ఈ  జీవన   గుభాలింపులు  తిరగమాత  లాంటి  వారు , వారు  లేకపోతే  జీవన  వైవిధ్యమే  లేదు .

 షడ్రుచులలా  అన్నిరకా ల  పాత్రల  సమ్మేళనమే  రంగు రంగుల  జీవితం 

  చక్కని  రంగుల  రాట్నం .

గురువారం, మే 24, 2012

ఓ నాటి అమ్మను నేటి ఆట బొమ్మనుచిన్నారి  పొన్నారి  ఆశలతో  పూచిన  పూ రెమ్మను  అందరిలా 

ఆశలతో నా అత్తగారింట  అడుగుడిన  ఆడపడుచును  అందరిలా  

పిల్లలతో పాపలతో హాయిగా సుఖసంతోషాలతో  సాగిని సంసారమే   

కూతురు అల్లులు కొడుకు కోడళ్ళు మనమలు మనుమరాండ్రు లతో  వర్ధిల్లిన  జీవితం  

విధి కేమైనదో  జంటగా  ఉన్న   మమ్ము విడదీసింది   నను ఏంతో  వేధించింది  వ్యధల  పాల్జేసింది 

తుదకు కసి తీరక  నా రెక్కలు విరచి  అవిటి దాన్ని చేసింది పక్షపాతంతో  నాకు  పక్షవాతం ఇచ్చింది 

నేను  ముద్దాడిన  నా కొడుకే  నాకు అమ్మ  అమ్మనైన  నేను  ఆఖరికి  నా బిడ్డ   చేతి  బొమ్మనైపోయను 

వ్యధ  ముసరగా  ముద్దదిగదు  అచేతనంతో  ఆఖరి పిలుపుకై  ఎప్పుడా అని  ఎదురుచూస్తున్నాను 

ఓ  నాటి  అమ్మను   నేటి  ఆట  బొమ్మను 

దేవుడు  ఆడిన  చదరంగలో  ఆఖరికి  ఓడిన  రాణిని  - విరాగిణిని 

స్నేహం


స్నేహం  ఒక  తీయని  బాట  

పడదోయదు  ఏనాటికి 

గన్నేరుల  పల్లెరుల  రానీయదు  దరి 

దుఖః ముల   దాహముల  తీర్చేటి  దొరి 

 నీ నీడ నీజాడ మరిచినా  నిను ఏనాడు  మరువని తోడు 

నీ వారు  నిను  ఎవగించిన  నిను ఏనాడు  వీడని జోడు 

ప్రతిధ్వనిలా  ఓయని  పలికే  నీ  ఆమని 

ప్రతిక్షణము  నిను పరిరక్షచించే ఒక  పరిభ్రమణ  సుదర్శన  చక్రం 

స్నేహం  పరమ  పవిత్రం  ప్రియురాలి  వలపుల కన్న  

స్నేహం  ఒక  నిశ్చల  తత్వం  చలించదు  జవరాలిలా 

పరీక్షల  రాళ్ళు  వేసి  చెడగొట్టకు ఆ  నిశ్చల  అంతరంగాన్ని 

చెడగొట్టకు  ఆ  నిర్మల  నిశబ్బ్ద  ఘాడ  సమాధి  స్థితిని .

బుధవారం, మే 23, 2012

నేను మీ వికృత స్వరూపాన్ని

Fire World

గగనతలం నా  ఛత్రం -  దిన  పాలకులు  నా  దిక్పాలకులు 

కాలం నా ముంజేతి  కంకణం - యమపాశం  నా  చేతి  శూలం 

నిత్యాగ్నిహోత్రాలు  నా  రెండు  కళ్ళు - బుగబుగలు  బుసబుసలు  నా  దీర్గశ్వాసాలు 

రుద్రులకు  రుద్రుడను  మహావీర  భద్రుడను - నేనే  ప్రళయకాల  ఘోషా  సముద్రుడను 

నా ధీర్ఘ   బాహువులు  ఉప్పొంగే  ఉప్పెనలు  -  నా  దీర్ఘ  శ్వాసలు  సుడులు తిరిగే వడగాడ్పులు 

నా ఉదరాగ్ని గోళాలు బడబాగ్నులు చిమ్ము -  నా  పదఘట్టలు భునభొంతరముల  కుదుపు 

మీ  పాపపంకిలల  ప్రతిఫలాన్ని - మీ హ్రుదయాన్తరంగాల  చీకటి  కోణాన్ని 

మిమ్ము  దహియించ  వచ్చిన  మీ  భస్మాసుర  హస్తాన్ని - నేను  మీ  వికృత  స్వరూపాన్ని  

సోమవారం, మే 21, 2012

ప్రజలను దేవుళ్ళను చేసి చూపులు నీకు మేపులు మాకు •   నీతి  నేతి  బీరకాయ అయింది  జాతి  రూపురేఖలు  మార్చింది 


 •   వార్తలు  రసవత్తర  కథలతో   యదార్థ  స్వరూపాన్ని పోగొట్టుకుంది 


 •  ప్రేక్షకుల  విశ్లేషణా  గుణాన్ని నాశనం  చేసి అయోమయంలో  తోసింది 


 •  అన్నిటికి  ఆ దేవుడే  చూస్తాడు  కాస్త  అంతా  ప్రజలే  చూస్తారు అయింది 


 • రాజకీయనాయకులు  , పేపరోల్లు , టివి వాళ్ళు , వారు వీరు అనే  భేదం లేదు  అందరు  ప్రజలు  ప్రజలు  చూస్తారు , బుద్ది  చెపుతారు , గట్టిగ  నిలదీస్తున్నారు  అంటారు .
ప్రజలను  దేవుళ్ళను  చేసి  చూపులు  నీకు  మేపులు  మాకు 
అనే  అవలక్షణం  పెరిగిపోయింది , పెరిగిపోతుంది  చివరకు  అందరిని  ముంచబోతుంది 

  

నరుల మర్యాదలు నాలుగు రోజులు వుండు

Lord Venkateswara, SVBC studio in Alipiri, Tir...


నరుల  మర్యాదలు  నాలుగు రోజులు  వుండు 

నారాయణ  దీవెనలు   మన     వెంట  కలకాలముండు 

హారతి కర్పూర అ ర్థం  కోపాన్ని జ్వలించి  వెలుగును పంచమని  

తీర్తప్రసాదలకర్థం  తీవ్రమనో దోషాలమింగి మంచిని పంచమని 

దేవదేవుడే  నపుడు ఎదురేగి  వస్తాడు  కొండంత  వరముల   ఆశీస్సులు  ఇస్తాడు  

ఎదలోన  నిలుపుకొని పులకించిపో   దిన  దినము  తలుచుకుని  సేవించుకో 

ఆదివారం, మే 20, 2012

మోసం

Graphic representation of the brazilian RPG se...

మోసం  ఒక  మసక  తెరలాటిది  - తేర  చాటున  దాగిన  మోహాన్ని చూడనీయదు 

మర్యాదనే   మంచు గోడ  చాటు చేసుకొని  - మొహమాటమనే  ఐసు  నీళ్ళు  చల్లుతుంది 

మాటలతో   మన  మాట  పెగల  నివ్వ దు  - చేష్టలతో    మనలను  నిస్చేష్టలను  చేస్తుంది 

స్నేహం  ప్రేమా  అనే  బంధనలతో  అటు ఇటు మెదలనివ్వదు  - మెడ  మీది  తల  గొరిగేస్తుంది 
శనివారం, మే 19, 2012

ఆకాశం , చంద మామ రోజు మన పెరట్లో కనిపిస్తారని

Moon


ఆకాశం , చంద మామ  రోజు  మన  పెరట్లో  కనిపిస్తారని

 మనకొక్కరికే  హక్కులంటే  ఫక్కున  నవ్వదా  భూలోకం

పారే నీళ్ళు  వీచే  గాలి ప్రతిరోజు  మన  గుమ్మములో కి  వస్తాయని 


 మా ఒక్కరి చుట్టలంటే  ముక్కున  వేలువేసుకోదా  ఈ    లోకం 


మనకు అందుబాటులో ఉండి  మనవి  కానివని  తెలిసి వదులుకోలేము  అనుభంధం 


కన్నపేగు తెంచుకొని  పుట్టిన  మన  పిల్లల  పై  ఎలా  ఒదులు కొగలం  మమకారం 


మన  కందనంతా దూరాన    వున్నారని  మన  కందకుండా  పోయారని 


సర్వే  జన  సుఖినో భవంతు  అనే  మనం  మన  పిల్లలు  సుఖంగా  వుండాలని  కోరుకుంటాం .

ఆరాధనా నిలుపుకోవాలంటే ప్రేమించటం నేర్చుకోవాలి అహంకరించటం కాదు .

యెంత  పెద్ద   వారైన   దురహం కారులు  కారాదు  

ఎదిగే కొద్ది  ఒదిగి  ఒదిగి  వుండాలి  బంగారంలో  పచ్చ  నద్ది నట్లు 

ముద్ద   బంగరాన్ని  కూడా  మూలన  పెడతాము  మెనినా  తోడగం 

ఆరాధనా నిలుపుకోవాలంటే  ప్రేమించటం  నేర్చుకోవాలి  అహంకరించటం  కాదు .

శుక్రవారం, మే 18, 2012

wish you a happy birth day

నా  ఊహలకు రంగులు  అద్ది

 మన  కలలకు రూపం నిచ్చి   

చక్కని  కావ్య  సుందరిలా  

నిను తీర్చి  దిద్దనా 

పూ పెదవుల  పుపొడ్డి గంధం నలరి  

విరితావుల  పరిమళం నద్ది

  నీ మేన  అత్తరులు చల్లనా 

కరి మబ్బుల మెరుపుల ఒరసి 

 జలధారల  ఒరుపులు ఒడిసి 

 నీ  నేన్నడుమున   సోయగ మద్దనా   

వన  సీమల  తారేడే  గగన  సీమల  తిరుగాడే 

వలపుల  చిలుకల  కిల కిలలు 

 నీ చిరునగవుల  చిరునవ్వులు   మెరిపించనా 

పుణ్య  నదీమ  తల్లుల  పుష్కర  తీర్థాల  తెచ్చి 

నిను  పుణ్య వతిగా  అభిషేకం  చేయనా 

నా పూర్వ  జన్మ   శుకృ తమా  

నా  సహ  ధర్మ   చారమా 

నా  ప్రాణమా  

అందుకోమా  నా ఈ   జన్మ దిన  శుభాకాంక్షాలు .మేము పిచ్చి జనతా పార్టి లా కాదు

దమ్ముంటే  నన్ను  అరెస్టు  చేయండి  జైలులో  పెట్టండి 

అమ్మా  ఆశ  దోశ   సింపతి  కొట్టేదామనే  ఓట్లు  పోగేద్దామనే 

మేము  పిచ్చి జనతా  పార్టి లా  కాదు 

అంతా గందర గోళం అయోమయం .

రాష్ట్రంలో  రాజకీయాలు మహా వేడెక్కి వున్నాయి 

ఒకరి నుంచి  మరొకరికి  సి బి ఐ  వాళ్ళ   సెగ  
స్వయిన్  ఫ్లూ  లా  అంట  కాగుతాది

ఒకరేమో  పోయే అంతా  పోయా  పరిశ్రమలు  పోయా 
వాటిని   నమ్ముకునో  మరెందో రో   ఉప  పెట్టుబడులు  పెట్టినవారు  పోయే  అని  గగ్గ్లోలు 

ఎన్నికలని  జగన్  అరెష్టు  పోయి సమనులతో  సరి  భయం  ఓట్లు  రావని 
విచిత్ర   స్థితిలో  కాంగ్రేసు  నాయకులూ  వినాయకులు  ఎటు  పోవాలో  

తెలుగు దేశం  రెప  రెప  లు  కానరావు  ఈ  సంధిలో  ఏ  గొందిలో  పోయిందో 
నివురు  కప్పిన  తెలంగాణా  వాదం , వద్దు అనే  నినాదం  మాయమై పోయే 

దిక్కు తోచని  ఓటరు  తటాలున  ఏ  పక్క   మొగ్గు  చూ పుతాడో  ఎరక్క   పోయే .
ఎప్పుడు  రాజకీయ  సునామి  వస్తుందో  ,  తెలంగాణా  సుడి గాలి  లేస్తుందో 

అంతా  గందర  గోళం  అయోమయం .

బుధవారం, మే 16, 2012

భార్యా భర్తలు ప్రాణస్నేహితులై జీవించి నపుడే
పురివిప్పిన  రెక్కల  సాచి  రివ్వున  నీలాల  నింగికి  ఎగిరే గువ్వల  జంట  - ప్రేమ  

మదమెక్కిన  మదనాశ్వావాలు  వాయువేగంతో  పరుగులు తీసే  జంట   -  ప్రేమ  

కోడే వయస్సులో  కోరిక  చెలరేగి  బుసలతో  పెనుగాడే     సర్ప  జంట     - ప్రేమ   

అందుకే  అది  అతి మధురం  మనోహరం  ఉహల  ఉయాల  పల్లకి   -  పేమ  పల్లకి 


పెళ్ళి   పల్లకి  మోత  పెళ్ళి  అయిన  కొన్నాల్లె  భాజ   భజంత్రీలు  ఇంకొన్నాలే   

హోదా  పెరిగే  కొద్ది  భాద్యత  పెరుగు  భాద్యత  పెరిగే కొద్ది బరువు పెరుగు 

పెరిగిన  బరువులతో  తరిగిన  సొగసులతో  సోయగాలు  వెగటు  అవుతాయి 

సూటి  పోటీ  మాటలు  ఎక్కవ  అవుతాయి  ఆఖరికి  చుట్టాల  సాలె గూడు  పాలుఅవుతాయి 

జలదరింపులు  కాస్త   కంపరాలు  అవుతాయి  కట్టకడకు కాపురాలే  కూలి  పోతాయి 


ప్రేమ  ఒక  కనిపించే  సుందర  స్వప్నం - పెళ్లి  ఒక  నడిచిపోయే  నిజమైన మన  ఊరి  కాలి  బాట 

 పెళ్లిని  అలా  తీర్చి  దిద్దుకుంటే  ఇది  కూడా  సుందరమే  సుమదురమే 

మొగుడు  పెళ్ళాం లా కాక   

 భార్యా  భర్తలు  ప్రాణస్నేహితులై  జీవించి నపుడే 

మార్పు సమాజంలో లేనిది ఫలితం శూన్యం

యధా రాజా  తథ  ప్రజా  అనేది  పాత  నానుడి  
యదా  ప్రజా  తథ  రాజా  అనేది  కొత్త   నానుడి 

వరకట్నం  దురాచారంలా  లంచావతారం  నిలిచింది 

అవినీతి  మార్గాలలో  సొమ్ము  చేసుకుంటున్నారు 

తిను  తినిపించు  అనేది  కొత్త   సిద్దాంతం  

చిల్లర  దొంగల  భరతం  పట్టే  మనం  

పెద్ద   వారి  ముందు  జోలె  పడతాం 

భారీ  ఎత్తున  చేసే  వారి  భజన  చేస్తాం 

భుక్తి  కోసం  చేసే  వారిని  నిలదీస్తాం  

ఎవరు  ఎన్ని  పోరాటాలు  ఆరాటాలు  చేసినా 

మార్పు  సమాజంలో  లేనిది   ఫలితం  శూన్యం 

ఈ ప్రక్షాళన అవసరంఈ  ప్రక్షాళన  అవసరం  

ప్రస్తుతం  సమాజంలో  ఏ .సి .బి ., సి.బి.ఐ ., కోర్టులు 

ఎంత  పెద్ద   వారైనా  చట్టానికి  మించిన  వారు  కాదు 

అనే  స్పష్టమైన   సంకేతాలు  విస్పష్టంగా  తెలిజేస్తున్నాయి 

అన్న  హజారే  , రామదేవ  బాబా  పోరాటం  ఆరాటం  చట్టం  తేవాలని 

ఉన్న    చట్టాలే  చాలు  నిజాయితి   నిబద్దత  ఉంటే  అని  నిరూపిస్తున్నాయి 

మనం  ఎన్ని  చట్టాలు  చేసినా  ఆచరించే  వాళ్ళు  లేకపోతే  అది  సామాజిక  

రుగ్మత   వరకట్నం  చట్టాలలా , బాల్య  వివాహ  చట్టలా  మిగిలిపోతాయి 

మంగళవారం, మే 15, 2012

ఒట్టి మూర్ఖుడు అని అర్థం
జీవితపు గుణపాటం చూసి  నేర్చుకోవాలి , అనుభవించి కాదు 


జీవితపు ఆనందాలు అనుభవించి సొతం చేసుకోవాలి,చూసి కాదు

ఈ నగ్న సత్యం   తెలియని వాడు 

వీటి  మధ్యగల  భేదం తెలుసుకోలేని  వాడు  

ఒట్టి  మూర్ఖుడు  అని అర్థం 

జీవితంలో  పడరాని కష్టాలు  పడతాడు .

ఆదివారం, మే 13, 2012

ముద్దుల తల్లిని నేను ఒక స్త్రీని

 • నేనెవరిని  గాలిని-గాలిలో  గాలిలా తిరిగే  గాలిని .
 • సుడి గాలి ని  కాను  వడ  గాలిని  కాను .
 • చల్లదనానికి  చక్కటి శ్వాసకు  వుపిరిలు  పోసే  చల్లని  గాలిని. 
 • అమ్మ   లాలి  పాట  లాంటిదాన్ని .
 •  సేద  తీర్చి  ఆహా ...  ఆహా... అనిపించే  మీ  ప్రాణ  వాయువును .
 • మీ  ఉపిరిని .

 • నేనెవరిని నీటిని - నీటిలో  నీరులా నింగి నుంచి జాలువారే  నీటి బొట్టు ని .
 • తుఫానును  కాను  సునామిని  కాను .
 • మీ  గొంతు  తడిపే  చల్లని  ఐసు  వాటరుని 
 • అమ్మ   పాలలా  కడుపు  నింపే దానిని .
 • దాహాన్ని  తీర్చి  హమ్మయ  అనిపించే  మీ  ప్రాణ  దాతను .

 • నేను  అగ్నిని  - జ్వలజ్వలి త  జ్వజ్వవల్యా మానాన్ని  జ్వాలను .
 • ఖాండవ  దహనం  చేసే , కొంపల  బూడిద  చేసి  దుర్మాగ్నిని  కాను .
 • మీ  కంటిపాపలకు   వెలుగు నిచ్చే  మీ ఇంటి  దీపాన్ని .
 • మీ ఇంట  సిరులు  పొంగించే  మీ  దేవుడి  దీపాన్ని .
 • మీ  ఇంట  వంటకు  ఉపయోగించే  మీ అగ్నిని .

నేను  ఈ  త్రిగునస్వరుపాన్ని  మీ నటింట  పారాడే  మీ  అమ్మను మీ ముద్దుల  తల్లిని  నేను  ఒక  స్త్రీని  .

దేవుడు కూడా సరిరాడు అమ్మ ముందు

అమ్మ   అనే  పదం  ఒకరు  వ్రాసింది  కాదు  వేరెవరో  సృష్టించింది  కాదు This image was selected as a picture of the we...

పాలు గారే  పసిపాప  గులాబి రేకుల  లేత  పెదవుల  ధ్వని  నుంచి  పుట్టింది 

" ఉమ్  ఉమ్  ఉమ్మా కాస్తా  అమ్మ  అయి ఆవిష్కరించింది "

అమ్మ   అనేది  ఒక  సుమధుర  రాగం , అది  ఒక  జీవన  గీతం 

అమ్మే  లేకుంటే  ఈ  జీవితమే  లేదు .


అందరు  ఆద   మరచి  నిదురించిన  నిదురలోనే  మేలుకొని  వుండేది  అమ్మ   

మనము  ఎలా ఉన్నామో  ఎలా  ఉంటామో  అనే  నిరంతర  మన  ధ్యాస  తో 

నిదురలో  కూడా  ఏమి  మనకు  అవసరం  అవుతుందో అనే  ధ్యాస  తో  

మరణము లో  సహితం  మన  హితమే  కోరేది  అమ్మ  వాడు  వచ్చాడా , 

వీడు  ఆకలికి  తాళ  లేడు   దానికి  భయమేక్కువ  అది  చిన్నది  వీడు ....

ఎన్నో ఎన్నెనో  పలవరించత లు , కలవరింతలు  అదీ  అమ్మ  అంటే .

ఆకాశానికి  ఆవలి తీరం  ఏమిటంటే  మనకు  కనిపించేది   అమ్మే 

భూమాతకు  మించినది   ఎవరంటే  మనకు  దొరికేది   అమ్మే 

భూ  ఆకాశాలు  కోపం  వస్తే  ప్రకృతి  విలయం  పేరుతొ  విరుచక  పడతాయి 

అమ్మ   ఎప్పుడు  అలా  చేయదు  దండించటం  కూడా  దయతోనే  

దేవుడు  కూడా  సరిరాడు  అమ్మ   ముందు 

అమ్మ  / మదర్  = నీ  మదర్  టంగు , నీ  ఐడెంటిటి , నీ  ప్లేసుమెంటు , నీ  బేసుమెంటు .

శనివారం, మే 12, 2012

దేవుడిని అనవసరంగా డిస్టర్బ్ చేయ రాదు .

ఎంతని గొంతెత్తి పిలువను 
నా పిలుపు వినవా 
నా మొర  కనవా 

చిన్న  తనంలో  తల్లి  పోతే 
పొగిలి  పొగిలి  ఏడ్చాను  
నీ  రాక  కానక   నిదురలోకి  జారుకున్నాను .

ఎంతని గొంతెత్తి పిలువను 
.....................

కోడె  వయస్సులో  ఎదుటి వారి  ఎగ  తాళికి  చిన్న  పోయి 
ఎంతగా  ఏడ్చానో   ఓదార్పు  కోసం 
అయినా  నీవు  రానే  లేదు నా  కోసం  అని  మౌనిలా  మారాను .

ఎంతని గొంతెత్తి పిలువను 
...............


స్నేహితులు  పెద్దవారు  పరలోక  గతులైరి   ఒక్కోకరుగా 
ఒంటరిని  చేసారు  నన్ను  శోకసంద్రంలో  మునిగినా  
రాలేదని  నీవు   పిలవటమే  దండగ అనుకున్నాను .ఎంతని గొంతెత్తి పిలువను 
................


సునామి  భాదితిలు , సుడిగాలి  భాదితులు , భూకంప  భాదితులు , ఆకలి  భాదితులు , బ్రతుకంటే  భయం  తో  వణికి  పోయే  వారిని  దగ్గరగా  కంప్యుటరులో  చూసి  ,  నీవు  పడుతున్న   కష్టము  చూసి  ,  ప్రపంచంలో   భాధ  ముందు  నా  భాధ   చాల   చిన్నదని  తెలిసి   భాధతో  చలించి  పోయా 
ఇక  నిన్ను  ప్రతి  సారి  పిలిచి  భాదిన్చారాదని   తెలుసుకున్నా . నా పిల్లలకు  ఇదే  విషయం  చెప్పి  ఒప్పించినాను  


దేవుడిని  అనవసరంగా   డిస్టర్బ్     చేయ రాదు  . 


మీ  సమస్య   మీరే  తీర్చుకోవాలని .


ఓ బంగారు తల్లి

ఓ  బంగారు తల్లి A painting showing the affection of mother.
నీ లేత  చేతులతో   ఈ  ప్రపంచంలోని   ప్రేమ మొత్తం  పొందినావు 
అందుకేనేమో  ఈ   ప్రంపంచమంతా   ఎదిగిన  నీ    పై  ఆంక్షలు పెడుతుంది .

ఓ  సుకుమార  పడతి 
అత్తా మామ లు  భర్త   పిల్లలు  అనే భావబంధాలతో   నిన్ను  కట్టు బానిస                  చేసి   కట్టి   పడేస్తారు 
ప్రేమ   భాధ్యతలు  అనే సంకెళ్ళతో  నీ గృహాన్నే కార గృహం చేస్తారు .

ఓ గంగా భాగిరథి 
నీ పిల్లలే నిన్ను ఇంటి కాపలా కుక్కను చేస్తారు  నీవు వున్నా  వన్న   సృహ   లేకుండా  వుంటారు .
మంచాన  పడ్డవా   మంచినీల్లుయిన  దొరకవు  ఒక్కరు నీ కొరకు ముందుకు రారు .


ఓ  వయస్సు  వుడిగిన  అవ్వా 
రెక్కలొచ్చిన  పిల్లలు ఎగిరిపోతారు తమకు చేతకాదని 
వృద్ధ   ఆశ్రం  లో  వదిలి పోతారు అన్ని వున్నా అనాధలా 
నీవెపుడు పోతావో అని ఎదురు చూస్తారు అయ్యో పాపం అంటూ .

బహుశా  ఈ  బందానాల  మమకారం  నీలో  చావాలని నీ రక్తం పంచుకున్న నీ   పిల్లలు   ఇలా    చేస్తున్నారేమో 
నీ ఫోటో ఒకటి వాల్  పేపర్ల  లా  వారి కంప్యుటరు లోనో లాపు టాపు లోనో  పోస్ట్   చేస్తారు  వారసులుగా నీ ఆస్తి కోసం .

గురువారం, మే 10, 2012

ప్రజలు ఎవరిని చూసి నేర్చుకోవాలి యేమని నేర్చుకోవాలి

వార్తలు చూసారా   
పేపర్లు తిరగేసార  
రచ్చ  బండ  చర్చ  కన్న
కనా కష్టంగా  వుంది 

మా వీధిలో  అమ్మలక్కలు 
ఇంతకన్నా  చక్కటి  విమర్శ  చేస్తారు 
మా రచ్చ బండ  పెద్దలు 
ఇంతకన్నా  చక్కటి  సలహాలు ఇస్తారు    

బురద  చల్లుకొనే  ఆటలో  కూడా 
న్యాయ  సూత్రాలు  వుంటాయి  గమనిస్తే 
నాయకులూ  మీరే  ఇలా  రచ్చ  రచ్చ   చేసుకుంటే 
ప్రజలు  ఎవరిని  చూసి  నేర్చుకోవాలి  యేమని  నేర్చుకోవాలి 

బుధవారం, మే 09, 2012

తెల్ల జండాలో తెలివితేటలేన్నో బ్రిటిషు వాడు నేర్పాడు ఓర్పుగా నేర్చుకో

     రాజకీయపు ఆట 

రాజకీయపు  చదరంగంలో  బంటులే  గుదిబండలు  

చుట్టుకుంటాయి  మెడ  చుట్టూ  ఉరి తాల్లై  

ఇది ఒక పద్మవ్యుహమా అది ఒక  కురుక్షేత్ర  యుద్దమా 

అబిమన్యులా ఒరిగి పోతావో  అర్జునిలా  విజ్రుమ్భిస్తావో 

కీర్తి పై ఒక  వేటు  ఆర్ధిక  వనరుపై  ఒక  వేటు 

మూకుమ్మడి  ముప్పేట  దాడితో  ఆయువుపై  ఆఖరి  వేటు 

బ్రూటసుల బృందాలే  ఎక్కువ శకుని మామలే  మక్కువ  

చేసిన  ఒక  పొరపాటు వేసిన  ఒక  తప్పుడు  రాజకీయపు ఎత్తుగడ 

రణ  క్షేత్రంలో  అభిమన్యుని గా నిలిపాయి అర్జునిగా రాణించాలంటే 
రాజీ రాజకీయపు ఎత్తు  వేయాలి 

తెల్ల జండాలో  తెలివితేటలేన్నో బ్రిటిషు వాడు నేర్పాడు ఓర్పుగా నేర్చుకో 

మంగళవారం, మే 08, 2012

వివాహం స్వర్గంలో నిర్ణ యిస్తారు చాలా గొప్పదని .

స్వర్గంలో వివాహం నిర్ణయించారా  

వివాహం స్వర్గంలా నిర్మించుకోవాలా 

మొదటిది దేవుని చేతిలో ఉందంటారు 

రెండవది మాత్రం నీ చేతిలోనే వుందంటాను 

చదువు సంస్కారం నేరిచినవాళ్లు 


ఎవరు నేర్పాలిమీకు మీ బ్రతుకుల నడతలు 

నడవడిలో ఆ అరమరికలు ఎలా పుట్టుకోస్తాయీ 

పురుడుపోసుకున్నఆ పిచ్చి ఊహల ఊదిపారేయి 

వుసులు కలబోసుకునే పొదరిల్లకు పందిరివేయి 

వివాహం స్వర్గంలా చేసుకో అప్పుడే 

వివాహం స్వర్గంలో నిర్ణ యిస్తారు చాలా గొప్పదని 

"వివాహం స్వర్గంలో నిర్ణయిస్తారు " 
అనే పెద్దల  మాటకు  అర్థం ఇదే 

సోమవారం, మే 07, 2012

కన్నీళ్ళు - చంద్రశిలావ్రత ధార

కన్నీళ్ళు 

ఎదలోయలలో సడి చేయక  
వడి వడి సుడులు తిరుగు సాగే ఒక  అసిధారా స్రవంతి 

మది ఊ హలలో ఉవెత్తున ఎగిసే
ఉసుల బాసల ఊపిరాడని ఒక వుక్కిరిబిక్కిరి విపంచి

నయన గోళాలలో నర్తన చేసే 
భావ భాధా తరంగాలై  ఉ రికే ఒక భావజల తరంగిణి 

అగ్గ్నిశికలై జ్వాలాముఖి సముఖై జ్వలించే 
హృదయా బడబాగినుల చప్పున చల్లార్చే     చంద్రశిలావసి ధార 


కన్నీళ్ళు కనుకొలనుల జారే కమనీయ దృశ్య కావ్యాలు 

కన్నీళ్ళు ఎరుపెక్కిన కన్నుకొనలనుంచి జారే దయనీయ దారుణ దృష్టాంత దృశ్యాలు  

  

గురివింద

గురివింద  

ప్రపంచంలో నేనొక్కడనే మంచివాడిని 
అనంత విశ్వంలో నేనొక్కడనే గుణ వంతుడిని

నాలా ఎవరు వుండరు అయినా నాకే ఇన్ని పరీక్షలు 
దేవుడు వున్నాడా వున్నా నిదురోతున్నడా 

ఇలా భాధ పడేవారిని చూసాను 
ప్రపంచమంతా తమ తలపై మోసేవాళ్ళల చాలా కష్టపడి పోతారు 

చుట్ట్టు వున్నా పరిసరాలను , ఇరుగుపొరుగు వారిని  చూస్తూ వుండి  
అస్తమానము తిట్టు కుంటారు  
యెఒక్కసారి అంతరంగంలోకి తొంగి చూడరు తమ  లోపాలను సరి చేసుకోరు  

తమకు కావలసింది  జరిగితే  వేరి గుడ్  లేదా వేరి బాడ్ 
గురివింద  సామెత  పెద్దలు ఉరికే  చెప్పలేదు  వీరిని చూసే .


ఆదివారం, మే 06, 2012

సంసారం - సాగరం

సంసారం - సాగరం 

ఊరకే అనలేదు పెద్దలు 
ఎన్ని ఆలోచలనలు అలజడులు 
అంతరంగంలో సుడిగాలిలా సుడులు తిరుగుతూ రేగినా 
అంత ఎత్తున ఎగిరేగిరే అలలులా ఆకాశానికి చెలరేగినా  
ఎలా కడలిలో ఒదిగి పోతాయో తల్లి ఒడిలో ఒదిగి పోయిన 
పసి పాపలా 
అన్ని ఆవేశాలు అన్ని సంఘర్షణలు పెదవి దాటి రారాదు  
కుటుంబం దాటి  అసలే రారాదు 
అనే సంసారం సాగరం అన్నారు అంతె కాని కష్టాల కడలి అని కాదు 


ఈ బంధాలు నిలుపాలన్న అనుబందాలు పెంచాలన్న 
కడలిలొని జలాకర్షణలా కుటుంబంలో మమతాకర్షణ పంచాలి  

శనివారం, మే 05, 2012

స్వేచ్చ


స్వేచ్చ  స్వేచ్చ    ఒకరిస్తే వచ్చేది కాదు
అది పుట్టుక తో  పుట్టుక  వచ్చింది 

ఊపిరి  ఎవరిని అడిగి తీసుకుంటావు 
దాహంల  కావలసి వస్తే తీసుకొనేటందుకు 


బందిఖానలో  వున్నా ఆరు బయట  వున్నా 
బంధించరాదు బ్రతుకు  ఊ   పిరిలు ఊదే  స్వేచ్చ ను 

బానిస  బంధిళ్ళ  సంకెళ్లు  వేయరాదు 
మృగయా  వినోదము  చూడరాదు .

వాడే దానిలో వుంది

వాడే దానిలో  వుంది 

బెల్లం సారా కాపు కు వస్తుంది  చలివెంద్రానికి పనికి  వస్తుంది .
బుద్ది కూడా  దుష్కార్యలకు  వస్తుంది  సత్కార్యాలకు  పనికి  వస్తుంది .

పంచదార చిలకలు

పంచదార  చిలకలు 

పంచదార  నీళ్ళు  ఏలకుల  పొడితో  జత  కలిసి  పానకం  అవుతుంది .
పామరుడు  పరమ  గురువుల  చెంత  చేరి   పరిపూర్ణుడు  అవుతాడు .

పెసిమిస్ట్ పెసిమిస్ట్ కాదు

పెసిమిస్ట్ పెసిమిస్ట్ కాదు 

భావజాలంలో  జారిపోతూ గంతంలోనే  గడిపేయకు 
బ్రతుకు బండిని లాగిపట్టి  ప్రగతి ఏదని ముసుగేయకు 

మూసుకున్న తలుపు సందున మూరెడే కనిపించుమనకు 
లేదు ప్రగతని లేదు జగతని మునక వేసి పడకేయకు 

నిన్న లేనిది నేడు వుంది నేడు లేనిది ముందెన్నడో  రానుంది 
వుహకైన అందని అమోఘమైన అమృత ఫలాలు తేనున్నది 

మనసు పొరల తెరలను తోలగించుకో  వెలుగు రేఖలు తామే తొంగి చూస్తాయి 
బద్దకాన్ని బలవంతగానైన వదిలించుకో  బంగారు భవితవ్యం నీ ఒడిలో ఒరిగి పోతుంది 

దారి తప్పిన బాట సారి  బాట పట్టి నడువవోయి 
ఏ ఇజాలు నిన్ను అంట జాలవు అన్ని నిజాలు నీవెంట వున్నాయి 

మనసు తలుపులు  తెరుచుకొని  మనసార  మనుగడ చేయవోయి 
ఏ భయాలు భ్రాంతులు నిన్ను అంట జాలవు వెలుగు రేఖలు వెంటరాగ 

( అన్ని విధాలా  దెబ్బతిని అల్లాడి పోతున్న సోదరుల కొరకు )