శనివారం, మార్చి 31, 2012

రావణుని పాలిటి రా( య)ముడు అని పిలిచిన పలికేటి కో దండ రాయుడు అని తెలుసు .
రాముడు అంటే 
 రావణుని పాలిటి రా( య)ముడు అని పిలిచిన పలికేటి కో దండ  రాయుడు అని తెలుసు .


శివ ధనుర్ భంగము నాడే 
రాముడు శివ సమానుడు , రావణుడు శవ సమానుడు అని ఆనాడే ఎరుక యా శివ భక్తుడికి .
స్వయం వరంలో స్వయముగా రాముని సంహార రసమును చవి చూశాడు
వాలి బుద్ధి మాని  వచ్చిన దారినే మర్యాదగా మాయమైనాడు ఆ రాక్షసుడు .

అది శివ ధనుస్సు భంగం కాదు అది మదించిన రావణ మత్తేభ మద మణ చిన భంగిమ

మదించిన నల్లని ఏనుగు తన బలమైన తొండముతో  పెద్ద మర్రి కొమ్మను పట్టి ఫళ ఫళ విరచినట్టు 

అరి వీర భయంకరుడు అయిన ఈ రాముడు తన బలమైన బాహువులతో శివ ధనుస్సు ఎత్తి పెళ పెళ విరచి పడేశాడు.

ఎత్తిన ధనువు ఎత్తినట్లే పెటిల్లున  రెండు ముక్కలు కాగ  తటిల్లున విద్యుత్ కాంతి లతికలా తటాలున సీతా నా ముక్కాలా నడుమ దోచెను  విధ్యుల్లతికలా .

 ఆ శివ ధనుస్సు భంగం 
పరులకు ధరులకు  ఉరుములు మెరుపులు  కాగా , 
వధూవరులకు  ఊర్పుల వలపుల మెరపులై తోచే .

అది శివ ధనుస్సు భంగం కాదు  అది మదించిన రావణ మత్తేభ మద మణ చిన భంగిమ

శ్రీ రామ నవమి - సీతా రాముల కళ్యాణం

శ్రీ రామ నవమి - సీతా రాముల కళ్యాణం 

చూడ చక్కని జంట - చూడ ముచ్చటనంట


చూపరుల తలతిప్ప నివ్వదంటా.......
మనోఫలకమున  పటమై నిలుచునంట.


దశరథ తనయుడు రామయ్య ఇతడంటా.......
జనకుని కూతురు జానకీ ఈమె నట.


 అహ-అలవోకగా ఆ విల్లును విరచీ .....
 ఇహ - చివురులాటి  సీత చే పట్టనే .గురువారం, మార్చి 29, 2012

జటాయు కబందం శబరీ సీతాన్వేషణ

రామాయణం - బాల కాండ 
   సర్గ - ౧ 

నారద ఉవాచ :
రాఘవః సోక సంతాపో విల్లపాకుల ఇంద్రియః 
తతః తే న ఏవ శోకేనా గ్రుధం దగ్ద్వ  జటయుశం-54 


మార్గమనే వనే సీతాం రాక్షసం సందర్శః 
కబందాం నామ రూపేన వికృతం ఘోర దర్శనం -55 


తం నిహత్య మహాబాహు : దదాః స్వర్గతః చ సః
స చ ఆర్య కథయామాస శబరిం ధర్మ చారిణీం -56 


జటాయు కబందం శబరీ  సీతాన్వేషణ 


వీరంతా రామునికి  దారి చూపేవారు .మారీఛి మాయ - రావణ అపహరణ

రామాయణం - బాల కాండ 
    సర్గ - 1 

నారద ఉవాచ :


సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం 
వర్యమానః శుభాహుసో  మారిచేన స రావణః - 50 


న విరోదో బలవతా క్షమో రావణ తేన తే 
అనాద్రియ తు తత వాక్యం రావణః  కాల చోదితః -51 


జగాం సహా మరీచః  తస్య ఆశ్రం పదం తాడ
తేన మాయావిన దూరం  అపవాహ్య నృప ఆత్మజౌ  -52 


జహార భార్యం రామస్య గ్రుధం హత్వా జటయుశం
గ్రుధం చ నిహతం ద్రిష్ట్వహృతం శ్రుత్వాచ మైథిలీమ్ - 53 
మారీఛి మాయ - రావణ అపహరణ 


ఎందుకు  మారీచుని ఎన్నుకున్నాడు .
ఎందుకు మాయ చేయాలనీ అనుకున్నాడు .
ఎందుకు అపహరించాడు .

రాముని యొక్క విశ్వరూపం మనకు కనబడుతుంది .

రామాయణం - బాల కాండ 
      సర్గ - 1తేన తత్ర యేన వసత జనస్థాన నివాసిని 
విరూపిత శుర్ఫనఖ  రాక్షసి కామ రూపిణి - 46 


తతః శుర్ఫనఖ వాక్యాత ఉద్రుతాన్ సర్వ రాక్షసాన్ 
ఖర్మ త్రిశిర్సం చ ఏవ దుర్గుణం చ ఏవ రాక్షసం  - 47 


నిజఘాన్  రణే రామః తెషణం చ ఎవ పథ అనుగ్నాన్ 
వనే తస్మిని నివసత జనారణ్య నివసినాం - 48 


రాక్షసం నిహతాని ఆసన్ సహస్త్రాని చతుర్ దశ
తతే జ్ఞాతి వధం శ్రుత్వ రావణః క్రోధ మూర్చితః - 49 


ఇక్కడ 
రాముని యొక్క విశ్వరూపం మనకు కనబడుతుంది .
 14000 మంది రాక్షసులన్ జనస్థానము ఆ వాసము చేసుకున్న  వారిని ఒక్కడే సంహరించాడు .
వారంతా శుర్ఫనఖ ప్రేరితులు .

రక్షకుడు - రాముడు

రామాయణం - బాల కాండ 
      సర్గ - 1 నారద ఉవాచ :
రామః తు పునః అలక్ష్య  నగరస్య  జనస్య చ 
తత్ర ఆగమనం ఎకాగ్రో దండకాన్  ప్రవివేశః - 41 
ప్రవిస్య తు మహా అరణ్యం రామో రాజీవలోచనః 
వీరాధం రాక్షసం  హత్వా శరభంగం దద్రిశః -42 


సుతీక్షణం చ అపీ అగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథః
అగస్త్య వచనాత్ చ యేవ జగ్రుహ్ ఇంద్రం శరాసనం-43 


ఖడ్గం చ పరం ప్రీతః తుష్ని చ అక్షయ సాన్ఖయౌ
వశ్తః త్రయ రామస్య వనే వన చరె : సహ  - 44 


రిష్యః అబ్యాగామన్ సర్వ వధయ అసుర రాక్షసం 
స తేషాం ప్రతి సుష్రవ రాక్షసనామంత్య వనే  - 45 


ప్రతిజ్ఞాతః  చ రామేణ వధః సంయాతి రాక్షసం 
రుషినాం అగ్ని కల్పనాం దండకారణ్య వసీనామ్ - 46 


 రక్షకుడు - రాముడు 
ఇక్కడ మనకు రాముడు ఒక రక్షకుడు గా కనిపిస్తాడు .
అదే పనిగా అడవిలోనికి  వచ్చాడ అన్నట్లు  ఒకే దెబ్బకు విరాధుని చంపుతాడు . అక్కడ వున్నా గొప్ప గొప్ప మునులు , ఋషులను రాక్షస బారి నుంచి తప్పిస్తాడు .


సంతృప్తి చెందిన అగస్త్యుడు  ఇంద్ర చాపము , అక్షయ తునీరము , ఖడ్గము ఇస్తాడు .


వీటి తో రాముడు ఒక  గొప్ప రక్షకుడు  గా  ఉండవలసి వుంది .

భరత వైశిష్ట్యం

రామాయణం - బాల కాండ 
  సర్గ - 1 


నారద ఉవాచ
గత్వ తు స మహాత్మానం రామం సత్య పరాక్రమం 
అయచాట్  భ్రాతరం  రామం ఆర్య భావ పురశ్కరుతః -35 


త్వం ఏవ రాజా ధర్మజ్ఞా ఇతి రామం వచః అబ్రవీత్ 
రామో ఆపి  పరమోదరః  సుముఖ: సుమహయసాః -36 


న చ  ఇచ్చాట్  పితృ ఆదేశాట్ రాజ్యం రామో మహాబలి :
పాదుకే  చ ఆర్య రాజ్యాయ న్యాసం దత్త్వ పునః పునః -37 


నివార్త్యమాస తతో  భరతం భరతాగ్రజః
స కామం  అన్వాప్య ఏవ రామ పాద ఉపశ్రిసాన్ -38 


నంది గ్రామే అక్రోట రాజ్యం రామ ఆగమ కాంక్షయ
గతెతు భరతే శ్రీమాన్ సత్య సంధో జితేన్ద్రియః - 39 
భరత వైశిష్ట్యం 
రాజ్యం వచ్చింది 
కోరకుండానే వచ్చింది 
అందరు పిలిచి సింహాసనం ఇస్తున్నారు 
అయినా కూడా వద్దు 
రాముడే ఎప్పుడు రాజు 
ఆయన రాకపోతే ఆయన పాదుకలే రాజ్యాన్ని పరిపాలిస్తాయి.


అందుకే  ఆ మహానుబావుడు  కైకేయ కుమారడు  చెప్పిన మాట ఏమిటో తెలుసా .......


న ఇచ్చాట్  రాజ్యం  ఇతి 


ఈ రాజ్యం నా కొద్దు ... అంటే  ఏమైనది ఈ రాజ్యం వద్దు అంటాడు.
ఈ రాజ్యానికి ఏమైంది ......
ఈ రాజ్యములో రాముడు లేడు . రాముడు లేని రాజ్యం నాకెందుకు .
మా నాయనే రాముడు లేడని ఈ రాజ్యం విడిచి పెట్టి పరలోకానికి పోయాడు .
రాముడు లేడు అందుకే నాకే రాజ్యం వద్దు .
అందుకే ..... చూసారా పాదుకలు తీసుకొని నందిగ్రామం లో  కుర్చ్చునాడు  అంతేకాని రాజ్యం లోనికి పోలేదు .


ఈ .... రాజ్యం ....అంటే  రాముడు లేని రాజ్యం అని .
న ఇచ్చాట్  అన్నాడు . నా కొద్దు .


అదే భారతం లో అర్జునుడు  న కాంక్షం రాజ్యం  అన్నాడు .
నేను రాజ్యం కోరను అన్నాడు .
ఇక్కడ ఆయనకు ఇంకా రాజ్యం రానేలేదు 
ఎవరు ఇస్తాము  అనలేదు . యుధం వద్దు అనే వైరాగ్యం లో  న కాంక్షం అన్నాడు .


ఆ వైరాగ్యము - ఈ త్యాగము తూర్పు - పడమర  లాంటివి .


ఈ కాలంలో  ఈ రెండింటి తేడ మరిచి  రానిదంతా మనమే    త్యాగం చేసివేసినట్లు ఫోటో వేయించుకుంటాం .నియుజ్యమానే రాజ్యాయ న ఇచ్చాట్ రాజ్యం మహాబలి:

రామాయణం - బాల కాండ 
  సర్గ - 1 

నారద ఉవాచ : 34 


నియుజ్యమానే రాజ్యాయ న ఇచ్చాట్ రాజ్యం మహాబలి:
స జగాం వనం వీరో రామ పాద ప్రసదకః 

రాజా దశరతః స్వర్గం జగాం విలాపాన్ సుతం

రామాయణ - బాల కాండ 
         సర్గ - 1 

నారద ఉవాచ : ౩౩


రాజా దశరతః స్వర్గం జగాం విలాపాన్ సుతం 
గతే తు తస్మీన్ భరతే వశిష్ట ప్రముఖై : ద్విజై :

చిత్రకూటం గతే రామో పుత్ర శోక ఆతురః తథ

రామాయణం - బాల కాండ 
        సర్గ - 1 

నారద ఉవాచ : 32 


దేవ గంధర్వ సంకాసః  తత్రతే న్యావాసాన్ సుఖం 
చిత్రకూటం గతే రామో  పుత్ర శోక ఆతురః తథ 

చిత్రకూటం అనుప్రపాయ భారద్వాజస్య శాసనాథ్

 రామాయణం - బాల కాండ 
          సర్గ - 1 

నారద ఉవాచ : 31 


చిత్రకూటం అనుప్రపాయ భారద్వాజస్య శాసనాథ్ 
రమ్య ఆవాసయం కృత్వా రమామణ త్రయః 

గుహేఆనా సహితే రామో లక్షమనోన చ సీతాయ

రామాయణం - బాల కాండ 
    సర్గ -1 
నారద ఉవాచ : 30  


గుహేఆనా సహితే రామో లక్షమనోన చ సీతాయ
తే వనేన వనం గత్వ  నదీ: తీర్త్వ బహు ఉధకః 

గూహం ఆసాధ ధమ్రతం నిషాధ అధిపతిం ప్రియం

రామాయణం - బాల కాండ 
          సర్గ - 1

నారద ఉవాచ : 29 


శృంగీభేరపురే సూతం గంగా కులే వ్యసర్జయత
గూహం ఆసాధ ధమ్రతం నిషాధ అధిపతిం ప్రియం  

సితాప్య అనుగాతా రామం శశినం రోహిణి యథా

రామాయణం - బాల కాండ 
   సర్గ - 1 నారద ఉవాచ : 28 


సితాప్య అనుగాతా రామం  శశినం రోహిణి యథా 
పౌర్యై : అనుగాతే దూరం  పితృ దశరతేన చ 

జనకస్య కులే జాతా దేవ మాయెర్వ నీర్మీతా

రామాయణం - బాల కాండ 


          సర్గ - 1                        

నారద ఉవాచ : 27 


జనకస్య కులే జాతా దేవ మాయెర్వ నీర్మీతా 
సర్వ లక్షణ సంపన్నా నారీణాం ఉత్తమం వధూ:

బుధవారం, మార్చి 28, 2012

రామస్య దయిత భార్యే నిత్యం ప్రాణ సమ హిత

రామాయణ - బాల కాండ 
       సర్గ - 1 

నారద ఉవాచ : 26 


భ్రాతరం దయితే  భ్రాతు: సౌభ్రాతారం అను దర్శయాన్
రామస్య దయిత  భార్యే  నిత్యం ప్రాణ సమ హిత 

స్నేహత వినయ సంపన్నః సౌమిత్రి ఆనంద వర్ధనః

రామాయణం - బాల కాండ 
          సర్గ - 1 

నారద ఉవాచ : 25 


తం వ్రజంతం  ప్రియే  భ్రాతా లక్ష్మణః అనుజగామః 
స్నేహత వినయ సంపన్నః సౌమిత్రి ఆనంద వర్ధనః


తం వ్రజతం అనుజగామః  ప్రియభ్రాత లక్ష్మణః 
సౌమిత్రి ఆనంద వర్ధనః స్నేహతా వినయ సంపన్నః 


ఆయన వెంట ప్రియ సోదరుడు లక్షణుడు బయలు దేరాడు . ఆ సౌమిత్రి మాతా సుతుడు స్నేహములో వినయములో చాలా గొప్పవాడు .

మంగళవారం, మార్చి 27, 2012

పితృ వచన నిర్దేశాత కైకేయః ప్రియ కర్షనాథ

రామాయణం - బాల కాండ 
       సర్గ - 1 

నారద ఉవాచ : 24 


స జగాం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయాన్


పితృ వచన నిర్దేశాత కైకేయః ప్రియ కర్షనాథ
కైకేయ కు సంతోషము కలిగించటానికి , తండ్రి మాటలు  నిర్దేసించినట్టు ప్రతిజ్ఞా పాలించుట కొరకు , ఆ వీరుడు బయలుదేరినాడు .

వివస్యామాస సుతం రామం దశరతః ప్రియం

రామాయణం - బాల కాండ 


     సర్గ - 1 నారద ఉవాచ : 23 


స సత్య వచనాత్   రాజా ధర్మ పాశేన సంయతః 


వివస్యామాస సుతం రామం దశరతః ప్రియం 
రాజా దశరథ ధర్మ పాశేన  స సత్య వచనాత్ సంయుత ప్రియ సుత రామం వివస్యామాస .


ధర్మ పాశుడు - ధర్మమూ చే భందిచ బడినవాడు 


రాముని అడవికి పంపాడు  సత్య వాక్య పరిపాలన కొరకు .

వివాసనం చ రామస్య భరతస్య అభిషేచనం

 రామాయణం - బాల కాండ 
            సర్గ - 1 

నారద ఉవాచ : 22 


పూర్వం దత్త వరం దేవి వరంయేనం అయాచత


వివాసనం చ రామస్య  భరతస్య అభిషేచనం 
పూర్వం దత్త వరం - ఇదివరకెప్పుడో ఇచ్చిన వరాలు
ఇప్పుడు దేవి ఆ వరాలు ఇవ్వమని అడిగింది .


వివాసం - ఆవాసములు లేని చోట నివాసం అంటే 
వన వాసం  రాముని కి , అభిషేకం భరతునికి .

తస్య అభిషేక సంభారణ దృష్ట్వా భార్యాయ కైకేయీ

రామాయణం - బాల కాండ 
    సర్గ - 1 


నారద ఉవాచ : 21 

యౌవ రాజ్యేన సంయుక్తం  ఏచ్చాత ప్రిత్యాయ మహిపథీ:


తస్య అభిషేక సంభారణ  దృష్ట్వా భార్యాయ  కైకేయీ 


మహి పతి - దశరథ రాజు  ప్రేమ తో  యువ రాజ్య పట్టాభిషేకం చేయాలనీ నిర్ణించాడు.
అక్కడ జరుగుతున్న సంబరాలన్నీ చూసినా భార్య కైకేయ 


ఇక్కడ మొదటి సరిగా కైకేయ ప్రస్తావన వచ్చింది .


యువ రాజ్య పట్టాభిషేకం వచ్చింది .

జేష్టం శ్రేష్ఠ గునై: యుక్తం ప్రియం దశరతః సుతం

రామాయణం - బాల కాండ 


        సర్గ - 1 నారద ఉవాచ : 20 


జేష్టం  శ్రేష్ఠ  గునై: యుక్తం ప్రియం దశరతః సుతం 


ప్రకృతినం హితై: యుక్తం ప్రక్రుతీ కామ్యాయా 
దశరథ  ప్రియ జేష్ఠ పుత్రుడు  శ్రేష్ట గుణములను కలిగి వున్నాడు 


స్వభావములోనే  కాకా చేసే పనులలో కూడా హితము జరగాలని చూసేవాడు .


చాల మంది మహాను భావులు  సర్వ్ జనో సుఖినో భవంతు అంటూ ప్రార్థన మాత్రమే చేస్తారు ... తదను గుణంగా పని చేయరు .


కానీ రాముడు చేస్తాడు అనే  విషయము ఇక్కడ అందజేసారు .

తం యేవం గుణసంపన్నం రామం సత్య పరాక్రమం

రామాయణం - బాల కాండ 


         సర్గ - 1 

నారద ఉవాచ : 19 


ధనదేనా సమః త్యాగే సత్యే ధర్మే ఇవ అపరః


తం యేవం గుణసంపన్నం రామం  సత్య పరాక్రమం 
సమః ధనదేనా - ధనమిచ్చువాడితో సమానుడు -కుబేరుడు అంతటి వాడు ;


అపర త్యాగ , సత్య , ధర్మాత్ముడు .


అంతటి గుణ సంపన్నులు మీరే  రామా ... సత్య పరాక్రమా.


మొట్ట మొదటి సారిగా  రామా ....సత్య పరాక్రమా అని  డైరెక్ట్ గా ప్రస్తావన చేశారు.విష్ణుణా సద్రుసే వీర్యే సోమవాన్ ప్రియదర్శనః

రామాయణం - బాల కాండ 


         సర్గ - 1 నారద ఉవాచ : 18 


విష్ణుణా సద్రుసే వీర్యే  సోమవాన్  ప్రియదర్శనః 


కాల ఆగ్నెసద్రుసః క్రోదే  క్షమయ పృథ్వి సమః 
విష్ణువు ; అగ్ని ; చంద్రుడు ; పృథ్వి ;
వీర్యము ; క్రోధం ; శాంతం ; క్షమా ;


శౌర్యము - vs - శాంతము ; క్రోధం - vs - క్షమా ;


విష్ణువు లాంటి వాడు శౌర్యములో , చంద్రుని లాంటి వాడు శాంతములో చక్కగా కనిపించటానికి .
కోపంలో కాలాగ్ని లాటి వాడు ; క్షమా గుణములో భూమాత తో సరి .

స చ సర్వ గునోపేతః కౌసల్య ఆనంద వర్ధనః

రామాయణం - బాల కాండ 


            సర్గ - 1 

నారద ఉవాచ :  17 


స చ సర్వ గునోపేతః కౌసల్య ఆనంద వర్ధనః 


సముద్ర ఇవ గంభిర్యో ధైర్యణ  హిమవాన్ ఇవ 
గాంభిర్యంలో  సముద్ర మంతటి వాడు 
ధైర్యం లో  హిమవత్ పర్వతం లాంటి వాడు 


కౌసల్య ఆనందాన్ని పెంచే ఆ కుమారడు  అన్ని విధాల సర్వ గునసంపన్నుడు.


ఇక్కడ  పోలికలు చెప్పే విధము బట్టి 
ఆ కాలానికే  హిమాలయాలు అటు  వున్నటు అర్థం అవుతుంది .


ఇక్కడ చెప్పకనే చెప్పాడు రాముని తల్లి కౌసల్య అని .  • గాంభీర్యం  - సముద్రము ; ధైర్యము - హిమవత్ పర్వతాలు ;
  • ఒకటి అగాధము ; రెండవది అత్యున్నతము .
  • ధైర్యము పైకే కనిపించాలి 
  • గాంభీర్యం లోపల లోతుగా దాగి వుండాలి .
  •  ఇప్పటికి కూడా ఇవే విశేషణాలు వాడుతూ వున్నాము .