మంగళవారం, మార్చి 27, 2012

స చ సర్వ గునోపేతః కౌసల్య ఆనంద వర్ధనః

రామాయణం - బాల కాండ 


            సర్గ - 1 

నారద ఉవాచ :  17 


స చ సర్వ గునోపేతః కౌసల్య ఆనంద వర్ధనః 


సముద్ర ఇవ గంభిర్యో ధైర్యణ  హిమవాన్ ఇవ 
గాంభిర్యంలో  సముద్ర మంతటి వాడు 
ధైర్యం లో  హిమవత్ పర్వతం లాంటి వాడు 


కౌసల్య ఆనందాన్ని పెంచే ఆ కుమారడు  అన్ని విధాల సర్వ గునసంపన్నుడు.


ఇక్కడ  పోలికలు చెప్పే విధము బట్టి 
ఆ కాలానికే  హిమాలయాలు అటు  వున్నటు అర్థం అవుతుంది .


ఇక్కడ చెప్పకనే చెప్పాడు రాముని తల్లి కౌసల్య అని .  • గాంభీర్యం  - సముద్రము ; ధైర్యము - హిమవత్ పర్వతాలు ;
  • ఒకటి అగాధము ; రెండవది అత్యున్నతము .
  • ధైర్యము పైకే కనిపించాలి 
  • గాంభీర్యం లోపల లోతుగా దాగి వుండాలి .
  •  ఇప్పటికి కూడా ఇవే విశేషణాలు వాడుతూ వున్నాము .