శనివారం, మార్చి 24, 2012

మహేర్షకో మహేస్వాషో గూడ జత్రుః అరిందమః

రామాయణం - బాల కాండ 
            సర్గ - 1 

నారద ఉవాచ - 10 


మహేర్షకో మహేస్వాషో గూడ జత్రుః అరిందమః 


ఆజాను బాహుః సు శిరః సు లలాటః సు విక్రమః మహేర్షకో=  విశాలమైన వురము/రొమ్ము  కలవాడు ;
మహేస్వాషో = మహా విల్లంబులు కలవాడు ; దీర్గ శ్వాసలు కలవాడు / రోషగాడు ;
గూడ జత్రుః =  నున్నని  ఎముకలు కానని మెడ క్రింది భాగము ;
అరిందమః = శత్రువులను అణచిన వాడు ;

ఆజాను బాహుః = మోకాలివరకు గల పొడవైన చేతులు గలవాడు ;
సు శిరః = చక్కటి శిరస్సు ;
సు లలాటః = చక్కటి నుదురు ;
సు విక్రమః = మహా వీరుడు ;.


చక్కటి లలాటము , చక్కటి శిరస్సు , నున్నని మెడ క్రింది భాగం ,విశాలమైన రొమ్ము , అజనుభాహుడు ; 
దీర్గ శ్వాసలు గలవాడు .- ఇవి ఉత్తేజానికి గుర్తులు .
నిట్టూర్పులు  - నిరాశా జీవనానికి గుర్తు .


రాముడు ఇంకొంచము కనిపించాడు.