ఆదివారం, ఫిబ్రవరి 26, 2012

బ్రహ్మ చెప్పగా విన్న , మహర్షి నారద నోట వచ్చిన రామాయణము ....
బ్రహ్మ చెప్పగా విన్న , మహర్షి నారద నోట వచ్చిన రామాయణము .....
వశి- వున్నాడు . ఇక్ష్వాక వంశ ప్రభవో -ఇక్ష్వాక వంశములో పుట్టిన  
 జనహి శ్రుత -జనులు విన్న. నామ- నామము. రామో - రామ . 
 నిత్య ఆత్మవాన్ -నిత్యాత్ముడు . మహావీర్యవన్ -మహావీర్యుడు ద్యుతిమాన్ -ద్యుతిమంతుడు . ద్రితిమాన్ - ద్రితిమంతుడు . 

ఇక్కడ నారద మహర్షి చెప్పేదాన్ని బట్టి చూస్తె ఆయన రామున్ని చూసినట్లుగా లేదు .అందుకే శ్రుత - విన్న అనే పదము వాడినాడు. నారద మహర్షి రాముడిని చూడనే లేదు .

బ్రహ్మ లికితం సర్వమిదం అనే పెద్దల మాట తప్పు కాదు


నారద మహర్షి , ఈ బాలకాండ మొదటి సర్గలో తను బ్రహ్మ ద్వార తెలుసుకున్న సంక్షిప్త రామాయణము తెలియజేసాడు .ఈ కావ్యాన్ని వ్రాసే భాద్యత వాల్మీకి మహర్షిది అని గుర్తు చేస్తాడు .
బ్రహ్మ లికితం సర్వమిదం అనే పెద్దల మాట తప్పు కాదు అనేది .మనకు ఈ సర్గలో తెలుస్తుంది .

సోమవారం, ఫిబ్రవరి 20, 2012

ఈ పదహారు గుణగణాలు కల మానవుడు ఆ కాలములో ఎవరు ? ఈ పదహారు గుణగణాలు కల మానవుడు ఆ కాలములో ఎవరు ?
ఈ ఆరు శ్లోకాలలో పదహారు లక్షణాలను లెక్కించినాడు.
మొదటిది ......గుణవాన్ = బుద్దిమంతుడు .
రెండవది ........వీర్యవాన్ = పరాక్రమవంతుడు .
మూడవది ......ధర్మజ్ఞా    = ధర్మాని కలిగినవాడు .
నాల్గవది .........కృతజ్న  =  కృతజ్ఞత  కలిగినవాడు 
ఐదవది ..........సత్య వాక్య = సత్యమును పలికెడివాడు.
ఆరవది ...........ధృడ వ్రత = ధృడ చిత్తముకలవాడు .
ఏడవది ...........కిర్తివాన్    = కీర్తి కలిగినవాడు .
ఎనిమిదవది ....సర్వభూతేషు హితః  = సర్వ ప్రాణుల హితము కోరువాడు .
తొమ్మిదవది ....విద్యవాన్ = సకల శాస్త్రములను తెలిసినవాడు .
పదవది ...........సమర్థ     = అన్ని విషయాలలో సమర్థుడు .
పదకొండు .......ప్రియధర్సన్ = చక్కగా చూడాలనిపించేవాడు .  
పన్రెండు..........ఆత్మవాన్  = ధైర్యము కలిగినవాడు .
పదమూడు ....జితక్రోధ  = క్రోధాన్ని జయించినవాడు .
పదునాల్గు .....అనసూయక  = అసూయా లేనివాడు .
పదు నైదు .....ద్యుతిమాన్  = చక్కటి తెలివితేటలు కలవాడు .
పదు నారు......బిబ్యాతిదేవ  = దేవతలు కూడా భయ పడతారు .
ఈ పదహారు గుణగణాలు కల మానవుడు ఆ కాలములో ఎవరు ?

ఆదివారం, ఫిబ్రవరి 19, 2012

ఈ ౬ శ్లోకాలలో అంతా తెలుసుకోవాలని అనుకున్న మహా వ్యక్తీ యొక్క గుణ గణాలే.


చారిత్రేనకోయుక్త సర్వభుతేషుకో హిత 
విద్వాన్ , సమర్థ  ప్రియ దర్శనః 
.......... ఏవో విధం నరం .
ఇక్కడ మనిషి అనే పదము ఉపయోగించారు .
దైవ లక్షణాలు వున్నమహా పురుషుని గురించి తెలుసుకోవాలని కుతులముగా వున్నది అన్నాడు మన వాల్మీకి .ఈ ౬ శ్లోకాలలో అంతా తెలుసుకోవాలని అనుకున్న మహా వ్యక్తీ యొక్క గుణ గణాలే.

మన బాష లో చెప్పాలంటే లైవు టెలి కాస్ట్ ..?
మన నారద మహర్షి చెప్పిన కథ ఆ కాలములో జరగబోయ కథనా,జరుగుచున్న కథనా . మన బాష లో చెప్పాలంటే లైవు టెలి కాస్ట్ ..?
మన వాల్మీకి మహర్షి వ్రాసినది కూడా అలాంటిదేనా ......?
మహా భారతములో సంజయుడు కురు క్షేత్ర   యుధాన్ని లైవు టెలికాస్ట్ లో చూసినట్లు ద్రుత రాష్ట్రునికి చెప్పాడు .మరి ఈయన ఎవరికి చెప్పాడు ...?

మన నారదుడు వర్ణించిన వ్యక్తీ ఆ సమయములో జీవించివున్నాడు అనే అర్థం..?
ఈ శ్లోకములో వాడిన పదములు ....ప్రస్తుత మీలోకములో [అస్మిన్ సంప్రతం లోకే  ],సత్య వాక్యుడు ,ధృడ చిత్తుడు  వ్రతములా ఆచరించేవాడు   [సత్య వాక్యో ద్రిధ వ్రతహ ].
ఈ శ్లోకములో ఎక్కడ మానవుడు అనే పదము వాడలేదు .
ప్రస్తుతము అనే పదము ఆ వాల్టి దేశ కాలాన్ని తెలియచేస్తువున్నది .
ఈ లోకం అనే పదము బహుశా మానవలోకము అనే అర్థం తో వున్నది .
మన నారదుడు వర్ణించిన వ్యక్తీ ఆ సమయములో జీవించివున్నాడు అనే అర్థం..?

కాని అసలు ఈ ప్రశ్నమన వాల్మీకి రుషి కి ఎందుకు వచ్చింది ..........?


కాని అసలు ఈ ప్రశ్నమన వాల్మీకి రుషి కి ఎందుకు వచ్చింది ..........?
ఏమి ఆ విచారణ .....అంటే.... ఒక మహోత్కృష్ట మైన ,మహోన్నత గుణములు కలిగిన ,మహోన్నత మైన సత్య ,ధర్మ ,కీర్తి ,పరాక్రమములు కలిగిన గొప్ప సంపన్న మైన వ్యక్తి ఈలోకములో  ఎవరు అని |ఈ శ్లోకము కహ్ను అనే పదముతో మొదలుఅవుతుంది .
మూడు లోకాలను మన నారదుడు త్రిలోకసంచారి అనే పేరుతొ తిరుగుతాడు కావున దీనికి సరి అయిన సమాధానము ఆయన చెప్పగలడు అందులో ఎటువంటి సందేహములేదు . కాని అసలు ఈ ప్రశ్నమన వాల్మీకి రుషి కి ఎందుకు వచ్చింది ..........?

బాల కాండ - వాల్మీకి రామాయణంలో మొదటి ఘట్టానికి తెర తీస్తుంది


బాల కాండ - వాల్మీకి రామాయణంలో మొదటి ఘట్టానికి తెర తీస్తుంది .
బాల కాండ  - వాల్మీకి రామాయణంలో  మొదటి ఘట్టానికి తెర తీస్తుంది .
ఈ కావ్యాన్ని వ్రాసిన ఆ మహనీయుడు ఎలాంటి వారో ..... ఈ కథను అందజేసిన ఆ నారద మహర్షి ఎలాంటి వారో ... అనేదే చాల చక్కగ చక్కని శ్లోకాలలో చెప్పినారు . తపః అనే పదముతో మొదటి శ్లోకము మొదలు అవుతుంది . అసలు ఈ బాల కాండ , ఉత్తర కాండ తరువాత చేర్చబడినవి అనే  ఉవాచ .మన నారదుడు నిరంతరము మనసా,కర్మణ,వాచా సత్యాన్వేషణలో [భగవంతుడు ] వుంటాడు .అటువంటి ఆ మహామునిపున్గవుని,మన వాల్మీకి ఒక మహత్తర మైన ప్రశ్నతో విచారణ మొదలుపెడతడు .

ఆదివారం, ఫిబ్రవరి 12, 2012

కథ దేవర్షిది, స్క్రీన్ ప్లే వాల్మీకి మహరిషిది....?

దేవమహర్షి నారద ముని తో ఈ వాల్మీకి రామాయణ మహా ప్రస్థానం మొదలవుతుంది .నిరంతరం తప్పసులో మునిగివున్న మునిపున్గవుడు ఐన వాల్మీకి మహర్షి  యొక్క సందేహానికి సమాధానముగా ఈ జగతి లో అత్యంత మహనీయ మహిమాన్వితుడు ఐన పురుషుడు ఎవరు అనగా ? లభించిన సమాధానమే ఈ శ్రీరామచంద్రుడు .
మన మాటలలో చెప్పాలంటే కథ దేవర్షిది, స్క్రీన్ ప్లే వాల్మీకి మహరిషిది....?       

ఆ రహస్య మేమిటో తెలియజేసేదే వాల్మీకి రామాయణము .

రామాయణం = రామ[రాముడు ] +ఆయనము [ప్రయాణము ]=రాముని యొక్క[ జీవన ] ప్రయాణము .
శ్రీరామచందుని యొక్క జీవన ప్రయాణము ఎప్పుడు ఎలా మొదలైనది ,ఎక్కడికి ఎలా సాగినది , ఎందుకోసము,ఎవరికోసము , ఏ ఉద్దేశముతో ఈ ప్రయాణం సాగినదో , ఏ ప్రమాణాలను స్థాపించినదో ,ఆ రహస్య మేమిటో తెలియజేసేదే వాల్మీకి రామాయణము . 

భార్గవరామ సకలజన రాక్షకధమ

రామ ముగ్ధమనోహర్ శ్యామ 
ఇందీవర గుణధామ శ్రీరామ
రఘుకులనందకామ సీతారామ 
భార్గవరామ సకలజన రాక్షకధమ 

  

వాల్మీకి రామాయణ

వాల్మీకి రామాయణ ఓం భూర్భువస్వః   
తత్సవితుర్వరేణ్యం 
భర్గో దేవస్య ధీమహి  
ధియోయోనః ప్రచోదయాత్