మంగళవారం, మార్చి 31, 2015

కోటి కిరణాల


బద్దకంగా ఉన్న 
ఒళ్ళు విరుచుకొని 
ఎగిరింది గువ్వ నింగికి 
రెక్కలల్లార్చుకొంటూ రివ్వున 
భళ్ళున తెల్లారే తూర్పు దిక్కు 
కోటి కిరణాల కొంగ్రొత్త వెలుగులతో
సోమవారం, మార్చి 30, 2015

అగ్ని సంస్కారం

 

 

అగ్ని కీలలలో 

భగభగమని  మండేది 

శరీరం లోని సకల కల్మషాలు

అగ్ని పాయలలో 

భుగభుగమని ఎగసి పడేది 

శరీరాన్ని ఆశ్రయించు కొన్న బంధనాలు  

అగ్ని సంస్కారంతోనే  ఆత్మ ఆవిష్కృతం అవుతుంది  

మౌన సంస్కారం తోనే అంతరాత్మ గోచరం అవుతుంది

ఆదివారం, మార్చి 29, 2015

చిన్నారి కామేశ్వరి

అందరిని 
పలకరిస్తా ఆప్యాయంగా 
అందుకో ఏమో 
రాచకురుపు నన్ను వదలిపోలేదు 
తలుపు దాటి రాలేక   - ఎన్ని ఏళ్ళు గడిచినో 
అందుకో ఏమో 
పరమాత్ముడే వచ్చి స్వర్గలోకపు తలుపులు తెరిచాడు
( మా చిన్నారి  కామేశ్వరి ఈ లోకం నుంచి సెలవు తీసుకుంది )

రా ! నేస్తం ! రా !!

 

రా ! 

నేస్తం ! రా !!

తల్లిలా లాలిస్తా 

తండ్రిలా పాలిస్తా 

కంటిరెప్పలా కాచుకుంట 

అన్ని భాదలను తొలగిస్తా 

అన్ని భవబంధనాలు విడిపిస్తా 

 రా ! 

నేస్తం ! రా !!

అందుకో నా స్నేహ హస్తం - ఇదే నీకు అభయ హస్తంశనివారం, మార్చి 28, 2015

కన్నుల పంట

మాంగల్యానికి 

అర్థం సీతమ్మ అయితే

కళ్యాణాలకు ఆదర్శం  

సీతారాముల కళ్యాణమే 

ఎన్ని కష్ట నష్టలోచ్చినా 

భార్యాభర్తల బంధం విడదీయరానిది   

సీతమ్మ కష్టాలు స్త్రీ  జాతిని విడవకున్నా 

సీతారాముల జంటే ఇప్పటికి కన్నుల పంట


రామా రావయ్యా మా ఒంటిమిట్టకు


 

రామా 

రావయ్యా

మా ఒంటిమిట్టకు 

మా ఆనంద భాష్పాలు తప్ప 

గోదావరి లేదు నీ కాళ్ళు కడుగ 

మా హృదయ పీటం తప్ప

భద్రాది లేడు నీకు పీట వేయ 

చిరు కానుకలు తప్ప 

చింతాకు పతకం తేలేము 

నీ నామా  సంకీర్తన తప్ప

రామదాసు నగలు చేయించలేము

 ఈ ఒంటి మిట్టనే నీ పంచవటి అనుకోని 

మా హృదయ రాజ్యాన్ని నీ మహాసామ్రాజ్యం అనుకోని

 రామా 

రావయ్యా

మా ఒంటిమిట్టకు 

మీకు మీ కుటుంబానికి  శ్రీ రామ నవమి శుభాకాంక్షలు


శుక్రవారం, మార్చి 27, 2015

శ్రీ రామ నామం

 

ఏమయ్య ! రామా 
ఏమి చేసితివి నీవు
రాళ్లు అన్నీలేచి లేపే వారధిని !!

ఏమయ్య ! రామా 
ఏమి చేసితివి నీవు 
కోతి మూకలకు కొండంత బలమొచ్చే !!
శ్రీ రామ నామం ఆశ్రిత పారిజాతం  సిరి సంపదలనిచ్చి కాపాడుగాక !!

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు


గురువారం, మార్చి 26, 2015

ఏ కష్టం కష్టం కాదని

 

 

 

 

 

 

 

 

 

నా జీవితం 

వడ్డించిన విస్తరి కాదు 

జీవన గమనంలో

ఎత్తుపల్లాలు - ఒడిదుడుకులు సహజం !

అయితే ! 

ఒకటి మాత్రం నిజం ! 

కూర్చొని తింటే 

కొండలూ  కరుగుతాయని 

గుండె నిబ్బరం గల వానికి

రెక్కల కష్టాన్నినమ్మిన వానికి ఏ కష్టం కష్టం కాదని !!

వృత్తి , ప్రవృతి ఏవైనా ఆచార వ్యవహారాలు విడరాదు అని నమ్మేవాడిని !!

( గౌరవనీయులు A . లక్ష్మణ రావు గారు సెలవు తీసుకున్నారు )

మంగళవారం, మార్చి 24, 2015దేవుడంటే 

నాకేం పెద్దగా ప్రేమ లేదు 

అలాగని నేను నాస్తికుడుని కాను 

మానవత్వాన్ని అమితంగా ప్రేమిస్తాను అంతే  !

నేనేమి 

పెద్ద వేదాంతిని కాను 

అయితే అర్థాలు వెతుకుతూ

జరిగినదానికి - జరుగుతున్నదానికి 

అర్థాలోచనలో పడి వేదాంతం మాట్లాడను 

వాస్తవాన్ని గమనిస్తాను , గ్రహిస్తాను -శ్వాసిస్తానుఅంతే !

పరలోకపు పారమార్థ్యం కన్నా 

ఈ లోకపు పరమార్థాలు మిన్న అని నమ్మే  సాధారణ  రైతును  

(గౌరవనీయులు సుబ్బా రావు గారు సెలవు తీసుకున్నారు  )

శనివారం, మార్చి 21, 2015

పంచాంగ శ్రవణం

Image result for పంచాంగ శ్రవణం

ఉగాది 

కొత్త రుచుల మేలుకలయికలు 

క్రొంగొత్త కోరికల మేలు కొలుపులు

లాభ నష్టాల - కష్ట సుఖాల లెక్కల మధ్య 

ఎంతో గొప్ప దూర దృష్టి - ఈ  పంచాంగ శ్రవణం


శుక్రవారం, మార్చి 20, 2015

మన్మధనామ వత్సరం

 

మన్మధనామ వత్సరం 

యౌవ్వన శోభ సంబరం 

పచ్చని తోరణాల స్వాగత గీతాలు

కమ్మని కోకిల కుహు కుహు రావాలు 

నిత్య జీవన సత్యప్రమాణాల  ఉగాది పచ్చళ్ళు 

 పంచాంగ శ్రవణ గుణింతాల  జీవన గమన సూచికలు 

మీకు

మీ కుటుంబ సభ్యులకు 

ఇవే   మా  యుగాది శుభాకాంక్షలు 


సోమవారం, మార్చి 16, 2015

నీవు జీవుడవు - నేను దేవుడను

 

 

నేను నీవు ఒకటే కాదా 

ఇద్దరిది నల్లని నలుపు 

ఇద్దరికీ ఉన్నాయి చక్కని రెక్కలు !!

అయినా ......................

నీవు కూస్తే పంచమ స్వరాలు 

నేను కూస్తే కర్ణకటోర "కా కా కా కా" శబ్దాలు !!

నీవూ నీను ఒకటే కాదు 

నీవు దేహనివి  - నేను ప్రాణాన్ని !!

నీవు జీవుడవు  -  నేను దేవుడను !!

తనని గానని వాడు నిన్నేటుల గాంచును ! హరి !!

 

హరి !


నీవున్నావా ?

అంటే .................... !

నీలోనే వున్నానని 

పక్కున నవ్వేవు ! హరి !!

 

అంతట తానై 

తానే అంతట కొలువై 

ప్రాణ దివ్వెలు వెలిగించేవు ! హరి !!

తనని గానని వాడు, గాంచును నిన్నేటుల ! హరి !!


శుక్రవారం, మార్చి 13, 2015

మంధరగిరి చెలగితివే ! హరి !!


మోపిమోపక 

మూపున మోపి 

మంధరగిరి  చెలగితివే ! హరి !!

కొలిచితివే బ్రహ్మాండంబు ! హరి !!

 

అడగకనడిగి 

మూడడుగుల మడి 

కొలిచితివే బ్రహ్మాండంబు ! హరి !!

నఖశిఖముల చీల్చి

గృచ్చక గృచ్చి

నఖశిఖముల చీల్చి 

అరి భంజనము గావించితివే ! హరి !!

 

మంగళవారం, మార్చి 10, 2015

ఊహల ఊయలలు

 File:Raja Ravi Varma, Mohini (Oleograph).jpg

గుండె 

గొంతుకలోని 

గుసగుసలు విన్నావా

సన్నజాజిపూల రుసరుసలు కన్నావా

ఊహల ఊయలలు ఊగే

నల్లని కురుల కులుకు హోయలుల చూసి


ఎర్ర మందారలై పూచినాయి

 

చెలి  !

ఇంకా 

రాడేమి

నా నెలరేడు!!

నింగినేలు రాజు

నేల జారుతున్నాడు

చుక్కలన్నీచట్టుక్కున మాయమౌతున్నాయి

కంటి కాటుకలా

చుట్టూఉన్నచీకటి మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంది 

ఎదురు చూసిన కన్నుల 

వేకువ జాము ఎరుపు జీరలు పరుచుకుంటున్నాయి 

చెలి  !

ఇంకా 

రాడేమి

నా నెలరేడు!!

సోమవారం, మార్చి 09, 2015

సూర్యోదయకిరణాన్ని

Image result for most beautiful sunrise - free wallpapers

అంతరిక్షంలోని 

అంతులేని చీకటిని నేను

ఆకాశంలోని 

అనంత శ్వాసను నేను 

పృథ్వి పై పరుచుకున్న పచ్చికను నేను 

ఆశల ఉషస్సులు రేపే సూర్యోదయకిరణాన్ని నేను 

నేనెక్కడికి పోలేదు ప్రతినిత్యం మిమ్ముల పలకరిస్తాను  

ఆకాశంలో మేఘంలా

నేస్తం !

జారుకున్నావా 

జ్ఞాపకాల లోకంలోకి !!

ఆకాశంలో  మేఘంలా అనంతంలో  కలిసిపోయావా !!


శనివారం, మార్చి 07, 2015

శుక్రవారం, మార్చి 06, 2015

అంతరంగం

 

అంతరంగం 

పెద్ద రంగస్తలమ్ము 

భిన్న విభిన్న భావజాలా తోరణము 

దర్శించుకో  చాలు  ధన్యమౌను జన్మ


కోడె బసవన్న

 

విక్టరి కిక్కు 

వివరింప తరమా 

విశ్వవిజేతలై వెలుగు వేళ

కోడె బసవన్న కాల్  దువ్వి రంకేసినట్లు


ఉచ్చ్వాస నిచ్చ్స్వాస వాయులీనులు

Image result for flute with krishna

పెదవి 

అంచులు తాకి 

మురళి పులకించిపోయే

ఉచ్చ్వాస  నిచ్చ్స్వాస వాయులీనులు 

అంతః కర్ణం లో మ్రోగించే  సుమధుర గానాలు 

ప్రభు ! కృష్ణా ! కాలేకపోతి ఆ మురళిని నీ మోవిపైనుండ!!

గురువారం, మార్చి 05, 2015

నిత్య కర్షకుడను

 

జన్మ జన్మలనెరుగ

ముందేమిజరుగునో అసలే నెరుగ

నా గత తప్పుల సవరించి కోనసాగాటం తప్ప !

నేనొక  జీవిత బాటసారిని

బ్రతుకు బాటను పండిచుకొనే నిత్య కర్షకుడను !!


ఎటువైపో నీ గమ్యం

 

 

నేను ఎవరు ?

అనే మీ మాంస - ముందు మాను!!

నేను నేనే - నీవు నీవే !

చిన్న విషయాల పట్ల - చింత మాను!!

ఎటువైపో నీ గమ్యం ఎంచుకొని - అటు వైపు సాగిపో !!


అద్దం ముందు

 

వస్తాయీ - పోతాయి

తోకచుక్కల లాంటి ఆలోచనలు 

నిర్మలమైన ఆకాశంలా - ప్రకాశించనీ ఈ మనసును 

అద్దం ముందు తెలుస్తుంది - నీ పూర్తి అస్తిత్వం ఏమిటో


బుధవారం, మార్చి 04, 2015

వెన్నెల్లో జలపాతం

 
ఓ చందమామా !
వెన్నెల్లో జలపాతం 
చల్లగా చల చల్లగానవ్వుతుంది - నీ నీడను చూసి !!
కొత్త పెళ్లి కూతురిలా పమిట పరదాల చాటు మాటునా !!

మంగళవారం, మార్చి 03, 2015

పూల తోటల వదలి

Image result for పూల తోటల వదలి

గాలి లాంటి మనసా !

వూరికే అలా గాలికి తిరుగకే - పూల తోటల వదలి !

దుర్ఘందల సహవాసాలతో నీవు దుర్ఘంధమైపోతావు - చివరికి !!

సోమవారం, మార్చి 02, 2015

విడమరిచి చూడాలి అర్థాలు - విరిచి కాదు

 

శిష్ట సంరక్షణ 

దుష్ట సంహారణ 

శ్రీమద్ రామాయణం !

మంచి చెడుల 

మధ్య ఘర్షణ మహా భారతం !!

విడమరిచి చూడాలి అర్థాలు - విరిచి కాదు !!


దేవుడిని నిందిచడం తప్పు

 

ఎందుకు ద్వేషం!

ఎవరిపై ఈ రోషం !!

మన మధ్య ఒప్పదం ఏమిలేనప్పుడు !

జరిగిన దానికి  - జరిగేదానికి 

నన్ను(దేవుడిని )నిందిచడం తప్పుకదా !!

ఆదివారం, మార్చి 01, 2015

కుహనా నాస్తికుడినై

 

Image result for no god free wallpapers

 హే భగవాన్ !

నాకు...

నీవంటూ ... 

వేరే ఎవరు లేరని 

నాలో వున్న శక్తి నీవే అని ఎవరు చెప్పాలి

నిన్ను నేను తిట్టుకుంటూ-నన్ను నేను తిట్టుకుంటూ

వృధాగా కాలం గడుపుతున్నా- కుహనా నాస్తికుడినైమీరిద్దరు సమానమే


 

అందుకే అంటాను !

దేవుడి ముందు అందరు సమానమే అని !!

గుడి లోపల నీవూ

గుడి మెట్ల పై వాడూ 

పెద్దా, చిన్నా , కోరికలు తప్ప - మీరిద్దరు  సమానమే


నిరంతర బిక్షకుడిని

 

హే ! ప్రభు!! 

జోలే పట్టి అడగడం తప్ప 

ఏమి అమర్చలేను పూల కొమ్మల్లా 

తీసుకోవడం తప్ప 

ఏమి ఇచ్చుకోలేని  నిరంతర బిక్షకుడిని 

స్వార్థమే తప్ప , స్వాంతన యెరుగని మనసు 

పరి పరి విధముల పరుగులు తీస్తుంది ఈ మనసు  


పరమాత్ముని వదలి

 Image result for పరమాత్ముని వదలి

మనసా 

పరి పరి విధముల పరుగులు తీయకే 

పావన కారుడు - పరమ యోగ విభుడు - పరమాత్ముని వదలి