ఆదివారం, మార్చి 25, 2012

రక్షిత జీవలోకస్య ధర్మస్య పరి రక్షిత = ఎవరి ధర్మము; అసలు ధర్మము అంటే ఏమిటి ?

రామాయణం - బాల కాండ 
          సర్గ - 1
నారద ఉవాచ : 13


ప్రజాపతి సమః  శ్రీమాన్ ధాత రిపు నిషుదనః 


రక్షిత జీవలోకస్య ధర్మస్య పరి రక్షిత 
ప్రజాపతి - బ్రహ్మ ; సమః = సమాన మైన వాడు ;


శ్రీమాన్ ధాత  - ఈ జగతికి ఆధార భూతుడు ; జగతికంత ఆధారం ;


 రిపు నిషు దనః = శత్రు సంహారకుడు ; శార్తువుల నిర్ములించినవాడు ;


జీవ లోకస్య - ఈ ప్రపంచాన్ని ;


ధర్మస్య - ధర్మాన్ని ;


రక్షిత , పరి రక్షిత  - రక్షించేవాడు , పోషించువాడు /పాలించువాడు ;
ఈ ప్రపంచానికి ఆధార భూత మైన వాడు , బ్రహ్మ తో సమానుడు , శత్రువుల నిర్ములించిన వాడు , ధర్మాన్ని , జీవలోకాన్ని పాలించి/పోషించి  రక్షించే వాడు .
ఎవరు -- రాముడు .


ఒక తండ్రి , తల్లి మాత్రమే పోషించి పాలించి రక్షించేది  అది తను కన్నప్రాణులను మాత్రమే .


ఈ తండ్రి ఈ సమస్త జీవలోకాన్నే కాదు , ధర్మాన్ని కూడా  రక్షిస్తాడు , పరి రక్షిస్తాడు ;


ఎవరి ధర్మము; అసలు ధర్మము అంటే  ఏమిటి ?

 ఇది ఒక బాలన్సు / ఒక త్రాసు / ఒక కొలమానము ;

ఎందుకు బాలన్సు అవసరము  
ఈ శ్రుష్టి లో అన్ని తిరుగుతూ వుంటాయి ,
 మన మనసు , ఆలోచనలు కూడా అలాగే తిరుగుతూ వుంటాయి 
ఈ పరిభ్రమించే విషయములో  
ఎక్కడో  ఒక చోట , ఎప్పుడో  ఒకప్పుడు ఎదురు పడక మానవు ,
 మన ఆలోచలు అంతే 
ఎదురు పడటం అంటే  విభేదించటం  / డాష్  - వినాశనం ;
రెండు గ్రహాలు విభేదిస్తే  అందులో ఒకటి మన భూమి అనుకో ... 
అంతా ఇక హుష్ కాకి .
అందులో ఒక గ్రహం సూర్యుడు అనుకో  అంతా అంధకారం / నిర్జీవము .వీటిని అన్నింటిని  ఒక క్రమములో / ఒకొక్క కక్ష్యలో / నిర్దేస్తిత కాలంలో  , తత్వ గుణాలతో  ఒకొక్క గ్రహం  పరిభ్రమించేతట్లు నిలిపాడు . అన్నింటిని 
పాలించు కుంటూ / పోషించుకుంటూ , రక్షించేవాడు  వాడె .


అదే సూత్రం జీవ లోకాన్ని అందులోని జీవ జాలపు ఆలోచనలు , తత్వాలు ఒకదానికి ఇంకొకటి విభేదించకుండా కొన్ని ప్రాధమిక  సూత్రాలు అంటే  గ్రహాలకు కక్ష్యలు , గ్రహ  తత్వాలు , కాలమానము వుంటే 
జీవ జాలానికి పుట్టుక , పోషణ ,మరణం , జాతి , విజాతి , ప్రజాతి , జాతి ఉపజాతులు  వుంటాయి .
వాటి అవసరానికి కొన్ని ప్రాధమిక  లక్షణాలు ప్రకృతి  పరంగా వస్తాయి 
ఆ లక్షణమే బాలన్సు అంటే  దానిని పెంచి పోషించి కాపాడాలి  లేక పోతే 
అవి వికృత వేషాలతో ముఖ్యంగా మనుషలలో బయటకు వస్తాయి 
రాక్షస గుణాలు అవుతాయి .


ఆ బ్యాలన్సును కాపాడటమే ధర్మ రక్షణ .


ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శ్రుష్ట్టిని సక్రమముగా/బ్యాలన్సుగా  నడిపేదే  ధర్మము .