సోమవారం, మార్చి 26, 2012

సర్వదా ఆభిగాతః సద్భిహ్ సముద్ర ఇవ సిన్ధుభిహ్

రామాయణం - బాల కాండ 
        సర్గ - 1 నారద ఉవాచ - 16 


సర్వదా  ఆభిగాతః సద్భి:  సముద్ర ఇవ సిన్దుభి :


ఆర్యః సర్వసమః  చ ఎవ  సదైవ ప్రియ దర్శనః  
నీటి చుక్కలు ఎలా సముద్రము  లో  కలుస్తాయో 

అలాగే మంచి బుద్ది కలవారు ఎప్పుడైనా కూడా ఆయనను కలుసుకోవచ్చు .


ఆ మహాను భావునికీ  ఎప్పుడైనా అందరు సర్వసమానమే. అందరికి ఆయన ప్రియదర్శనుడే.


ఇక్కడ ఒక పక్క సముద్రము , ఇంకొక పక్క ప్రియదర్శన్ అంటారు .


సముద్రాన్ని చూసి కలలు కననివారెవరు.
సముద్రాన్ని చూడాలని వువిళ్లు ఊరని వారెవరు .


నీటి చుక్కల్ల  బిల బిల జనాలు చేరతారు , ఆడతారు పాడుతారు కేరింతలు కొడతారు పెద్ద చిన్న లేదు . ఆ సంతోషం చెప్పలేమండి .


అదిగో అలాంటి సంతోషము మన రాముడిని చూస్తే మనకు వస్తుంది దానినే ప్రియదర్శనః అంటారు  . అదే ప్రియదర్శనం .


మనమంతా ఎలా సముద్రానికి సమానమో అలా అందరు రామునికి సమానము .


సముద్రపు రంగు గ్లాస్సిగ  మెరుస్తుంది , రాముడు అలానే మెరుస్తాడు .


మన రాముడు  ఆ సముద్రుని కన్నా  గొప్పవాడు . రాముని స్పర్శవల్లె ఆ సముద్రానికి అంత తేజస్సు వచ్చింది .