శుక్రవారం, మార్చి 23, 2012

ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైహి శ్రుతః = ఈ రామాయణం ఒక ప్రయోగ శాల .

 రామాయణం - బాల కాండ 


          సర్గ - 1 
నారద ఉవాచ :-


                    8
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైహి  శ్రుతః 


నియత ఆత్మా మహావిర్యో దుతిమాన్ ద్రుతిమాన్ వసి.


ఇక్ష్వాకు వంశ ప్రభవో = ఇక్ష్వాకు వంశము నుంచి వుద్ద్భ వించిన  / పేరుగాంచిన ;


రామో నామా జనైహి  = రాముడు అనే పేరుతొ జన్మించాడు ;


శ్రుతః = విను ;


నియత ఆత్మా = మనసు పై ఆధీనము గలవాడు/ఆత్మనిగ్రహము కలవాడు  ;


మహావిర్యో = గొప్ప వీరుడు ;


దుతిమాన్ = గడ గడ లాడిన్చువాడు;


ద్రుతిమాన్ = ధైర్యవంతుడు ;


వసి =  మిక్కిలిగా ;
ఇక్ష్వాక వంశములో ప్రభవించిన / ఉదయించిన  మిక్కిలిగా ఆత్మ నిగ్రహం కలవాడు , మహా వీరుడు , దైర్యవంతుడు , గడ గడ లాడించేవాడు రాముడు  అనే పేరుతొ జన్మించాడు . ఇక్కడ జనైహి శ్రుతః అంటే  జన్మించాడు , విను అని ఒకరకంగా , జనైహి - జనులు / ప్రజలు , శ్రుతః అంటే విన్నారు అని . రాముడు పుట్టినాడు అని ఒక అర్థం , రాముడు అనే పేరు జనులు విన్నారు అనే అర్థం వస్తుంది .రాముడు జనులలో కలిసిపోతాడు కాబట్టి రాముడుని చూస్తారు , వినటం వుండదు . మరి మీరు ఏమంటారో ?


 • జనైహి = అనే పదము ద్వార నారద మహర్షి మనకు తెలియజేసింది - 
 • ఆవాలిటికి రాముడు వున్నాడు ... అని .
 • రామ శబ్దము మొదటి సరిగా వినపడుతుంది .
 • రాముడు ఎలా వున్నాడు అనేది కనబడుతుంది .
 • ఆవాల్టికి రాముడు బాల రాముడు కాదు .
 • ఆత్మనిగ్రహము తెలిసినవాడు 
 • మహావీరుడు 
 • ధైర్యవంతుడు 
 • గడ గడ లాడించేవాడు -
 • అప్పటికే శత్రువులను మట్టి కరిపించి వుండాలి అంటే 
 •  రాముడు యుక్త వయస్కుడు 
 • అనే విషయము చెప్పకనే నారద మహర్షి మనకు చెప్పాడు . 
ఎలా పరిచయం చేయాలి ......

మొదట వంశం 
రెండు పేరు 
మూడు మానసిక శక్తీ 
నాలుగు శారీరక శక్తీ 

ఇప్పుడు ఇకాలంలో పరిచయానికి 

క్యారెక్టర్  / వంశం 
నేమ్ / పేరు 
కండక్ట్ / మానసిక శక్తీ 
ఎడ్యుకేషన్ అండ్ అదర్స్  / శారీరక శక్తి .

ఈ కాలములో  క్యారెక్టర్  , కండక్ట్ అనేవి  కేవలం కాగితాల వరకే పరిమితం .
మన వ్యవస్థ నిర్వీర్యము కావటానికి మన సంస్కృతి బలహీన పడటానికి ఇది ఒక బలమైన కారణమూ ......


సమాజము లో ....... 
తల్లి తండ్రులు ఈ బాధ్యత తీసుకోవాలి .
ఆ తరువాత గురువులు . • ఎవరు అనే ప్రశ్నకు ........
 • రామా అనే సమాధానము వచ్చింది .
 • యెవరీ  రామ   - నియత ఆత్మా  
 • నియత  = నియంత్రణ / సక్రమములో పెట్టువాడు / లీడర్ షిప్ / గుణము / వన్ క్వాలిటీ .
 • ఆత్మ = బుద్ధి / మనసు / ఆలోచన / స్టేటస్ /ఒక స్థితి /పరమాత్మ 

 • ఆత్మానాం  బుద్ధి మతి - కార్యానాం   గుణ మతి .

 • నియత / నియంత్రణ  - అంటే చైతన్యం గలది - అగ్ని లాంటిది . అగ్ని ఎప్పుడు  జ్వలిస్తుంది - అదే చైతన్యం .
 • ఈ "ర "/" రా " అనే పదము దానికి గుర్తు .
 • ఆత్మ /మనసు/పరమాత్మ .
 •  ఈ " మ "/"మా" అనే పదము దానికి గుర్తు .
 • ఈ రెండు పదాల కలయికే  " రామ " అనే పేరు .
 • నిత్యమూ జ్వలించే ఆత్మా కలవాడు /
 •  నిత్య చైతన్య దీపిక / 
 • నిర్మల నిర్వికార నిరంజన స్వభావుడు  - 
 • అగ్ని లోపల నీలంగా వుంటుంది అది చాల నిర్మలంగా పారదర్శకంగా వుంటుంది .
 • నీల తో ఎత్ మధ్యస్త విద్యులేకేన భాస్కర 
 • అగ్ని జ్వాల ఒక  శంఖ  ఆకారములో వుంటుంది , ఎల్లప్పుడు కదులుతూనే వుంటుంది - 
 • ప్రకాశిస్తూనే వుంటుంది అది లేక పోతే అంత చీకటే ....ఎవరు ...ఇంకా ఎవరు ఆ దేవ దేవుడే .
ఈ అగ్ని జ్వాలను నియంత్రించాలి లేకపోతే అది పెను జ్వాల అవుతుంది . పెను జ్వాల తననే కబలిస్తుంది .
రామాయణము మనలను మనము ఎలా మలుచుకోవాలి అనేదే చూపుతుంది . మన లోని అగ్ని ని ఎలా నియంత్రించుకోవాలో చేసి చూపిస్తుంది  అంటే ప్రాక్టికాల్ ఎక్ష్పెరిమెన్త ; 


ఈ రామాయణం ఒక ప్రయోగ శాల .