సోమవారం, అక్టోబర్ 21, 2013

రాజకీయం కానే కాదు

యెందుకు ఈ డ్రామాలు

ఎవరి కంటి నీళ్ళు తుడిచేదానికి

యెందుకు ఈ అనవసర ప్రసంగాలు

పడుకున్న పాముల పడగలను రేపటం ఎందుకు

మనసులతో ఆట రాక్షసత్వం - అది రాజకీయం కానే కాదు 

శనివారం, అక్టోబర్ 19, 2013

స్వాతంత్ర యోధుడినిమృత్యువు  సహజం

అలా అని అవనత శిరస్సుతో

జీవించే కన్నా ఆ మృత్యువునే

ఆహ్వానిస్తాను  సంతోషంగా  - నేను స్వాతంత్ర యోధుడిని 

శుక్రవారం, అక్టోబర్ 18, 2013

బుధవారం, అక్టోబర్ 16, 2013

దిష్టి బొమ్మ


బాగుందయ్యా

మరి చోద్యం కాకపోతే

అమ్మ దిష్టి బొమ్మ తగుల బెట్టారని

బాబు దిష్టి  బొమ్మ తగుల బెడతారా ఎక్కడన్నా

తగుల బెట్టుకోవడాలు మరీ ఏదో కొత్త అయినట్లు

అబ్బా ఉన్న దిష్టి  పోయింది అనుకోవాలి ఎప్పుడైనా

ఈ తగుల బెట్టుకోవడాలు  ఆఖరకు కొంపలకు అంటుకుంటాయి 

వారు - వీరు - నాయకులంతా బాగుంటారు - జనాలు చస్తారు మధ్యలో - తస్మాత్ జాగ్రత్త

ఓటరన్న

పిల్లల కోసం పడే పాట్లు 

అంతింత కాదయ అవలోకిస్తే 

పిట్ట మొదలు పెద్ద ఏనుగు వరకు 

పిల్లల బాగుకోసం బలే బలే తిప్పలు పడతాయి 

మరి మన రాజకీయనాయకులు రాష్ట్రాన్ని చీలిస్తే తప్పేమీ - ఓటరన్న 

సోమవారం, అక్టోబర్ 14, 2013

భయకర భీతిని సృష్టించారు
క్రమశిక్షణ తో ఎంతటి పెను ముప్పునైనా దాటవచ్చు

అని ఒక పక్క ఆంద్ర , ఒరిస్సా , కేంద్ర ప్రభుత్వాలు రుజువు చేస్తే

క్రమశిక్షణ  లేమితో  పెను  ముప్పును తామే కొని తెచ్చుకో వచ్చు

అని మరో పక్క మధ్య ప్రదేశ్ పోలీసులు , ప్రభుత్వం చక్కగా రుజువు చేశారు

109 మంది పైగా స్రీలు , పిల్లలను బలిగొన్న భయకర భీతిని సృష్టించారు 

ఆదివారం, అక్టోబర్ 13, 2013

నేర్చుకోవాలి అంటారు ఇదేనా

The MODIS instrument onboard NASA's Terra sate...

సముద్రమంతా ప్రశాంతత ఏమైంది

అగాధమైన నీ ఆలోచనలలో సుడులు రేపిందెవరు

వేడి గాలుల వెక్కిరింతలకే ఇంత అలజడులు రేపాలా

తుఫానై  జన జీవన స్రవంతిని  తుత్తునియలు  చేయాలా

ఏమైపోయింది నీ గంభీరం - నిన్ను చూసి నేర్చుకోవాలి అంటారు ఇదేనా 

తుఫాను
పై లిని  తుఫాను

గుబులు రేపినా

సుడులు తిరుగుతూ

దాటింది  తీరం చల్లగా

చీమల్ల దాచ్చుకున్న ఆస్తిని తన్నుకొని పోయింది ఎచ్చక్కా

పేదవాడి కడుపుకొట్టి ఏమి బావుకుంటుందో ఈ తుఫాను ఎప్పుడూ

సముద్రం ఉప్పు  చాలదని  పేదవాళ్ళ కన్నీళ్ళు తాగుతుంది  ఆశగా           

శనివారం, అక్టోబర్ 12, 2013

మహా నిధి భోధి వృక్షంలా

Paintings of Life of Gautama Buddha in Asalha Puja


నీ ఆలోచనలు

మంచి ముత్యాలై

కురుస్తున్నాయి  ఆకాశం నుండి

నీ కోరికలు

పచ్చని పచ్చిక మొలకలై

తలలు ఆడిస్తున్నాయి భూమి పొరలల నుండి

రేపటి ఆశల  నులివెచ్చని  గాలులు పిల్చుకొని  యెదుగు

మహా నిధి భోధి వృక్షంలా ..... ప్రసరించు జ్ఞాన జ్యోతులు ఈ ప్రపంచమంతా