సోమవారం, అక్టోబర్ 21, 2013

రాజకీయం కానే కాదు

యెందుకు ఈ డ్రామాలు

ఎవరి కంటి నీళ్ళు తుడిచేదానికి

యెందుకు ఈ అనవసర ప్రసంగాలు

పడుకున్న పాముల పడగలను రేపటం ఎందుకు

మనసులతో ఆట రాక్షసత్వం - అది రాజకీయం కానే కాదు 

శనివారం, అక్టోబర్ 19, 2013

స్వాతంత్ర యోధుడినిమృత్యువు  సహజం

అలా అని అవనత శిరస్సుతో

జీవించే కన్నా ఆ మృత్యువునే

ఆహ్వానిస్తాను  సంతోషంగా  - నేను స్వాతంత్ర యోధుడిని 

శుక్రవారం, అక్టోబర్ 18, 2013

బుధవారం, అక్టోబర్ 16, 2013

దిష్టి బొమ్మ


బాగుందయ్యా

మరి చోద్యం కాకపోతే

అమ్మ దిష్టి బొమ్మ తగుల బెట్టారని

బాబు దిష్టి  బొమ్మ తగుల బెడతారా ఎక్కడన్నా

తగుల బెట్టుకోవడాలు మరీ ఏదో కొత్త అయినట్లు

అబ్బా ఉన్న దిష్టి  పోయింది అనుకోవాలి ఎప్పుడైనా

ఈ తగుల బెట్టుకోవడాలు  ఆఖరకు కొంపలకు అంటుకుంటాయి 

వారు - వీరు - నాయకులంతా బాగుంటారు - జనాలు చస్తారు మధ్యలో - తస్మాత్ జాగ్రత్త

ఓటరన్న

పిల్లల కోసం పడే పాట్లు 

అంతింత కాదయ అవలోకిస్తే 

పిట్ట మొదలు పెద్ద ఏనుగు వరకు 

పిల్లల బాగుకోసం బలే బలే తిప్పలు పడతాయి 

మరి మన రాజకీయనాయకులు రాష్ట్రాన్ని చీలిస్తే తప్పేమీ - ఓటరన్న 

సోమవారం, అక్టోబర్ 14, 2013

భయకర భీతిని సృష్టించారు
క్రమశిక్షణ తో ఎంతటి పెను ముప్పునైనా దాటవచ్చు

అని ఒక పక్క ఆంద్ర , ఒరిస్సా , కేంద్ర ప్రభుత్వాలు రుజువు చేస్తే

క్రమశిక్షణ  లేమితో  పెను  ముప్పును తామే కొని తెచ్చుకో వచ్చు

అని మరో పక్క మధ్య ప్రదేశ్ పోలీసులు , ప్రభుత్వం చక్కగా రుజువు చేశారు

109 మంది పైగా స్రీలు , పిల్లలను బలిగొన్న భయకర భీతిని సృష్టించారు 

ఆదివారం, అక్టోబర్ 13, 2013

నేర్చుకోవాలి అంటారు ఇదేనా

The MODIS instrument onboard NASA's Terra sate...

సముద్రమంతా ప్రశాంతత ఏమైంది

అగాధమైన నీ ఆలోచనలలో సుడులు రేపిందెవరు

వేడి గాలుల వెక్కిరింతలకే ఇంత అలజడులు రేపాలా

తుఫానై  జన జీవన స్రవంతిని  తుత్తునియలు  చేయాలా

ఏమైపోయింది నీ గంభీరం - నిన్ను చూసి నేర్చుకోవాలి అంటారు ఇదేనా 

తుఫాను
పై లిని  తుఫాను

గుబులు రేపినా

సుడులు తిరుగుతూ

దాటింది  తీరం చల్లగా

చీమల్ల దాచ్చుకున్న ఆస్తిని తన్నుకొని పోయింది ఎచ్చక్కా

పేదవాడి కడుపుకొట్టి ఏమి బావుకుంటుందో ఈ తుఫాను ఎప్పుడూ

సముద్రం ఉప్పు  చాలదని  పేదవాళ్ళ కన్నీళ్ళు తాగుతుంది  ఆశగా           

శనివారం, అక్టోబర్ 12, 2013

మహా నిధి భోధి వృక్షంలా

Paintings of Life of Gautama Buddha in Asalha Puja


నీ ఆలోచనలు

మంచి ముత్యాలై

కురుస్తున్నాయి  ఆకాశం నుండి

నీ కోరికలు

పచ్చని పచ్చిక మొలకలై

తలలు ఆడిస్తున్నాయి భూమి పొరలల నుండి

రేపటి ఆశల  నులివెచ్చని  గాలులు పిల్చుకొని  యెదుగు

మహా నిధి భోధి వృక్షంలా ..... ప్రసరించు జ్ఞాన జ్యోతులు ఈ ప్రపంచమంతా 

సోమవారం, సెప్టెంబర్ 30, 2013

విరహవేదనవిరహాన్ని గూర్చి
ఆ చందమామ ను అడగకకు
ఎప్పుడు పక్కన ఉండే చుక్కలు పగలబడి నవ్వుతాయి

నీల్గుతూ పోయే
ఆ సూర్యుడుని అడగడకకు
ఎవరైనా వింటే నవ్వి పోగలరు
ఉభయ సంధ్యలతో సయ్యాట లాడుతూ ఉంటాడు

ఆ పరుగులెత్తే  నది ని
అస్సలు పలకరించకు
పాపం కడలి ఒడిలో కలిసి పోవాలని ఉరకలేస్తుంది
ఈ కొండలు కోనలు
మనకు నిజం చెప్పవు
ఆ  రాతి గుండెలు కోయని మన పలుకు మనకే చెపుతాయి

ఆ గుర్తొచ్చింది
అదిగో ఆ రాధమ్మను అడుగు
అల్లదిగో  ఆ గోపికను అడుగు
కృష్ణుడు బృందావనం విడిచి వెళ్ళిన నాటినుంచి
విరహ వేదనతో వేగి వేసారి పోతున్నారు ఆనాటి నుంచి
భగవంతుని కొరకు సాగే వేదన అస్సలైన విరహవేదన
మిగతావన్నీ కోరిక తీర్చుకొనే కామా వాంఛలే 

శుక్రవారం, సెప్టెంబర్ 27, 2013

నన్ ఆఫ్ ది అబోనన్ ఆఫ్ ది అబో - వల్ల

వచ్చేది ఏమి లేదు

పోయేది  అంతకన్నా లేదు

దానికి కొమ్ములు లేవు కోరలు లేవు

మన  పిచ్చి కాకపోతే

కొమ్ములు తిరిగిన పొటేలు ఒంగుతుందా

గురువారం, సెప్టెంబర్ 26, 2013

జగన్ రాజకీయ మేధావి

స్వాతంత్రం అనతరం 

ఒక్క ఇందిరాగాంధీ కి తప్ప 

ఎవరికి ఇంత ఘన స్వాగతం లేదు 

జైలు జీవితం గడిపిన తరువాత కూడా 

జగన్ రాజకీయ మేధావి  కొత్త సొబగులు అద్దినాడు ( సిగ్గు పడకుండా )

బుధవారం, ఆగస్టు 28, 2013

జీవన నిత్య సత్య భోదనలు

 

చక్రధారి  అతడు 
ప్రగతికి మార్గదర్శకుడు 

హలధారి సోదరుడు 
భుక్తికి  మోక్ష సాధకుడు 

శ్రీ హరి లీలలు  అన్ని 
సిరులు పండే దారులు

శ్రీ  కృష్ణుని చేష్టలన్నీ 
జీవన నిత్య సత్య భోదనలు 

చిద్విలాసంతో


వెన్న తిన్న పెదవి 
వేణువు ఊదే మదిని 

నెమలి కన్నుల చెలిమి 
నెలరేని  వెలుగులు పంచె 

చిరుమువ్వల సడులు 
సుడులు రేపే యెదను 

చిన్ని క్రిష్ణ రా రా చిద్విలాసంతో 
చిన్ని గుండెల దాగిన చింతల బాప 

గురువారం, జూన్ 27, 2013

బడుగు జీవులను

ఆకాశం

కరి గుంపు మేఘాలతో 

నిండు కడవల కుమ్మరించే వర్షం

ఆత్మీయుల

పోగొట్టుకున్న హృదయం

వర్షించే కడవలకొద్దీ కన్నీరు

గంగమ్మ వరదలలో చిక్కి చివికి పోయిన బతుకులెన్నో

బయటపడే దారి లేక ఆకలి దప్పుల అలమటించే హృదయాలు ఎన్నో

అయ్యా , ఆత్మా లింగా చాలును నీ లీలలు

కరుణించవయ్య మిగిలిన బడుగు జీవులను 

మంగళవారం, జూన్ 18, 2013

స్వర్గం అంటే ఇంతేనేమో

కొబ్బరాకుల 

సందుల 

జాలువారే నీరెండ 

మగత నిద్దురకు జోల పాడే 

విచ్చుకున్న 

కురుల సందుల 

వర్షించే చెలి చల్లని చూపులు   

నిదుర పోయే మనసుకు ఊయల ఊపే  

హాయీ అంటే ఇదే కదా , స్వర్గం అంటే ఇంతేనేమో 
ఆదివారం, జూన్ 16, 2013

నీరారవములు

అందనంత దూరంలో 

వినీలకాసంలో విచ్చుకున్న 

వెన్నల పారిజాతమా ...... 

అఘాదాల అంచులలో 

చీకటి పాతాళ బిలాలలో 

జాలువారే జలపాతమా .......

వేలి సందులలో జారిపోయే నీకు నిలకడేక్కడ 

నిట్టూర్పు నిశబ్ద నిసృహ నీరారవములు తప్ప  


శుభాకాంక్షలు

ఆకాశం 

ఎప్పుడు కోరదు 

తనను తనివితీరా కావలించుకోమని 

నీ ఎదుగుదలను చూసి మురిసిపోతుందే తప్ప 

ఆకాశం 

ఎప్పుడు కోరదు 

తనకు ఎప్పుడు రుణపడి ఉండాలని 

తను ఇవ్వటమే తప్ప నీకు అవసరమైన ప్రాణాధారలు

ఆకాశం లాంటి తండ్రికి తెలుపుదాము మనః శుద్దితో శుభాకాంక్షలు 

శుక్రవారం, మే 24, 2013

శోష తీర్చమ్మ

ఓ...., 

చిరు జల్లు 

వగాలడిలా వచ్చి 

పలకరించి పోకుమా 

వడగాలుల  సుడిలో చిక్కి  పోతాను 

ఆకులూ రాలినట్లు రాలుతున్న జనాల 

జాలితో  చేరదిసే  చల్లని అమ్మలా వచ్చి  శోష తీర్చమ్మ 
లక్ష్మీనరసింహ కళ్యాణం

ఒక  అందమైన  భావన 

మంచు  ముత్యంలా  కళ్ళ  ముందు  మెరిస్తే 

మనసు యెంతో  భావుకతకు  లోనవుతుంది 

ఒక  అందమైన  ఉహా 

చిరు  దివ్వెలా  వెలుగు పంచుతూ  ఎదురుగా  వస్తే 

హృదయం  యెంతో  ఉద్వేగానికి  గురి అవుతుంది 

లక్ష్మీనరసింహ కళ్యాణం  అంతే  ఉద్వేగానికి  తీసుకొని పోతుంది 

ముచ్చటైన కళ్యాణం

 వేదమంత్రాలు సాక్షిగా 

నాద వాద్యాలు  తోడుగా 

లక్ష్మీ  నరసింహుల కళ్యాణ వేడుక  జరిగింది  

అమ్మవారు  యెందుకో  ఆవైపు  తిరిగారు 

అలుకనేమో  అయ్యవారి పై 

అయ్యవారేమో  ఏమిటో  ఈవైపు  తిరిగారు 

కినుక  వహించారేమో  ఆమె పై 

కొంచెం  కష్టమైనా  చాల ఇష్టమైన  పెళ్లి 

సకల జనుల  ఆమోదమైన  అందమైన  పెళ్లి 

లక్ష్మీ  నరసింహుల ముచ్చటైన  కళ్యాణం జరిగే లోక కళ్యాణార్ధం   !!

గురువారం, మే 23, 2013

ఇలా ఉన్నాను

ఈ  కోట  శిధిలాలలో 

నా మనసు అద్దం పారేసుకున్నాను 

ఆ పగిలిన అద్దం ముక్కల వలె  

ఈ  మొండి  ప్రాకారాలతో ఇలా ఉన్నాను 
మరణాన్ని సహితం ఆహ్వానిస్తాను

ఈ చల్లన్ని పిల్ల  తెమ్మెరలు 

ఆ  నింగిని  ఎగిరే  తెల్లని  పావురాలు 


నిదురించే  ఊహలకు  ఊపిరులు  పొస్తాయి 


మొలకలెత్తె  కలలకు  ఇంద్ర ధనస్సు  రంగులు  పూస్తాయి 


స్వేచ్చకు  ప్రతీకాలు  ఈ  ప్రకృతి  ప్రతి  రూపాలు 


మరణం  సహితం  అందులో  భాగమే 


అందుకే   మరణాన్ని  సహితం  ఆహ్వానిస్తాను - స్వేచ్చ లభిస్తుదంటే  !!
బుధవారం, మే 22, 2013

స్వయం ప్రకాశుడే

తన దేదీప్యైమైన కాంతులతో 

అందరిని అలుముకున్న చీకట్లు తొలగించే ప్రమిద 

తన అడుగున ఆక్రమించు కున్న చీకటిని  తొలగించలేదు  

యెంత  జ్ఞానవంతుడైన తనలోని అజ్ఞానాన్ని తొలగించుకో లేడు 

అహంకార  అజ్ఞాన చీకట్లను తొలగించుకొనువాడు స్వయం ప్రకాశుడే 

ఏ సూరీడు కానడు

ఆకాశం ఆవాల 

నిదురించే  ఊహలను 


నీ వాడి చూపులతో చెదర గొట్టకు 


తెనేటిగల్లా చుట్టుముట్టె  మొహాలను  ఒదార్చలెవు !!


కాటుక కన్నుల బరువు మోయ గలవాడు ఈ భూ మండలం పై లేడు !!


ఎర్రని పెదవుల మాటున బరువెక్కిన గుండెల బాధలు ఏ సూరీడు కానడు !! మంగళవారం, మే 21, 2013

చేపల గబ్బు కంపు


నిజ జీవన చిత్రాలు 

చిత్ర విచిత్ర సమాహారాలు కావు 

మన ఊరి మనుషుల్లా సాద సీదా 

ఊహల్లో ఊరి చెరువు చేవులురిస్తుంది 

యెదురుగా నుంచుంటే చేపల గబ్బు కంపు  

ఇంతకన్నా జీవన సత్యం యే పాఠం తెలుపలేదు , తెలుసుకొంటే !!


నా చిన్ని కన్నా
నల్లనయ్యాయని 


నవనీతచోరాయని 

నిందలాడిన గొల్ల భామలను 

విషముకుడుపగా వచ్చిన పూతనను 

సాందీప మునిని , సఖుడు కుచేలులను 

తారతమ్యం యెరుగక కరుణతో బ్రోవ లేదా 

నేనేమి చేసితినని నాపై కినుక వహించితివి నా చిన్ని కన్నా 

సీనియర్ న్యాయవాది శ్రీ కామగారు రామకృష్ణ రావు


సీనియర్ న్యాయవాది

శ్రీ  కామగారు రామకృష్ణ రావు గారు

కానరాని లోకాలకు తరలి వెళ్లి నారు

తన  కీర్తి  శిఖరాలను మనకు గుర్తుగా వదలి

వారి ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ...

వారికివే మా నమః సుమాంజలులు .. జోహారులు 

సోమవారం, మే 20, 2013

శ్రీ లక్ష్మి నరసింహపిలిచినంతనే ..

స్తంబము  చేధించి 

హిరణ్యకుని  వధించి 

బ్రోవ లేదా  ప్రహ్లాదుని  !!

మొరాలించినంతనే .... 

ఒడలు మరచి పరుగు పరుగున 

మకర  మృత్యు  ముఖం  దృంచి 

కాపాడలేదా  కరి రాజుని  !!

యెంత పిలిచినా...  

యేమారక ఉండేవు 

అంత వారము  కాము 

కాని , నీ నిజ భక్తులము 

కరుణించవయ్యా  శ్రీ లక్ష్మి నరసింహ !!
పాకుడు రాళ్ల

 క్షార జలముల వీడి 

క్షీర  జలముల  జేరు 

మోక్ష  మార్గపు  మెట్లు  పట్టు చిక్కు !

పాకుడు  రాళ్ల పై  పట్టు నెటుల చిక్కు 

పక్ఖు మని నవ్వరా  పరమ పురుషా  !!

నారసింహుని నమ్మునారసింహుని  నమ్ము 

నరకములు ఏవి నిన్ను అంటవు 

కష్టములనే కరి రాజములు భీతిల్లు 

మృగధర రాజీవ నేత్రముల ఎరుపు జీర జూసి 

స్తంభం ఛెదించి, నిభిడాంద కారముల ద్రుంచి 

కావగ లేదా పసివాని పరమ పావనుని ప్రహల్లదుని 


నారసింహుని  నమ్ము 

నరకములు ఏవి నిన్ను అంటవు 
ఈయన మహిమే

భలే చోద్యం 

పాత్రికేయుల  సేద్యం 

ఈయన హస్తినకు వెళుతున్నాడు అని 

ఆయన ఇద్దరు మంత్రుల తొలగించాడు అట 

మరీ చోద్యం కాక పోతే ప్రతి ఒక్కటి ఈయన మహిమే అనలేదు !

శనివారం, మే 11, 2013

నీ దంటు ఒక ప్రత్యేక స్థానం ఉంది

అనంతమైన  విశ్వంలో 

పయనం  ఎటు వైపో నీది 

లెక్క లెన్నని  దారులు 

ఆత్రంగా పిలుస్తున్నాయి నిన్ను 

అయినా ........   ఆఖరికి...... 

అన్ని నదులు పారేది సంద్రం లోకే 

అన్ని నడకలు  సాగేది మరుభూమికే 

అలా అని  నిరాశ  నిశ్రుహులతో  గడపకు  జీవితం 

జీవితాన్ని  హుందాగా , ఆహ్లాదంగా  జీవించటం నేర్చుకో 

అనంతమైన  విశ్వంలో  నీ కంటూ , నీ దంటు  ఒక ప్రత్యేక స్థానం ఉంది 

బీడువారిన గుండె

ఓ .... వానా !

ఓహో  ...... వానా 

పైన మబ్బుల్లో దాక్కునావా .... 

క్రింద నీ కోసం ఎండిన గొంతులు తడుపుకుంటున్నాము 

మబ్బుల విహారం నీకు హాయి ..... హాయి ... 

బీటలు వారిన గుండెలతో మా బతుకులు బండ బారాయి  !

ఆ వంక పాల పుంత దారినుంచి  గంగమ్మ లా ఉరికి వురికి రా ! 

ఆ మహా దేవునిలా నిన్ను ఆసాంతం ఈ బీడువారిన గుండెల్లో

 కలకాలం  పదిలంగా దాచు కుంటాను..............................  !!


బుధవారం, మే 08, 2013

అంతా కాల గర్భంలోకే

పుట్టుక ముందు అన్ని వుహలే 

చచ్చాక అంతా ఏడ్పులే ఎక్కడైనా 

మధ్య జీవితం ఒక పెద్ద పర్వతారోహణం 

అన్ని ఆలోచనలు ఆగేది సమాధి వద్దే 

మిగిలినవి వెనక ఉన్నవారి జ్ఞాపకాల్లో 

ఆ తరువాత అంతా కాల గర్భంలోకే 

పీకి పాకేసిన

ఇంట్లో 
ఎలుకలు ఎక్కి పారుతున్నాయని 
ఇల్లు పీకి పాకేసిన  కర్ణాటక బి. జె. పి . 

అల్లుడా వచ్చి చక్కగా ఏలుకోవయ్య 
అంటే 
గిల్లుడై గిల్లికజ్జాలతో ఉన్నది పోగొట్టుకున్న కర్ణాటక బి. జె. పి .


ఎగిరెగిరి పడ్డ ఎడ్ద్యురప్ప 
ఎంగిలాకుల ఎన్నికలలో యెగిరి పోయె 

శుక్రవారం, మే 03, 2013

శూన్యం

జ్ఞాపకాలు 
గుండె తలుపు తట్టాయి 
హృదయపు కవాటాల కిటికీ నుంచి 
శూన్యం తొంగి చూసి వెక్కిరించింది 

శనివారం, ఏప్రిల్ 27, 2013

RAJAKEEYALU

 పాపం  !
జనం బాధలే నడిపించాయట 
కాస్త రెస్టు తీసుకుంటే కాళ్ళ నొప్పులు మర్చిపోతారు !
సి.  యం . పదవి వస్తే జనం బాధలు కూడా మరచిపోతారు !!
పాపం ! జనం !! బాధలు - వాళ్ళకు మాములే !!!

ఆదివారం, ఏప్రిల్ 21, 2013

పాద రేణు

ఎంత చూసినా తరగదయ్య నీ అందం 
ఉభయ సంధ్యల వేళ పంచ వర్ణాల హరి విల్లువు 
మధ్యాహ్న సమయాన చండ ప్రచండ భానుడవు 
నిశి రాత్రి వేళ వెన్నెలలు కురిపించు నిండు చంద్రుడవు 
హిమవన్నగము శిరసొంచి శివ గంగ తో నిన్ను అభిషేకించే  
కులుకులోకు కృష్ణమ్మ నీ పాదాల తనివి తీరా ముద్దాడె 
వనమంతా వసంత రుతువులై పూలు పూచే  నిన్ను చూసి 
మహా దేవా శ్రీశైల వాస , నీ పాద రేణు వై నేను మొగమెత్తి నిను కానగ పోతి 
నిత్య సత్య దరిద్రుని కావగ కాస్త శిరసొంచి నను కరుణించవయ్య  మహేశా 

శనివారం, ఏప్రిల్ 20, 2013

మాయని మచ్చ - చెదరిపోదేప్పుడు

నా అక్షరాలు 
భగ భగ మండే నిప్పు రవ్వలై 
హస్తినను పట్టి పీడిస్తున్న కామ పిశాచాలను 
అణువణువు చిద్రమైయేల లక్షల అక్షరాలతో తూట్లు పొడవాలని ఉంది 
నా జాతి కి ఏమైయింది వ్యామోహాల జాలం లో పడి కొట్టుకుని పోతుంది 
కన్న తల్లి తండ్రులు ,మన  సభ్య సమాజం సిగ్గుతో తల దిన్చుకొంటుంది 
నీచ  అజ్ఞానం లో సంచరించె మన  యువత పూర్తిగా  నిర్వీర్యం అవుతుంది 
 ప్రతి నాలుగు వేళ్లు , వేలు ఎత్తి చూపే వారి వైపే  తప్పు చూపిస్తున్నాయి 
చట్టాలతో నేరాలు ఆగవు , మనం మారాలి , మనుష్యలుగా మనం  కావాలి 
ఢిల్లీ ఘోరం , మానవత్వానికి ఒక పెద్ద మాయని మచ్చ - చెదరిపోదేప్పుడు 


సోమవారం, ఫిబ్రవరి 04, 2013

పూర్వము నుండి అనే మాట

అయ్యా .........

వీడు  నా  చేలో  రస్తా  వేసుతున్నాడయ్య !

లేదు  బాబు ...........

పూ ర్వము నుండి  ఆ చేలో  రస్తా  ఉందయ్యా !!

యేరా ............

ఈ  రస్తాలో  ఎక్కడా  పూర్వము నుండి అనే మాట కనపడలేదు , నీవు  అప్పదం  చెపుతున్నావు !!!

ఔరా ........

ఎక్కడైనా  రాస్తా పై  అలా  వ్రాస్తరటండి ...... విడ్డూరం  కాకా పోతే !!!!.

వంచిన తల యెత్తదు

రమణమ్మ ..........

ఆ గూటి అంచులపై  కసువు అనుకోరాదు !

భలే వారమ్మ .........

మా  రమణమ్మ  వంచిన  తల యెత్తదు  తెలుసా !!

శుక్రవారం, జనవరి 11, 2013

అమ్మా నాకెందుకే అంత ఆయుషు పోశావు


ఒట్టి పోయిన పశువుల 

కబెళాకు పంపినట్లు 

ముసలి ముతక ఎప్పుడు 

పోతారోఅని యెదురు చూస్తున్నారు 

అమ్మా  నాకెందుకే అంత ఆయుషు పోశావు 

ఎంచక్కా  నీతో పాటే తీసుకోని పోక 

అని రోదించే రోజులు 

ప్రతి జీవితంలో తొంగి చూస్తాయీ 

చక్రం తిరిగి రావటమే ఆలస్యం 

అంతవరకూ  నీవు ఆడిందే ఆట పాడిందే పాట