గురువారం, జూన్ 27, 2013

బడుగు జీవులను

ఆకాశం

కరి గుంపు మేఘాలతో 

నిండు కడవల కుమ్మరించే వర్షం

ఆత్మీయుల

పోగొట్టుకున్న హృదయం

వర్షించే కడవలకొద్దీ కన్నీరు

గంగమ్మ వరదలలో చిక్కి చివికి పోయిన బతుకులెన్నో

బయటపడే దారి లేక ఆకలి దప్పుల అలమటించే హృదయాలు ఎన్నో

అయ్యా , ఆత్మా లింగా చాలును నీ లీలలు

కరుణించవయ్య మిగిలిన బడుగు జీవులను 

మంగళవారం, జూన్ 18, 2013

స్వర్గం అంటే ఇంతేనేమో

కొబ్బరాకుల 

సందుల 

జాలువారే నీరెండ 

మగత నిద్దురకు జోల పాడే 

విచ్చుకున్న 

కురుల సందుల 

వర్షించే చెలి చల్లని చూపులు   

నిదుర పోయే మనసుకు ఊయల ఊపే  

హాయీ అంటే ఇదే కదా , స్వర్గం అంటే ఇంతేనేమో 
ఆదివారం, జూన్ 16, 2013

నీరారవములు

అందనంత దూరంలో 

వినీలకాసంలో విచ్చుకున్న 

వెన్నల పారిజాతమా ...... 

అఘాదాల అంచులలో 

చీకటి పాతాళ బిలాలలో 

జాలువారే జలపాతమా .......

వేలి సందులలో జారిపోయే నీకు నిలకడేక్కడ 

నిట్టూర్పు నిశబ్ద నిసృహ నీరారవములు తప్ప  


శుభాకాంక్షలు

ఆకాశం 

ఎప్పుడు కోరదు 

తనను తనివితీరా కావలించుకోమని 

నీ ఎదుగుదలను చూసి మురిసిపోతుందే తప్ప 

ఆకాశం 

ఎప్పుడు కోరదు 

తనకు ఎప్పుడు రుణపడి ఉండాలని 

తను ఇవ్వటమే తప్ప నీకు అవసరమైన ప్రాణాధారలు

ఆకాశం లాంటి తండ్రికి తెలుపుదాము మనః శుద్దితో శుభాకాంక్షలు