శుక్రవారం, ఫిబ్రవరి 27, 2015

హాయి హాయిగా


మౌనం మంత్రం మైతే

మాట పెదవి దాటదు 

 నిట్టూర్పు  సెగలలో

సేద తీరలేకున్నాను 

 ఆకాశ గంగలా 

ఉరుకు నా పైన

ఒడిసి పట్టుకుంటాను 

నా తలపుల ఒడిలోన   హాయి  హాయిగా

విశ్వాని నడిపించే గడియారాన్ని

 

ఆకాశం నా రాజ్యం 

మేఘాలు నా సైన్యం

ఉరుములు , మెరుపులు నా ఆయుధాలు 

సూర్యచంద్ర నక్షత్రాలు, వాయువు, నా ఆజ్ఞానువర్తులు 

అంతరిక్ష సౌధం లో, పాలపుంతల  దారుల్లో 

చమక్కు మనే కాలాన్ని నేను - ఈ విశ్వాని నడిపించే గడియారాన్ని .

బుధవారం, ఫిబ్రవరి 25, 2015

క్రీనిడ

Image result for shadow

భగవంతుడు 

నీడలా నిన్నంటి ఉంటాడు 

నీవు క్రీనిడలో జారినప్పుడల్లా 

నీ జతగా చేరి నీకు తోడు ఉంటాడు .................advocatemmmohan 

వివేక శూన్యుడే

సంశయం - సమస్య 

మనిషిని ఒక చోట నిలువనీయవు 

నీడ కూడా ఆ మనిషిని భయపెడుతుంది 

భయబ్రాంతులకు లొనైనవాడు వివేక శూన్యుడే