మంగళవారం, జూన్ 26, 2012

ఆఖరికికరిగే కాలంలో శిలలా ఎన్నాళ్ళు  ఇలా  మిగిలిపోతావు 

కసి ద్వేషం దుర్మార్గం స్వార్థం  చేతుల్లో  ఎన్నాళ్ళు  ఇలా  నలిగిపోతావు 

నిన్ను నమ్ముకున్నవారిని ఇలా ఎన్నాళ్ళు  కుళ్ళబెడతావు 

నీవు  సాధించింది  ఏమిటి  నిశ్శబ్ద  స్మశాన  సామ్రాజ్యం 

ఎలటానికి  సమాధులు  తప్ప  ఎమ్ముంది  ఇప్పుడు 

ఇప్పుడైనా  మారు  లేదా 

ఆ సమాధులలో  నీవు ఒక సమాధి అవుతావు  

ఆఖరికి 

ఆదివారం, జూన్ 24, 2012

k.venkoba rao and smt. k. anasuyamma

                         ప్రాణానికి  ప్రాణం  అయిన  ప్రాణ నాధుడు పోయే 


పతివియోగ  దు :ఖం  దూరం కాదు సతి  కంట  కన్నినీరు  నిలిచి పోదు 


రెక్కలు  తెగిన  పక్షిలా  పక్షవాతం  కమ్మి  విగతజీవి లా విలపించే 


భవ భందనములు  తెంప  ఆ రాఘవేంద్రుడే  ఒసగే       కడకు  మోక్షము 

కీర్తి శేషులు శ్రీ k . వెంకోబరావు మరియు శ్రీమతి అనసూయమ్మ

కీర్తి  శేషులు  శ్రీ  k . వెంకోబరావు  మరియు  శ్రీమతి  అనసూయమ్మ 
జంట  బాయని  జంట ; జంటగా ఎగిరిపోయే భువినుంచి దివికి   

బుధవారం, జూన్ 20, 2012

ప్రకృతి

తొలకరి వానలతో

వనాలు , గిరులు , ఝరులు

పులకరించి  పోతున్నాయి

తడిఆరిన  గొంతులు

మెలమెల్లగా  లేస్తున్నాయి

కుహు  కుహు  రాగాలతో

కొండలు కోనలు  మారుమ్రోగి  పోతున్నాయి

నింగి  ఘాడ పరిష్వంగంలో

నేలతల్లి  పరవశించి  పోతున్నది

ప్రకృతి కాంత లా  పరుగులు  తీస్తున్నది 

అన్యాయ మూర్తి
ఆఖరికి  జడ్జి కూడా  జైలు పాలు 


పట్టాభికి  గాలి సోకింది 


లంచం దెయ్యం పట్టింది 


అంతటి  అవినీతి న్యాయమూర్తి   


చివరికి  అన్యాయ మూర్తి గా నిలిచాడు 

ఆదివారం, జూన్ 17, 2012

మనసు
పరి పరి విధముల పరిగెత్తేనే  


ఊసులు పోకా  ఊపిరాడక 


ఊయల మంచపు డోలికలాగే 


డో లనమాయే  నా మనసు 


ఆందోళనమాయే  నా మనసు 

సోమవారం, జూన్ 11, 2012

మృత్యువు


మృత్యువు  కౌగిలి  కోరేవారు  ఏ  కోరికల కై  పరుగులు  తీయరు 


అసహాయ  జీవుల  అంతరంగ తరంగం లో  ఆఖరి అంకం  అదే 


కాలయముని  కరుణా  కటాక్ష కొరకు  ఊపిరి  ఉగ్గ  బట్టి  బ్రతుకు  బండి లాగుతుంటారు 


ఆఖరి ఘడియల  ఆవిష్కారానికి  ఆశకావేశాలతో  రగిలి పొగిలి పోతువుంటారు 


జుగుప్స  గగ్గుర్పాటు  ఏవగింపు  ఏడ్పు  కలగలసి  జీవిత చరమాంకం  అంచుల  అటునిటు  ఊగి  పోతారు 


నిస్సహాయులై  నిసృహుల  నిట్టురుపుల  నిప్పులలోన  మగ్గి  మగ్గి  మసి  బారి పోతారు 


ఏ స్పర్స  స్వాంతన  నివ్వదు  ఏ  మందు  పని  చేయదు  యమ కర స్పర్స తప్ప 

ఊహా సుందరి

ఎగిరే గాలి పటంలో  సూత్రం లా 


దాగున్న పూలదండ లో  దారం లా 


చిగురాకుల చివురులలో మెరిసే  మంచు ముత్యం లా


లేత గులాబి అధరాల పై మురిసే చిరునగవుల దరహాసం లా 


నీలో మిగిలిపోనా  నిన్నంటుకునే  నీ నీడలా నిలిచిపోనా 

ఆదివారం, జూన్ 10, 2012

చట్టం కళ్ళు ఎదురుగా విడివడి పోయే

యెట్టకేలకు  వివాహబంధం  తెగిపోయింది  
న్యాయం చట్టం సాక్షిగా 
బాసలు ఆశలు  అడియాసలు అయ్యాయి 
కలలు కోరికలు కన్నీటి చుక్కలై  దొరలిపోయాయి 

పాషాణ హృదయం కటిన కాసారమై పోయే 
కన్నీరు వరద కూడా కడగలేక పోయే 
బంధాలు బాంధవ్యాలు బందనాలను నిలుపలేక పోయే 
సుడి గాలిలో చిగురాకులా చిరిగి చిరిగి పెలికలైపోయే 

అహంకారం ముందు మమకారం ఆవిరైపోయే 
అవివేకము  ముందు  వివేకం విస్తుపోయే 
అనలోచితలలోకంలో అనాలోచిత సుడిగుండంలో 
అన్ని ఆశలు ఆశయాలు వడి వడి గా సుడి వడి పోయే 

విడాకులే మామిడాకులై వియోగమే సమాగమై 
చట్టం కళ్ళు ఎదురుగా  విడివడి పోయే