శనివారం, ఏప్రిల్ 25, 2015

మ్రోక్కరా

 

బ్రహ్మ 

కడిగిన పాదమిది 

కడగ రా 

వెచ్చటి కన్నీటి ధార

గంగ 

పుట్టిన పాదమిది 

మోయరా  

శిరసున

తనువు వెర్రి శివ గంగలెత్త 

తులసి  

కొలువైన పాదమిది

కొలవరా 

బ్రతుకు పచ్చంగ పండా 

సురాసురులు 

అనుక్షణం మ్రొక్కేడి  పాదమిది 

మ్రోక్కరా మోక్ష కైవల్యములు కూర


"టెంపుల్ అఫ్ జస్టిస్"

 

"టెంపుల్ అఫ్ జస్టిస్"

నాలుగు గోడల మధ్య 

నాలుగు ఐదు సూత్రాలపై 

చేసే వాదోపవాదాలు విని

తీర్మానం చేసే శాస్త్ర పరికరం కాదు 

ఆర్తులకు సంపూర్ణ న్యాయం చేసే దేవాలయలు


బుధవారం, ఏప్రిల్ 22, 2015

ఎండ మావుల వెంట

 

ఏం

కావలి 

ఈ జీవితాలకు 

చక్కటి అనుబంధాలు - చిక్కటి తీపి గురుతులు కాక !

ఈ  ఉరుకులు - పరుగులేల

 ఎండ మావుల వెంట - విసిగి వేసారి నీ యమ్మ జీవితం అనటం తప్ప !!


మంగళవారం, ఏప్రిల్ 21, 2015

నీ ఆదర్శాలకు కాదు

 

యెనెన్నో ఆటుపోట్లు 

అయినా చెదరలేదు 

సముద్రమంతా గాభిర్యం  

చెరగలేదు పెదవులపై చిరునవ్వు

ఆఖరికి పోరాడి పోరాడి ఒరిగిపోయావు భీష్ముడిలా

నీ నిష్క్రమణ జీవితానికి తుది మలుపు కాని నీ ఆదర్శాలకు కాదు

ప్రార్థిస్తూ

                                                                                                             

స్వచ్చమైన , నిర్మల మనసుతో 

గురువు చేసే ఆశీర్వాదాలు ఆణిముత్యాలాంటివి 

అవి మాకు మీరు ఎక్కడ వున్నా ఇస్తారని నిరంతరం ప్రార్థిస్తాం

మీ ఆత్మకు నిరంతరం స్వస్తత , ప్రశాంతత కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ

నేనో సాధారణమైన టీచర్ ను 

 

 

 

"గురువు 

శిష్యులనే గొర్రెలమందకు నాయకుడు 

చక్కని ప్రవర్తన కలవాడే దశ దిశా నిర్దేశించగలడు

సమాజానికి ఆదర్శవంతమైన పౌరులను అందించగలడు" 

                                                           - శ్రీ  D. లక్ష్మణా చార్యులు

నేనో  సాధారణమైన టీచర్ ను 

నా శిష్యుల ప్రేమ నాకు లభించింది  అంటే అది నా వృతి గొప్పదనం ! నాది కాదు !!

( మా ప్రియమైన గురువు శ్రీ  D . లక్ష్మణా చార్యులు సెలవు తీసుకున్నారు )

శుక్రవారం, ఏప్రిల్ 17, 2015

స్వేచ్చా విహంగాన్ని

 

 

నేనొక 

స్వేచ్చా విహంగాన్ని 

సుడి గాలిలా 

ఈ భూమి చుట్టూ తిరుగుతుంటా

నన్ను అంటుకున్న 

వాసనలేవి నావి కావు కాలంతో పాటు కరిగిపోయేవే 

ఎటువంటి వాసనలు , ఆకారాలు , వికారాలు నన్ను అంటుకోవు !!


సోమవారం, ఏప్రిల్ 06, 2015

కొంగలా

 

సూర్యోదయం 

చంద్రోదయం 

సాగేదే జీవితం

ఉభయ సంధ్యల మధ్య

తరాలు 

తర తరాలుగా దొర్లి పోతున్నాయి

మౌనంగా 

ఒంటి కాలిపై నుంచున్న కొంగలాగ చూస్తున్నది కాలం !!


ఆదివారం, ఏప్రిల్ 05, 2015

దేవుడెవరో

 

ఆకాశం నీలం 
అంతరిక్షం అంధకారం 
అంతు చిక్కని సూత్రాల మధ్య 
వేలాడుతున్న గ్రహాల పరిక్రమలు 
కనుగొన్నది సైన్స్ - కానరానిది మిస్టరి 
అంతరంగ తరంగాలను పట్టుకొనే వరకు 
తెలియదు మనకు మనమేవరమో దేవుడెవరో


ఉండలేనుగా

 

 

అందరూ 

అంటారు నీవు ఉన్నావని 

 కొందరంటారు నీవు లేవని

అయితే ఇంత వరకు నేను కానను 

కనిపించలేదని 

నీవు లేవనే మాటను విశ్వసించలేను 

గాలి కనిపించలేదని శ్వాసించకుండా ఉండలేనుగా


ఓ నీలవర్ణం వాడ

 
ఈ పూల 
పరిమళం లో నిన్నుగంటి 
ఈ మేఘమాల 
సింహగర్జన లో నిన్నుగంటి 
నెమలి ఈకల కన్నులలో 
కంటి నీ భువనమోహన రూపు 
ఇంద్ర ధనస్సు పై ఎక్కి 
ఊరేగి రారా  ఊరు వాడ చూడ ఓ నీలవర్ణం వాడ

శనివారం, ఏప్రిల్ 04, 2015

హరి

 
హరి 
హరి అని 
పిలువ మనసాయరా 
వయస్సులో 
కానలేదు  నీ యశస్సు
మనస్కరించక 
ఈ దేహం నమస్కరించను లేదు 
తిరస్కరించక నా మోర కనిపించవా హరి


కొత్త ఇల్లు

 

మరణం లేని ఇంట 

కొంత మట్టిని తీసుకరా 

మరణం అనేదే లేకుండా చేస్తా !అంటే !!

వెనుకటికి ఒకడు

కొత్త ఇల్లు కట్టే ప్రయత్నం చేసాడంట !!


గ్రహణం

 

చంద్ర గ్రహణం 

కలిగించే చీకటి చిటికలో పోవు

మనసుకు పట్టిన చీకటి

మట్టిలో కలిసెంత వరకు పోవు కదా !

పట్టనీకు  గ్రహణం మనసుకు ఎప్పటికి !!


డాక్టర్ రంగశాయి

యేమి
నేస్తమా !
అలిసి పోయావా !!
ఈ మాత్రానికే 
ఏమిటా పడక ?
అంపశయ్యపై భీష్ముడి లా !!
లే  ! లే..  ! లే ... !!
చేయవలసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి !
జయించవలసిన దుర్గాలు ఇంకా మిగిలి పోయాయి!!
(  మా ప్రియ మిత్రుడు డాక్టర్ రంగశాయి త్వరగా కోలుకోవాలని  ప్రార్థన )


గురువారం, ఏప్రిల్ 02, 2015

పెళ్లి సంతకం

 

 

జీవితమనే 

తెల్లని కాగితంపై 

కాలమనే కలంతో 

హృదయ బాషలో

మనం మనకోసం 

వ్రాసుకున్న ఒప్పదం

చివరలో చేసిన చేవ్రాలే  - పెళ్లి సంతకం


హరి లేనినాడు ఈ కట్టే హరీ మని హరించిపొదా

 

ఉన్నాడా

దేవుడు  ?

అను సందేహమేల 

అందు ఇందు వెతకనేల

అంతరంగం లోనే హరి జీవించి ఉండు

హరి లేనినాడు ఈ కట్టే  హరించిపొదా హరీ అని !


బుధవారం, ఏప్రిల్ 01, 2015

జీవించు జీవితాన్ని జీవించినంతకాలం

 

జననం 

మరణం 

ఒకటి  మోదం

ఇంకొటి  ఖేదం 

ఇది మానవ నైజం

ఈ మధ్య సాగేదే బ్రతుకు

కష్ట పడ్డ వాడికి తెలుసు 

గుప్పెడు మెతుకుల విలువ 

మీనమేషాలు లెక్కించే వాడికి 

ఏమి తెలుసు ఈ బ్రతుకు విలువ 

హుంకరింపులు  బ్రతుకు విలువల చెరిచేతే 

ఛీదరింపులు బ్రతుకుతీపిని చంపేస్తుంది చల్లగా 

అప్పుడు జననమైన , మరణమైన ఒక్కలాగే అనిపిస్తుంది 

అందుకే 

జననమరణాల లెక్కలేల 

ఈ గొడవలేల 

హుంకరింపుల - ఛీదరింపుల

జీవించు జీవితాన్ని జీవించినంతకాలం ప్రేమగా ఉన్నంతగా