శనివారం, మార్చి 24, 2012

విపులామ్సో మహబహుహ్, కంబు గ్రీవో మహా హనుహు

రామాయణం - బాల కాండ 
          సర్గ   - 1 నారద ఉవాచ  - 9బుద్దిమాన్ , నీతిమాన్ ,వాంగ్మి, శ్రీమాన్ , శత్రు నిబ్రహనః


విపులామ్సో మహబహుహ్, కంబు గ్రీవో మహా హనుహు  

బుద్దిమాన్ =  బుద్దిమంతుడు ;
నీతిమాన్ =  నితిమంతుడు ;
వాంగ్మి =   చక్కటి సంభాషణ చతురుడు ; వాన్గ్మ్యము తెలిసిన వాడు ;జ్ఞానీ ;
శ్రీమాన్ =   లక్ష్మి పతి సమానుడు ;
శత్రు నిబ్రహనః = శత్రువులను నిరుములించేడివాడు ;

విపులామ్సో = విశాల భుజములు గలవాడు ;
మహబహుహ్ = పెద్ద పెద్ద చేతులు కలవాడు ;
కంబు గ్రీవో  =  శంకం వంటి మెడ కలవాడు ;
మహా హనుహు  = ఎతైన దవడలు కలవాడు ;
భుజాలు అటునుంచి ఇటునుంచి చూస్తే విల్లుల సుందరంగా వంపులు తిరిగి వుంటుంది 
దాని పై నుంచి శంఖము లా మెడ నిటారుగా నిలబడి వుంటుంది . సంధించిన బాణములాఎత్తైన దవడ ఎముకలు కలవాడు / హై చీక్ బోన్స్ , పొడవాటి చేతులు  కలవాడు 
 •  ఈ ఎత్తైన దవడ చెంపల వాళ్ళ ముఖము  చాల చక్కగా కనిపిస్తుంది .
 • విశాలమైన నేత్రాలు ఉంటాయీ ,
 •  విశాలమైన నుదురు వుంటుంది . 
 • పెద్ద చెవులు కూడా ఉంటాయీ .
 • పైన విశాలత వల్ల క్రింది వైపు చుబుకం కలవాలంటే యు షేపు లో బాగా క్రిందకు వచ్చి కలవాలి మామిడి పండు కొసలా 
 • ఎడం కుడి సమ భాగాలూ చేస్తూ చక్కటి నాసిక నిటారుగా ఉండవలసిందే .
 • దాని క్రిందుగా మామిడి కొస చుబుకం పై విల్లు లా వంగిన పెదవులు తప్పని సరిగా వస్తాయీ . 
 • వెరసి రాముడు  చక్కటి అందగాడు అనే విషయం మనకు తెలుస్తుంది .
 • ఎతైన చెంపల  వల్ల  రాముడు శ్పురధ్రుపి  అని అర్థము అవుతుంది .
 • విశాలమైన భుజముల వల్ల , పొడవాటి చేతుల వల్ల అతడు గొప్ప విలుకాడు  అని అర్థం అవుతుంది .
 • బాణము సంధించే టప్పుడు  భుజములు రెండు సమముగా , నిటారుగా , విశాలంగా వుంచి
 • చేతులు రెండు సాధ్యము అయినంత చాచ వలసి వస్తుంది , 
 • ఈ సాధనలో వద్దన్నా పై లక్షణాలు ఆ శరీరంలో ఏర్పడతాయి .
రాముడు మన కళ్ళకు సగం కనపడ్డాడు . మబ్బులలో దాక్కున చంద్రుడిలా  అవునా .