శనివారం, మార్చి 31, 2012

శ్రీ రామ నవమి - సీతా రాముల కళ్యాణం

శ్రీ రామ నవమి - సీతా రాముల కళ్యాణం 

చూడ చక్కని జంట - చూడ ముచ్చటనంట


చూపరుల తలతిప్ప నివ్వదంటా.......
మనోఫలకమున  పటమై నిలుచునంట.


దశరథ తనయుడు రామయ్య ఇతడంటా.......
జనకుని కూతురు జానకీ ఈమె నట.


 అహ-అలవోకగా ఆ విల్లును విరచీ .....
 ఇహ - చివురులాటి  సీత చే పట్టనే .