గురువారం, మార్చి 22, 2012

శ్రుత్వ చైత త్రిలోకజ్ఞో వాల్మికే నారదో వచః

                  రామాయణం - బాల కాండ 
                           సర్గ -1 

                  6
శ్రుత్వ చైత త్రిలోకజ్ఞో వాల్మికే నారదో వచః 


శ్రుయతామితి చామన్త్రియ  ప్రహ్రస్తో  వాక్యమబ్రవిత్


శ్రుత్వ = విన్నాడు / వినుట ;


చైత = తిరుగుట/కదలుట/  తెలిసియుండుట;


త్రిలోకజ్ఞో = మూడు లోకాలను తెలిసినవాడు ;


వచః = పలికినాడు /చెప్పినాడు ;


శ్రుయతామితి = ఆనందగా వింటువున్నారు;


చామన్త్రియ = ఆమంత్రియ = మంత్రము వేసినట్లు ; 


 ప్రహ్రస్తో = ప్రశంస ;


వాక్యమబ్రవిత్ = అబ్బురపరిచే మాటలు ;


త్రిలోకలను చుట్టి వచ్చిన నారద మహర్షి చెప్పే మాటలను .....
శ్రద్దగా , మంత్రము వేసినటుల , ప్రసంసిన్చుకుంటూ అబ్బుర పరిచే మాటలను వాల్మీకి మహర్షి వింటున్నాడు . • ఏమి ఆ మాటలో ఇంకా మనకు తెలియలేదు ....
 • అయితే ఇక్కడ 
 • చెప్పే వారి స్తాయి ఎలా వుంది 
 • వినే వారి శ్రద్ధ ఎలా వుంది  
 • అనేది చక్కగా వివరించారు 

 • ఇప్పుడు చెప్పేవారు నాలా వెతుకుకొని  తప్పులో తడకలో చెప్పేవారు 
 • ఎక్కువ వున్నారు .
 • మీలా శ్రద్దగా చదివే వారు తక్కువ అయ్యారు .
 • కారణం సరిగా చెప్పే వారు లేక .
 • వారికీ ఆ స్తాయి లేక .

 • స్తాయి  అంటే  వుట్టి చదువే కాదు చైత త్రిలోకజ్ఞానో  - 
 • త్రి అనేది మనసు , వాచా మరియు కర్మన  ఆచరించి చూపేవారు .

 • మీకు బాగా గుర్తు , మీ స్కూల్ జండా వందనానికి , ఒక పోలిసో , యమర్వో , రాజకీయ నాయకుడో వస్తాడు .
 • దేశము గురించి , దేశ భక్తీ గురించి చెపుతాడు .
 • వెంటనే పిల్లలు అక్కడే గోనుగుతారు  వీడు దొంగ పేదవాళ్ళ సొమ్ము తిన్నాడు అంటూ ... ఇంకా .......
 • అటువంటి వారు మంచి గురించి మాటలాడితే 
 • అస్సలు మంచి పైననే మంచి అభిప్రాయం వున్నది పోతుంది .
 • అదే ఈ వాళ ప్రతి దేశంలో జరుగుతుంది .
 • మాతృ దేవో - అనాలంటే భయం 
 • పితృ దేవో - అనాలంటే భయం ....... ఎందుకు విడాకులు ..విడాకులు 
 • ఎక్కడ చూసినా ఇదే తంతు .
 • ఇక .. ఆచార్య దేవో ... అనాలంటే ఇంకా భయం 
 • ఎందుకు ... తాగుబోతులు , వ్యభిచారులు , చదువురానివారు  సమాజములో ఎక్కువ అవుతున్నారు .
 • ఇక ..... మిగతావారిని యేమని పిలవాలి .
 • ఇలా అని భయపడరాదు
ఆవాళ వాల్మీకి ఎవరు వున్నారు అని గట్టిగ ప్రశ్న వేసినా....
నారదుడు ..... వున్నాడు ఇది గో  రాముడు అన్నాడు .
ఈ వాళ సమాజములో ప్రశ్న వేసే వలా మేకులు  పబ్లిసిటీ కోసం , 
రేటింగ్ కోసం  యెంతో మంది వున్నా నారదుడు లేడు 
లేటెస్ట్ టి వి వాళ్ళే నారదుడు పాత్ర , వాల్మీకి పాత్ర వేస్తున్నారు .

ఇక ప్రత్యేకముగా  రాముడు రాడు  మనము  మంచి గుణాలు పెంచుకుంటే  , మన పరిధిలో మనము చేయగలిగిన పని చేస్తే చాలు మీ ఇంట్లో మీరే  రాముడు . ఇంటికొక రాముడు వస్తే చాలు అంతా రామమయం .