గురువారం, మార్చి 29, 2012

భరత వైశిష్ట్యం

రామాయణం - బాల కాండ 
  సర్గ - 1 


నారద ఉవాచ
గత్వ తు స మహాత్మానం రామం సత్య పరాక్రమం 
అయచాట్  భ్రాతరం  రామం ఆర్య భావ పురశ్కరుతః -35 


త్వం ఏవ రాజా ధర్మజ్ఞా ఇతి రామం వచః అబ్రవీత్ 
రామో ఆపి  పరమోదరః  సుముఖ: సుమహయసాః -36 


న చ  ఇచ్చాట్  పితృ ఆదేశాట్ రాజ్యం రామో మహాబలి :
పాదుకే  చ ఆర్య రాజ్యాయ న్యాసం దత్త్వ పునః పునః -37 


నివార్త్యమాస తతో  భరతం భరతాగ్రజః
స కామం  అన్వాప్య ఏవ రామ పాద ఉపశ్రిసాన్ -38 


నంది గ్రామే అక్రోట రాజ్యం రామ ఆగమ కాంక్షయ
గతెతు భరతే శ్రీమాన్ సత్య సంధో జితేన్ద్రియః - 39 
భరత వైశిష్ట్యం 
రాజ్యం వచ్చింది 
కోరకుండానే వచ్చింది 
అందరు పిలిచి సింహాసనం ఇస్తున్నారు 
అయినా కూడా వద్దు 
రాముడే ఎప్పుడు రాజు 
ఆయన రాకపోతే ఆయన పాదుకలే రాజ్యాన్ని పరిపాలిస్తాయి.


అందుకే  ఆ మహానుబావుడు  కైకేయ కుమారడు  చెప్పిన మాట ఏమిటో తెలుసా .......


న ఇచ్చాట్  రాజ్యం  ఇతి 


ఈ రాజ్యం నా కొద్దు ... అంటే  ఏమైనది ఈ రాజ్యం వద్దు అంటాడు.
ఈ రాజ్యానికి ఏమైంది ......
ఈ రాజ్యములో రాముడు లేడు . రాముడు లేని రాజ్యం నాకెందుకు .
మా నాయనే రాముడు లేడని ఈ రాజ్యం విడిచి పెట్టి పరలోకానికి పోయాడు .
రాముడు లేడు అందుకే నాకే రాజ్యం వద్దు .
అందుకే ..... చూసారా పాదుకలు తీసుకొని నందిగ్రామం లో  కుర్చ్చునాడు  అంతేకాని రాజ్యం లోనికి పోలేదు .


ఈ .... రాజ్యం ....అంటే  రాముడు లేని రాజ్యం అని .
న ఇచ్చాట్  అన్నాడు . నా కొద్దు .


అదే భారతం లో అర్జునుడు  న కాంక్షం రాజ్యం  అన్నాడు .
నేను రాజ్యం కోరను అన్నాడు .
ఇక్కడ ఆయనకు ఇంకా రాజ్యం రానేలేదు 
ఎవరు ఇస్తాము  అనలేదు . యుధం వద్దు అనే వైరాగ్యం లో  న కాంక్షం అన్నాడు .


ఆ వైరాగ్యము - ఈ త్యాగము తూర్పు - పడమర  లాంటివి .


ఈ కాలంలో  ఈ రెండింటి తేడ మరిచి  రానిదంతా మనమే    త్యాగం చేసివేసినట్లు ఫోటో వేయించుకుంటాం .