శనివారం, మార్చి 24, 2012

సమః సమ విభాక్తాన్గః స్నిగ్ధ వరుణః ప్రతాపవాన్

రామాయణం - బాల కాండ 
            సర్గ - 1 నారద ఉవాచ :- 11


సమః  సమ విభాక్తాన్గః స్నిగ్ధ   వరుణః ప్రతాపవాన్ 


పిన వక్ష విశాలాక్షో  లక్ష్మీవాన్ శుభ లక్షనః

సమః  =  చక్కటి శరీరం సౌష్టవము కలవాడు . 
 సమ విభాక్తాన్గః = అన్ని అవయవములు పొందిక చక్కగా అమరివున్నాయి .
స్నిగ్ధ   వరుణః =  నునుపు గల రంగు కలవాడు 
ప్రతాపవాన్ =  ప్రతాపము 

పిన వక్ష =  సన్నటి నడుము  ఎందుకంటె ఇంతకు ముందు మహార్శోకో అన్నారు అంటే విశాల మైన రొమ్ము కలవాడు అని  వక్క్ష అనలేదు వక్ష అన్నారు .
విశాలాక్షో  = విశాలమైన కన్నులు గలవాడు ;
లక్ష్మీవాన్ శుభ లక్షనః = శుభ లక్షణ ములు గల లక్ష్మి పతి లాంటి వాడు ;


స్నిగ్ధ వర్ణం = గ్లాస్సి కలర్ , మెరుపు కల శరీర వర్ణం .;
విశాలోక్షో = విశాల మైన కన్నులు కలవాడు ;

సమః సమవిభాకతాన్గః లక్ష్మీవాన్ శుభ లక్షణ 

అంగ సాముద్రిక శాస్త్రం ప్రకారం  సకల శుభ లక్షణాలు కలవాడు .సుడులు, పుట్టు మచ్చలు , శంక చక్ర గుర్తులు , ముఖ లక్షణాలు ఇలా అన్ని లెక్క వేస్తే  వాటి నుంచి వచ్చే ఫలితాన్ని బట్టి సలక్ష్ణ , అవలక్షణ అనే విషయము గ్రహిస్తారు పెద్దలు .


10 వ శ్లోకం + ఈ శ్లోకం ద్వార మనకు రాముని గుర్తు పట్టే ఆనవాళ్ళు కొన్ని లభించాయి .


చక్కటి శిరస్సు ;
విశాల మైన నుదురు ;
విశాల మైన కళ్ళు ;
ఎతైన చెంపలు ;
ఇంకా నాసిక , పెదవులు , చుబుకం , చెవులు రావాలి ఆయన ముఖ చిత్రం పూర్తి కావటానికి .


శరీర సౌష్టవము గురించి చెప్పాలంటే 
చక్కటి శరీర సౌష్టవము ; వుభాకయము కాదు , పీల కాయము కాదు .
ఫిట్టేడ్ ఫర్ అయిడిల్ మేజార్మేంట్ .
సమ అంటే ఆదర్శ మైన , అందరు ఇష్టపడే , కోరుకొనే శరీర అంగ సౌష్టవం కలవాడు అని అర్థం. 


రంగు కు వస్తే 


గ్లాస్సి అన్నారు  చక్కటి మెరుపు వర్ణము . మనది ఆసియా ఖండం . అందులో మనది భారత దేశము ఈ ప్రాంతాలలో  ఉన్నశరీర వర్ణాలు , కొద్దిగా మిక్ష్ ఐన రోజా కలర్  రష్యా వాళ్ళు , శరీర చాయ తెలుపు , చమన చాయ , నలుపు .ఈ క్రిందివి రెండు దక్షిణ భారతంలో కనిస్పిస్తాయి .
రాముడు ఉత్తర భారతంలో జన్మించాడు మరి స్నిగ్ధ అంటే  చాల రంగులలో కూడా మెరుపు వుంటుంది , ఘాడత వుంటుంది .
మరి ఈయన  ఏ రంగు వాడో పూర్తిగా తెలియలేదు  ఇంకా మనకు . ముందు శ్లోకాలలో చూడాలి .