బుధవారం, మార్చి 21, 2012

తపహ్స్వధ్యాయ నిరంతం తపసివ్వి వాగ్విదాం వరం

వాల్మీకి రామాయణ - బాల కాండ

                        సర్గ -1 
                           1
తపహ్స్వధ్యాయ నిరంతం  తపసివ్వి వాగ్విదాం వరం
నారదం పరిపా ప్రచ్చ  వాల్మీకి ముని పుంగవం .

తపః - తపస్సు ; 
స్వధ్యాయ - అనుభవించుట ;
 నిరంతరం - ఎల్లప్పుడు ;

యెల్లప్పుడు తపస్సులో వుంటారు .

తప్సివి - ముని/తేజస్సు గలవాడు / మౌని  ; 
వాగ్విదాం -జ్ఞానం /తర్కం ;వరం -పొందినవారు /వరంగా కలిగినవారు ;
వాక్ +విద్వాం = సంభాషణ చతురుడు ;వాగ్వి = వాగ్దేవి =సరస్వతి +తాం = వల్ల + వరం =వరము పొందిన .

జ్ఞాన   సంపన్నుడు మౌని .

నారదం -నారద మహర్షి ని ; 
పరిపా - సార్లు ; పరి పరి విధముల 
ప్రచ్చ - ప్రశ్న /విచారణ /అడగటం ; 
వాల్మీకి - వాల్మీకి ;
మునిపున్గావం -మునిశ్రేస్టులు/మునిగాజన్మించినవారు/అవతారం దాల్చినవారు ;

 • వాల్మీకి మహర్షి నారద మహర్షిని పరి పరి విధముల ప్రశించినాడు .


 • ఇక్కడ మొదటి పాదములో  నారద ముని పేరు చెప్పకుండా ఆయనను గురించి వివరించాడు .
 • రెండవ పాదములో , వాల్మీకి నారద మునిని ప్రశించారు అని ముగించారు మునిపుంగవ అంటూ.
 • నిరంతరం - యెల్లప్పుడు .
 • తపస్వాధ్యాయ - తపస్సునే ఊపిరిగా కలవాడు 
 • తపసివి - ఎసస్వి ల తపస్సు కీర్తిగా కలవారు .
 • వాగ్విదాం వరం - తర్క జ్ఞానం వరముగా పొందినవారు .
 • వాగ్విదాం - వాగ్వి అంటే వాగ్దేవి -సరస్వతి 
 • వరం - కటాక్షము కలవారు .
 • సరస్వతి పుత్రులు అనే అర్థం స్పురిస్తుంది .

 • మొదటి పాదములోని వర్ణన ఆ ఇద్దరు మహారుషులకు వర్తింప జేసారు .చమత్కారముగా .
ఒక్క పాదములో  ఎలా మొదలు పెట్టాలో , ఎలా ఎన్ని విధాల తెలియ జేయవచ్చో అన్ని విధాల మనకు అందముగా అందించారు మహర్షి వాల్మీకి .


వాగ్దేవి వరం సుతం నారదాం  
వాల్మీకి మునిపున్గవం పరిపప్రచ్చాయే ...


మునిపుంగవ వాల్మీకి పరిపప్రచ్ఛ - వాగ్దేవి వర సుత నారదాం .


ప్రశ్నతో మొదలవుతుంది  ?
ఒక ప్రశ్నకు వున్నబలమేమిటో .........
ఈ ప్రశ్న మనము ప్రశ్నిచలేని లోకాలకు తీసుకుని వెలుతుందా లేక ప్రశ్న తరువాతి  యుగాలలో /తరములలో ప్రశ్న గానే మిగిలిపోతుందా ?
ఒక జీవన మార్గాన్ని నిర్దేశిస్తుంది .
మార్గము మంచిది అయితే  అందరు ప్రయాణిస్తారు శ్రీ సీతా రామచంద్రుని  సహాయముతో  .
రాముని ప్రయాణమే ఈ రామాయణము .


    సర్వే జనా సుఖినో భవంతు .