బుధవారం, మార్చి 14, 2012

సీతమ్మ వారు మనిషి కాదు , దైవ స్వరూపిణి , ప్రేమ స్వరూపిణి అనే యెంతో చక్కగా వివరించాడు .


 ఇక్కడ మన మొక్కసారి , సీతమ్మ వారిని చూడాలి .
దేవమాయవినిర్మితః =దేవ మాయ అంటే దేవుని  మహిమవల్ల ; వినిర్మితః  = శ్రుష్ట్టించ బడినది . జాతా జనకులస్య = జనకుని కులంలో -వంశము          లో/ నకూ
జాతా - జన్మించినది / చెందినది 
నారినాం - స్రీలలో , ఉత్తమం - శ్రేష్టమైనది = , వధూహు - వధువు - పెళ్ళికూతురు .
కొత్తగ పెళ్లి అయిన అమ్మాయీ అని చెప్పకనే చెప్పాడు .
సితాప్యా అనుగత రామం - ఎంతో ఇష్టంతో రాముని వెంట ,
చంద్రుని వెంట రోహినిల వెళ్ళింది .
బ్రహ్మ శ్రుష్టి ఐతే మానవుడు , దైవ శ్రుష్టి ఐతే ఎవరు ? జానకి ..
సీతాప్యా- ప్రేమ స్వరూపిణి అనే అర్థం కూడా అనుకోవచ్చు .
సీతమ్మ వారు మనిషి కాదు , దైవ స్వరూపిణి , ప్రేమ స్వరూపిణి అనే యెంతో చక్కగా వివరించాడు .