శుక్రవారం, మార్చి 09, 2012

ఈ మాటలు మొట్ట మొదటి సారిగా రాముని చూస్తూ యెంతో గౌరవ మర్యాదపూర్వకముగా పలికినవి .

 ఇక్కడ మహర్షి వాల్మీకి మనుష్య సంబందభాన్దవ్యాలలో మానవుడు ఎలా ప్రవర్తించాలి అనేది చక్కగా వివరించాడు . 
ఇక్కడ భరతుని తో పాటు , వాల్మీకి మహర్షి కూడా మొట్ట మొదటి సారిగా , రాముని తో మాటలాడు తున్నాడు భరతుని ద్వార .


భరతుని  తల్లి కైక వల్లే , రాజ్యము పోయింది , తండ్రి పోయాడు , తను,సీతా , లక్ష్మణుడు కారడవుల పాలైనారు .
ఈ మధ్యలో ఎప్పుడు ఒకరిని మరొకరు చూడనప్పుడు , ఎవరి మనసులో ఏమి వుందో తెలియనప్పుడు , ఒకరి ఉద్దేశం ఇంకొకరికి సూటిగా , చక్కగా తెలియాలంటే ఎలా చెప్పాలి  అనే విషయం చాల చక్కగా ...


త్వం ఏవ రాజా .. ధర్మజ్ఞా....... నీవే రాజువు ..నీవే ధర్మజ్నడవు.
న ఇతి ఇచ్చాట్ రాజ్యం ......... నాకు ఈ రాజ్యం వద్దేవద్దు .
అనే భరతుని తో చెప్పించినాడు .
 ఈ మాటలు మొట్ట మొదటి సారిగా రాముని చూస్తూ యెంతో గౌరవ మర్యాదపూర్వకముగా పలికినవి .  
ఇలా కాకా ఇంకోలా ఏమి చెప్పిన అవి సూటిగా మనసుకు రావు .
ఇక్కడ బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలో తెలియజేసినాడు . 
రామం యపి - రాముడు అప్పుడు 
పరమోదారః ,సుముఖః , సుమహయాసః - చాల సంతోషించినాడు ,సుముఖుడైనాడు , మనసుతెలిక పరచుకున్నాడు .
ఈ మాటలు రాముని మనః స్థితిని తెలియజేస్తుంది .
భరతుడు రాక ముందు , భరతుడు వచ్చాక ఎలా రాముని మనసు మారిందో మన కళ్ళకు కట్టినట్ల ఆ మహానుబావుడు. కవి కోకిల అంటే కుజితముగా మృదువుగా మెత్తగా మాటలు చెప్పేవాడు అని అర్థం . ఇక్కడ అదే మనకు దర్సనమౌతుంది .