గురువారం, మార్చి 01, 2012

విశ్వమోహన సమ్మోహన స్వరూపుడు ఆ శ్రీరాముడు .

కిరీటం ధరించగల కీర్తి యశస్సు గల శిరస్సు గలవాడు 
శిరస్సు ఎత్తి చూస్తేనే అగుపించు నెలవంక ఫాల భాగంగా గలవాడు
వెన్నెలలు పూఇన్చు చిరునగవు గల విశాల  నేత్రాలు గలవాడు .
పశుపతి పూరించు ఓంకారము ధ్వనించు శంఖమే కంట మై మెరయువాడు
హరహరుని హస్తమున ధనుష్టన్కరామొనరించు ధనుస్సు యె భుజకీర్తులుగా గలవాడు .హిమ శృంగ శ్రేణి తరంగ విశాల వక్షస్థలము గలవాడు .
ఉరగ తురగములై బుసలు కొట్టేడు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నిదురించు శేషతల్పములా దీర్గ భాహువులుగల ఆజాను బాహువులు, ఊరువులు , మధ్య చిక్కిన సింగపూ నడుము  గలవాడు  
అరివీర శత్రు వినాశక సమ్మోహన స్థితుడు , విశ్వమోహన సమ్మోహన స్వరూపుడు ఆ శ్రీరాముడు .