గురువారం, మార్చి 08, 2012

వీరుడైన రామచంద్రుని పాదాలను ఆశ్రయించాలని .

 గతే తు తస్మిన్ - ఆ విధముగా పోవుటవల్ల,
భరతో, నియుజ్యమానో రాజ్యాయ వశిష్ట ప్రముఖిహి ద్విజైహి ,-వశిష్ట మహర్షి [మొదటి సారిగా వినపడ్తాడు] ప్రముఖులు , బ్రాహ్మణులూ భరతునికి రాజ్యాభిషేకం చేయ తలపెడితే . 
 మహాబలః న ఇచ్చాట్ రాజ్యం - ఆ మహాబలుడు రాజ్యం వద్దు అంటాడు. ఇక్కడ మహా బలః అనే పద ప్రయోగము చేసాడు . అంటే భరతునికి రాజ్యము పాలించే శక్తి వున్నది . అయితే అతడు రాముని తమ్ముడు అందుకే వద్దన్నాడు . కాని  ఇప్పుడు పాలించేవారంత ఆశక్తులు . ఇక్కడ భరతుని గొప్ప తనము చెప్పకనే చెప్పాడు మహాబలః అంటూ .
ఇక్కడ వాల్మీకి మహర్షి ప్రముఖైహి అన్నాడు పుర అనే పదము కలిపితే ఆ పదప్రయోగము పురమునకు మాత్రమే పరిమితమౌతుందని .
గతే తు అనే పద ప్రయోగముతో మళ్లీ దశరథుని ప్రస్తావన తేలేదు ఎందుకంటె అతడు గతించినాడు కాబట్టి .
స జగామ వనం - తను అడివికి వెళ్ళినాడు .
ప్రాసాదకః    విరో రామ పాదం - 
వీరుడైన రామచంద్రుని పాదాలను ఆశ్రయించాలని .