శుక్రవారం, మే 25, 2012

చక్కని రంగుల రాట్నం .
భావ  వ్యక్తీకరణ  ఒక  చక్కని  విద్య  

చూపులతో  భావ  వ్యక్తీకరణ  అందులో  మహోన్నతమైనది 

హావభావాలతో  వ్యక్తీకరించటం  మరో  చక్కని  మార్గం 

అతి ప్రేమ  జీవులలో  అసహన  జీవులలో  ఇది  ఎక్కువగా  కనిపిస్తుంది 

అసహనాన్ని  ఎంత  అహస్యంగా  చూపుతారో  అబ్బో  అనిపిస్తుంది 

ఎందుకు  కదిలించామురా  బాబోయి  అనిపిస్తుంది 

ఇందుకు  పూర్తి  విరుద్దము  అతి  ప్రేమ  ఇదేమి  ఫెవికాల్  రా అబ్బో  అనిపిస్తుంది 

మధ్యస్తంగా  వుంటే  గర్వం  అనుకున్న   దూరంగా  వున్నా మర్యాద  ఇస్తారు 

ఇలా  అన్ని గుణాలలో  మూడు  నాలుగు    రకాల  మనుషులు  అగుపిస్తారు 

ఎందుకు  ఇంత  వైదిధ్యమైన  పాత్రలు  ప్రతి  సమాజంలో  కనిపిస్తారు 

 వారే    ఈ  జీవన   గుభాలింపులు  తిరగమాత  లాంటి  వారు , వారు  లేకపోతే  జీవన  వైవిధ్యమే  లేదు .

 షడ్రుచులలా  అన్నిరకా ల  పాత్రల  సమ్మేళనమే  రంగు రంగుల  జీవితం 

  చక్కని  రంగుల  రాట్నం .