మంగళవారం, మే 08, 2012

వివాహం స్వర్గంలో నిర్ణ యిస్తారు చాలా గొప్పదని .

స్వర్గంలో వివాహం నిర్ణయించారా  

వివాహం స్వర్గంలా నిర్మించుకోవాలా 

మొదటిది దేవుని చేతిలో ఉందంటారు 

రెండవది మాత్రం నీ చేతిలోనే వుందంటాను 

చదువు సంస్కారం నేరిచినవాళ్లు 


ఎవరు నేర్పాలిమీకు మీ బ్రతుకుల నడతలు 

నడవడిలో ఆ అరమరికలు ఎలా పుట్టుకోస్తాయీ 

పురుడుపోసుకున్నఆ పిచ్చి ఊహల ఊదిపారేయి 

వుసులు కలబోసుకునే పొదరిల్లకు పందిరివేయి 

వివాహం స్వర్గంలా చేసుకో అప్పుడే 

వివాహం స్వర్గంలో నిర్ణ యిస్తారు చాలా గొప్పదని 

"వివాహం స్వర్గంలో నిర్ణయిస్తారు " 
అనే పెద్దల  మాటకు  అర్థం ఇదే