బుధవారం, మే 16, 2012

భార్యా భర్తలు ప్రాణస్నేహితులై జీవించి నపుడే
పురివిప్పిన  రెక్కల  సాచి  రివ్వున  నీలాల  నింగికి  ఎగిరే గువ్వల  జంట  - ప్రేమ  

మదమెక్కిన  మదనాశ్వావాలు  వాయువేగంతో  పరుగులు తీసే  జంట   -  ప్రేమ  

కోడే వయస్సులో  కోరిక  చెలరేగి  బుసలతో  పెనుగాడే     సర్ప  జంట     - ప్రేమ   

అందుకే  అది  అతి మధురం  మనోహరం  ఉహల  ఉయాల  పల్లకి   -  పేమ  పల్లకి 


పెళ్ళి   పల్లకి  మోత  పెళ్ళి  అయిన  కొన్నాల్లె  భాజ   భజంత్రీలు  ఇంకొన్నాలే   

హోదా  పెరిగే  కొద్ది  భాద్యత  పెరుగు  భాద్యత  పెరిగే కొద్ది బరువు పెరుగు 

పెరిగిన  బరువులతో  తరిగిన  సొగసులతో  సోయగాలు  వెగటు  అవుతాయి 

సూటి  పోటీ  మాటలు  ఎక్కవ  అవుతాయి  ఆఖరికి  చుట్టాల  సాలె గూడు  పాలుఅవుతాయి 

జలదరింపులు  కాస్త   కంపరాలు  అవుతాయి  కట్టకడకు కాపురాలే  కూలి  పోతాయి 


ప్రేమ  ఒక  కనిపించే  సుందర  స్వప్నం - పెళ్లి  ఒక  నడిచిపోయే  నిజమైన మన  ఊరి  కాలి  బాట 

 పెళ్లిని  అలా  తీర్చి  దిద్దుకుంటే  ఇది  కూడా  సుందరమే  సుమదురమే 

మొగుడు  పెళ్ళాం లా కాక   

 భార్యా  భర్తలు  ప్రాణస్నేహితులై  జీవించి నపుడే