శనివారం, మే 05, 2012

పెసిమిస్ట్ పెసిమిస్ట్ కాదు

పెసిమిస్ట్ పెసిమిస్ట్ కాదు 

భావజాలంలో  జారిపోతూ గంతంలోనే  గడిపేయకు 
బ్రతుకు బండిని లాగిపట్టి  ప్రగతి ఏదని ముసుగేయకు 

మూసుకున్న తలుపు సందున మూరెడే కనిపించుమనకు 
లేదు ప్రగతని లేదు జగతని మునక వేసి పడకేయకు 

నిన్న లేనిది నేడు వుంది నేడు లేనిది ముందెన్నడో  రానుంది 
వుహకైన అందని అమోఘమైన అమృత ఫలాలు తేనున్నది 

మనసు పొరల తెరలను తోలగించుకో  వెలుగు రేఖలు తామే తొంగి చూస్తాయి 
బద్దకాన్ని బలవంతగానైన వదిలించుకో  బంగారు భవితవ్యం నీ ఒడిలో ఒరిగి పోతుంది 

దారి తప్పిన బాట సారి  బాట పట్టి నడువవోయి 
ఏ ఇజాలు నిన్ను అంట జాలవు అన్ని నిజాలు నీవెంట వున్నాయి 

మనసు తలుపులు  తెరుచుకొని  మనసార  మనుగడ చేయవోయి 
ఏ భయాలు భ్రాంతులు నిన్ను అంట జాలవు వెలుగు రేఖలు వెంటరాగ 

( అన్ని విధాలా  దెబ్బతిని అల్లాడి పోతున్న సోదరుల కొరకు )