ఆదివారం, మే 13, 2012

ముద్దుల తల్లిని నేను ఒక స్త్రీని

 • నేనెవరిని  గాలిని-గాలిలో  గాలిలా తిరిగే  గాలిని .
 • సుడి గాలి ని  కాను  వడ  గాలిని  కాను .
 • చల్లదనానికి  చక్కటి శ్వాసకు  వుపిరిలు  పోసే  చల్లని  గాలిని. 
 • అమ్మ   లాలి  పాట  లాంటిదాన్ని .
 •  సేద  తీర్చి  ఆహా ...  ఆహా... అనిపించే  మీ  ప్రాణ  వాయువును .
 • మీ  ఉపిరిని .

 • నేనెవరిని నీటిని - నీటిలో  నీరులా నింగి నుంచి జాలువారే  నీటి బొట్టు ని .
 • తుఫానును  కాను  సునామిని  కాను .
 • మీ  గొంతు  తడిపే  చల్లని  ఐసు  వాటరుని 
 • అమ్మ   పాలలా  కడుపు  నింపే దానిని .
 • దాహాన్ని  తీర్చి  హమ్మయ  అనిపించే  మీ  ప్రాణ  దాతను .

 • నేను  అగ్నిని  - జ్వలజ్వలి త  జ్వజ్వవల్యా మానాన్ని  జ్వాలను .
 • ఖాండవ  దహనం  చేసే , కొంపల  బూడిద  చేసి  దుర్మాగ్నిని  కాను .
 • మీ  కంటిపాపలకు   వెలుగు నిచ్చే  మీ ఇంటి  దీపాన్ని .
 • మీ ఇంట  సిరులు  పొంగించే  మీ  దేవుడి  దీపాన్ని .
 • మీ  ఇంట  వంటకు  ఉపయోగించే  మీ అగ్నిని .

నేను  ఈ  త్రిగునస్వరుపాన్ని  మీ నటింట  పారాడే  మీ  అమ్మను మీ ముద్దుల  తల్లిని  నేను  ఒక  స్త్రీని  .