శనివారం, మే 12, 2012

దేవుడిని అనవసరంగా డిస్టర్బ్ చేయ రాదు .

ఎంతని గొంతెత్తి పిలువను 
నా పిలుపు వినవా 
నా మొర  కనవా 

చిన్న  తనంలో  తల్లి  పోతే 
పొగిలి  పొగిలి  ఏడ్చాను  
నీ  రాక  కానక   నిదురలోకి  జారుకున్నాను .

ఎంతని గొంతెత్తి పిలువను 
.....................

కోడె  వయస్సులో  ఎదుటి వారి  ఎగ  తాళికి  చిన్న  పోయి 
ఎంతగా  ఏడ్చానో   ఓదార్పు  కోసం 
అయినా  నీవు  రానే  లేదు నా  కోసం  అని  మౌనిలా  మారాను .

ఎంతని గొంతెత్తి పిలువను 
...............


స్నేహితులు  పెద్దవారు  పరలోక  గతులైరి   ఒక్కోకరుగా 
ఒంటరిని  చేసారు  నన్ను  శోకసంద్రంలో  మునిగినా  
రాలేదని  నీవు   పిలవటమే  దండగ అనుకున్నాను .ఎంతని గొంతెత్తి పిలువను 
................


సునామి  భాదితిలు , సుడిగాలి  భాదితులు , భూకంప  భాదితులు , ఆకలి  భాదితులు , బ్రతుకంటే  భయం  తో  వణికి  పోయే  వారిని  దగ్గరగా  కంప్యుటరులో  చూసి  ,  నీవు  పడుతున్న   కష్టము  చూసి  ,  ప్రపంచంలో   భాధ  ముందు  నా  భాధ   చాల   చిన్నదని  తెలిసి   భాధతో  చలించి  పోయా 
ఇక  నిన్ను  ప్రతి  సారి  పిలిచి  భాదిన్చారాదని   తెలుసుకున్నా . నా పిల్లలకు  ఇదే  విషయం  చెప్పి  ఒప్పించినాను  


దేవుడిని  అనవసరంగా   డిస్టర్బ్     చేయ రాదు  . 


మీ  సమస్య   మీరే  తీర్చుకోవాలని .