గురువారం, మే 24, 2012

ఓ నాటి అమ్మను నేటి ఆట బొమ్మనుచిన్నారి  పొన్నారి  ఆశలతో  పూచిన  పూ రెమ్మను  అందరిలా 

ఆశలతో నా అత్తగారింట  అడుగుడిన  ఆడపడుచును  అందరిలా  

పిల్లలతో పాపలతో హాయిగా సుఖసంతోషాలతో  సాగిని సంసారమే   

కూతురు అల్లులు కొడుకు కోడళ్ళు మనమలు మనుమరాండ్రు లతో  వర్ధిల్లిన  జీవితం  

విధి కేమైనదో  జంటగా  ఉన్న   మమ్ము విడదీసింది   నను ఏంతో  వేధించింది  వ్యధల  పాల్జేసింది 

తుదకు కసి తీరక  నా రెక్కలు విరచి  అవిటి దాన్ని చేసింది పక్షపాతంతో  నాకు  పక్షవాతం ఇచ్చింది 

నేను  ముద్దాడిన  నా కొడుకే  నాకు అమ్మ  అమ్మనైన  నేను  ఆఖరికి  నా బిడ్డ   చేతి  బొమ్మనైపోయను 

వ్యధ  ముసరగా  ముద్దదిగదు  అచేతనంతో  ఆఖరి పిలుపుకై  ఎప్పుడా అని  ఎదురుచూస్తున్నాను 

ఓ  నాటి  అమ్మను   నేటి  ఆట  బొమ్మను 

దేవుడు  ఆడిన  చదరంగలో  ఆఖరికి  ఓడిన  రాణిని  - విరాగిణిని