శనివారం, మే 05, 2012

ఎగిరే పావురాలు మన ఊహలు = వికృత విశృంకలత పైశాచికాల పెంచి పోషించకండి .

ఎగిరే  పావురాలు  మన   ఊహలు 
మెరిసి తారలు  మన ఆలోచనలు 

తార జువ్వల్లా తళుక్క్ మన్న ఆలోచనలు 
తారాలోకం లో ఆష్ట్రాయిడ్స్ లా  విహరిస్తాయీ 

వర్షం తెచ్చిన  మెరిసే  నీటి బిందువుల్లా 
ఎప్పుడు దేనికి తగిలి  విస్పోటనం  అవుతుందో 

విస్పోటనంలో  అరవిరిసిన  ఇంద్ర ధనువుల తెస్స్తుందో 
విశాల విశ్వాన్ని మింగే  భయంకర  విష  జ్వాలాగ్ని రగిలిస్తుందో 

అణు బాంబుల కన్నా శక్తివంతమైనవి  అక్షరాలు 
అక్షరాలతో  ఆడరాదు  ఇష్టమొచ్చిన ఆట పాటలు  

అవతలవారిని ఆలోచింప జేయోచ్చు 
అవమానించా వచ్చు 
మాట జారితే  విన్నపుడే  బాధ 
అక్షర క్రమమైతే  చూసి నప్పుడల్లా బాధ 

కవులార/ భావుకులార /రాజకీయ నాయకులారా /రచయితలారా 
మీ  వాక్ /అక్షర/ కవితా సేద్యంలో 
మానవత్వపు ఆలోచనలు పుట్టించండి 
వికృత విశృంకలత పైశాచికాల  పెంచి  పోషించకండి .


( మీటింగులలో , సినిమాలలో , పేపర్లలో  ఎక్కడ చూసిన  ఎక్కవగా 
అభ్యంతరకర  ప్రసంగాలు  చూ స్తున్నాము , వింటున్నాము )