బుధవారం, మే 02, 2012

కోటి వీణలు పలికే ఓ కోయిలమ్మ ...ఓ కోయిలమ్మ

కొమ్మ కొమ్మల చేరి చివురు టాకుల మేసి 
కోటి వీణలు పలికే  ఓ కోయిలమ్మ ...
కన రావేమిటమ్మ...........?

చిగురాకుల బదులుగా చిప్స్ పెడతాము 
కొమ్మల బదులుగా సెల్ టవరులు కడతాము
కుహు కుహు రాగాల ఓ కోయిలమ్మ


మావి  చిగుర్లు , చింతచిగుర్లు ఎరుగము 
ఆమని మాకు అంతకంటే తెలియదు 
నీ పాట నెరుగుదుము ఓ కోయిలమ్మ


కోయిలేదో సాంబారు కాకి ఏదో ఎరుగము 
కొమ్మల  మధ్యదాగిన  నీ రూపం ఏదో తెలియదు 
నీ పాట తెలుసు కోయిలమ్మ ఓ కోయిలమ్మ