ఆదివారం, మే 06, 2012

సంసారం - సాగరం

సంసారం - సాగరం 

ఊరకే అనలేదు పెద్దలు 
ఎన్ని ఆలోచలనలు అలజడులు 
అంతరంగంలో సుడిగాలిలా సుడులు తిరుగుతూ రేగినా 
అంత ఎత్తున ఎగిరేగిరే అలలులా ఆకాశానికి చెలరేగినా  
ఎలా కడలిలో ఒదిగి పోతాయో తల్లి ఒడిలో ఒదిగి పోయిన 
పసి పాపలా 
అన్ని ఆవేశాలు అన్ని సంఘర్షణలు పెదవి దాటి రారాదు  
కుటుంబం దాటి  అసలే రారాదు 
అనే సంసారం సాగరం అన్నారు అంతె కాని కష్టాల కడలి అని కాదు 


ఈ బంధాలు నిలుపాలన్న అనుబందాలు పెంచాలన్న 
కడలిలొని జలాకర్షణలా కుటుంబంలో మమతాకర్షణ పంచాలి