సోమవారం, మే 07, 2012

గురివింద

గురివింద  

ప్రపంచంలో నేనొక్కడనే మంచివాడిని 
అనంత విశ్వంలో నేనొక్కడనే గుణ వంతుడిని

నాలా ఎవరు వుండరు అయినా నాకే ఇన్ని పరీక్షలు 
దేవుడు వున్నాడా వున్నా నిదురోతున్నడా 

ఇలా భాధ పడేవారిని చూసాను 
ప్రపంచమంతా తమ తలపై మోసేవాళ్ళల చాలా కష్టపడి పోతారు 

చుట్ట్టు వున్నా పరిసరాలను , ఇరుగుపొరుగు వారిని  చూస్తూ వుండి  
అస్తమానము తిట్టు కుంటారు  
యెఒక్కసారి అంతరంగంలోకి తొంగి చూడరు తమ  లోపాలను సరి చేసుకోరు  

తమకు కావలసింది  జరిగితే  వేరి గుడ్  లేదా వేరి బాడ్ 
గురివింద  సామెత  పెద్దలు ఉరికే  చెప్పలేదు  వీరిని చూసే .