శుక్రవారం, మే 18, 2012

wish you a happy birth day

నా  ఊహలకు రంగులు  అద్ది

 మన  కలలకు రూపం నిచ్చి   

చక్కని  కావ్య  సుందరిలా  

నిను తీర్చి  దిద్దనా 

పూ పెదవుల  పుపొడ్డి గంధం నలరి  

విరితావుల  పరిమళం నద్ది

  నీ మేన  అత్తరులు చల్లనా 

కరి మబ్బుల మెరుపుల ఒరసి 

 జలధారల  ఒరుపులు ఒడిసి 

 నీ  నేన్నడుమున   సోయగ మద్దనా   

వన  సీమల  తారేడే  గగన  సీమల  తిరుగాడే 

వలపుల  చిలుకల  కిల కిలలు 

 నీ చిరునగవుల  చిరునవ్వులు   మెరిపించనా 

పుణ్య  నదీమ  తల్లుల  పుష్కర  తీర్థాల  తెచ్చి 

నిను  పుణ్య వతిగా  అభిషేకం  చేయనా 

నా పూర్వ  జన్మ   శుకృ తమా  

నా  సహ  ధర్మ   చారమా 

నా  ప్రాణమా  

అందుకోమా  నా ఈ   జన్మ దిన  శుభాకాంక్షాలు .