శనివారం, మే 12, 2012

ఓ బంగారు తల్లి

ఓ  బంగారు తల్లి A painting showing the affection of mother.
నీ లేత  చేతులతో   ఈ  ప్రపంచంలోని   ప్రేమ మొత్తం  పొందినావు 
అందుకేనేమో  ఈ   ప్రంపంచమంతా   ఎదిగిన  నీ    పై  ఆంక్షలు పెడుతుంది .

ఓ  సుకుమార  పడతి 
అత్తా మామ లు  భర్త   పిల్లలు  అనే భావబంధాలతో   నిన్ను  కట్టు బానిస                  చేసి   కట్టి   పడేస్తారు 
ప్రేమ   భాధ్యతలు  అనే సంకెళ్ళతో  నీ గృహాన్నే కార గృహం చేస్తారు .

ఓ గంగా భాగిరథి 
నీ పిల్లలే నిన్ను ఇంటి కాపలా కుక్కను చేస్తారు  నీవు వున్నా  వన్న   సృహ   లేకుండా  వుంటారు .
మంచాన  పడ్డవా   మంచినీల్లుయిన  దొరకవు  ఒక్కరు నీ కొరకు ముందుకు రారు .


ఓ  వయస్సు  వుడిగిన  అవ్వా 
రెక్కలొచ్చిన  పిల్లలు ఎగిరిపోతారు తమకు చేతకాదని 
వృద్ధ   ఆశ్రం  లో  వదిలి పోతారు అన్ని వున్నా అనాధలా 
నీవెపుడు పోతావో అని ఎదురు చూస్తారు అయ్యో పాపం అంటూ .

బహుశా  ఈ  బందానాల  మమకారం  నీలో  చావాలని నీ రక్తం పంచుకున్న నీ   పిల్లలు   ఇలా    చేస్తున్నారేమో 
నీ ఫోటో ఒకటి వాల్  పేపర్ల  లా  వారి కంప్యుటరు లోనో లాపు టాపు లోనో  పోస్ట్   చేస్తారు  వారసులుగా నీ ఆస్తి కోసం .