గురువారం, మే 03, 2012

మేల్ మోనోపాజ్

మేల్ మోనోపాజ్ 

ఒక  సంధికాలం ప్రతి జీవితంలో తొంగి చూస్తుంది 
అల్లుకున్న బంధాలను చెల్లా చెదురు చేస్తుంది 

తనంత అయ్యారని కొడుకుల చూసి ఒక పక్క సంబరం 
తనను మించి పోయి తక్కువ  చేస్తారని మరోపక్క భయం 

భుజం పై కండువ   నలగనీయకుండ నడిచిన బండి బోల్తాపడుతుందా 
భయమనే పదం ఏమిటో అని బ్రతికిన బ్రతుకు  బద్దలవుతుందా 

అడుగడుగునా అడుగుజాడల అనుసరించిన అర్ధాంగి అలుసుచేసుతుందా 
అది ఇది  తెమ్మని అల్లరి చేసిన  పిడుగుల్లాంటి పిల్లలు చిరాకుపడతారా 

అన్ని సమస్యల తీర్చే నా అంతరంగమా అంతరంగ తరంగాలలో అదృశ్యం అయినావా 
అలవోకగా అందరిని ఆదరించిన ఓ నా ఆపన్న హస్తమా శూ న్యంలో 
శూన్య హస్తంగా మిగిలిపోయావా 

ఊర్లోని సమస్యలు తీర్చే ఓ  పెద్ద మనిషి 
ఇంట్లోని ఒంట్లోని సమస్యకే  చిన్నబోయావా 

ఇది అంతరంగ తరంగాలలో కలిగిన ఒక  చిన్న అలజడి 
ఇదిలించి పారేయి ఆవలకు ఇక నీదరి చేరితే ఒట్టు ఏ జడి .

(ఈ వాళ  వచ్చిన ఒక పెద్ద మనషి  బాధ  బాగా కదిలించింది - ఆయనను ఒదార్చటం చాల కష్టం అయింది . )