బుధవారం, మే 16, 2012

మార్పు సమాజంలో లేనిది ఫలితం శూన్యం

యధా రాజా  తథ  ప్రజా  అనేది  పాత  నానుడి  
యదా  ప్రజా  తథ  రాజా  అనేది  కొత్త   నానుడి 

వరకట్నం  దురాచారంలా  లంచావతారం  నిలిచింది 

అవినీతి  మార్గాలలో  సొమ్ము  చేసుకుంటున్నారు 

తిను  తినిపించు  అనేది  కొత్త   సిద్దాంతం  

చిల్లర  దొంగల  భరతం  పట్టే  మనం  

పెద్ద   వారి  ముందు  జోలె  పడతాం 

భారీ  ఎత్తున  చేసే  వారి  భజన  చేస్తాం 

భుక్తి  కోసం  చేసే  వారిని  నిలదీస్తాం  

ఎవరు  ఎన్ని  పోరాటాలు  ఆరాటాలు  చేసినా 

మార్పు  సమాజంలో  లేనిది   ఫలితం  శూన్యం