మంగళవారం, మే 01, 2012

ఆశ పాశం అలాంటిదే - నేర్చుకోవలసింది చాల వుంది

కోర రాని కోరికలు కోరివిమానులై  కొస్తాయి నిలువునా హృదయాన్ని .
కూడా రాని బంధాలు యమపాశాలై తీస్తాయి  సులువునా ప్రాణాలు .

కైక కోరిక తెచ్చింది సౌభాగ్యానికి చేటు 
సీతా కోరిక వేసింది  జీవితానికి పోటు
శుర్ఫనఖ మొహం చేసింది అందవికారం 
రావణుడి సీతపై ఆశా పాశమై తీసింది ప్రాణం 

ద్రౌపదిపై ఆశ కీచక సంహారమై ముగిసింది 
కుంతి మొహం మిగిల్చింది కర్ణ పుత్రా శోకం 
దుర్యోధనుని దురాశ కురువంశాన్ని నిలువునా ముంచింది 
శకుని కుట్ర శకునినే చంపింది 

పురాణాలు ఇతిహాసాలు సామెతలు పెద్దల మాట ఎన్ని చెప్పిన చేవిక్కేకని వారు  ఇంకా వున్నారు , వుంటారు , వుండబోతారు .
ఆశ పాశం అలాంటిదే - నేర్చుకోవలసింది చాల వుంది