సోమవారం, ఏప్రిల్ 30, 2012

ఎద చీల్చుకొని వచ్చేఈ శోకము ఆ శోక వనిలోని సీతకై

పుడమి తల్లిని చీలుచ్చుకొని వచ్చే వెదురు పొదలార
నీలాఆకాశపు  అంచులు తాకే   నేరేడు  కొమ్మలార 

జల జల గిరులంచుపైనుంచి జాలువారేటి ఝారులార 
తరులార , లతలార , పూతెనె తావేటి తుమ్మెదలార 

సర్వ వనచరులార  నా సహచరులార  నా సహధర్మ చారిణిని కంటిరా 
సకల లోక పావనిని  జనక రాజ పుత్రిని నా సీతను కనుగొంటిరా

జాడ లెరుగను జాబిల్లి నీవైన చెప్పవా 
అడుగు జాడలు లేవు అడివంతా వెతికినా 

నీడ నిచ్చి సేద తీర్చేటి ఫల రాజ వృక్షమా
నీ ఆశ్రయములోన  నిలిచిందా చెప్పుమా 

నింగిపై  ఎగేరేనా నీటి పై సాగెన  బిలములో దూరేనా పొదలలో దాగెన 
ఏడ  తా నున్నదో  నా సీతా  ఎండ కన్నేరుగని భూజాతా

ఎద చీల్చుకొని వచ్చేఈ శోకము ఆ శోక వనిలోని సీతకై