ఆదివారం, ఏప్రిల్ 01, 2012

అంతటి మణి దీపాన్ని పోదువుకోవాలంటే ఇంతటి గగన సద్రుశాకరుడే కావాలి .


నిలువెత్తు వినిలాకాసం లా నీల మేఘ వర్ణుడు  రాముడు ఒక పక్క .....


మల్లెలు జాజుల రోజాల సరోజల సుగంధ సుపరిమలలు జల్లే జాబిల్లిలా         జానకి ఒక పక్క 


కరతాళ ధ్వనులతో కలకలముల రేపు జన సంద్రంయోప్పు  ప్రజలు ఒక పక్క 


వీరాధి వీరులు వివిధ దేశాదిపతులు గండు తుమ్మెదల గుంపుల యొప్పు     రాజులోక పక్క 
జనక మహారాజు , విశ్వామిత్రుడు తదితర మహా ఋషులు , మునిపున్గవులు మరో పక్క 


ఈ మహా స్వయంవర  వేదిక పై  ధనుస్సు నేత్తలేని రాజులెల్ల నత్తల వలె మెల్లగా జారుకున్నారు . పిలవకే వచ్చిన రావణుడు  పిరికిపందలా పారిపోయాడు .


ఎవరు లేరా ఇంతటి మహా సభలో అని ఎంతో హృద్యంగా పలికిన జనకుని పలుకులకు ,
విశ్వామిత్ర ఆదేశం పై  రాముడు అందుకున్నాడు  శివ ధనుస్సు ,
ఒక శృంగం నేలపై వుంచి కదలకుండా బొటనవేలు నదిమి , మరొక శృంగానికి  వింటిని వంచి  వింటి నారిని సంధించబోగా.......


 భునభోంతరాలు దద్దరిల్ల  పెళ పెళ ఆర్భాటంతో  పెటిల్లున వింటి పైభాగం తటిల్లున మెరుపులు మెరుస్తూ విరిగి  పడి పోయింది .


వింటిపై పొదిగిన వజ్ర వైడుర్యాలు మరకత మాణిక్యాలు చటిల్లున నింగికి కెగసి  పాలపుంతల పరచుకొని విధ్యుత్ తళతిలత కాంతులు వెదజల్లి అందరి మనసుల మురిపించి మెరిపించాయి .


శృంగపు కొనకు సింగారముగా కట్టిన ముత్త్యాల సరులు , మువ్వల పట్టిలు  ఎగిరెగిరి చిరుజల్లులా సభికులందరి పై పడి ఆహ్లాద పరిచాయి .
చిరు చెమటలు పట్టి  ఈ వజ్ర వైడూర్య , మరకత మాణిక్యాల ధూళి సోకి  మణి దీపంలా దేదిప్యమానముగా వెలిగి పోతున్న సీతమ్మను ,
కంటి శృంగమున చూశాడు రాముడు  వింటి శృంగం తోలగుటవల్ల.


సునీలవర్ణ శ్యాముడు  విల్లు నేగచిమ్మిన పాలపుంతల జిలుగు మెరుగుల జిగిబిగి తళుకుల ధూళి తో నిండి ,
 తార మండల గగన సద్రుస్యమై శోబిల్లినాడు.


అంతటి మణి దీపాన్ని పోదువుకోవాలంటే  ఇంతటి  గగన సద్రుశాకరుడే కావాలి .
 ఈ జంట నభోతో నభవిష్యతి .
జంట అంటే ఇదే జంట 
వీరికి లేరు మారు , రారు ఎవరు సాటి .


కాంతుల ప్రతి కాంతులు తల వంచిన సీతమ్మ కంట పడి ........
 పరికించి చూడ ఎక్కడిది ఈ కాంతి అని ............

నిలువెత్తు వినిలాకాసంలా నీల మేఘ వర్ణుడు  రాముడు అగుపించెను .

వరమాలా అలంక్రుతుని  జేసింది .