ఆదివారం, ఏప్రిల్ 01, 2012

ఈమె చేతిని నీ చేతిలోనికి తీసుకో- నీ నీడలా నిను అంటి వుంటుంది .


ఇరు వర్గాల బంధు మిత్రులతో , ప్రజలతో  శోభాయమానముగా 
 తీర్చి దిద్దిన వీధులతో మందిరాలతో , విందులు వినోదాలతో , దాన ధర్మాలతో మిల మిల మెరిసిపోతువున్నది మిథిలాపురి.


వరపూజ చేశాక తోడుకొని పోయిరి కళ్యాణ వేదికకు .
గౌరీ పూజా గావించి తోడ్కొని వచ్చిరి సీతమ్మను .


అగ్ని సాక్షిగా జనకుడు సీతమ్మను రామునికి చూపిస్తూ ......
రామా..... ఈమే  నా పుత్రిక సీతా
ఈమె చేతిని నీ చేతిలోనికి తీసుకో
ఈమె పతి వ్రత  నీ సహధర్మచారిణి 
నీ నీడలా నిను అంటి వుంటుంది .
అంటూ మంత్ర జలము రాముని చేతిలో పోశాడు.


మంగళ వాయిద్యములు , దేవ దుందుభులు కరతాళ ధ్వనులు మిన్ను ముట్టి నవి . దేవతలు పూల వర్షం కురిపించారు . మంగళ సుత్రాధారణ జరిగింది - మన మసులు ఉప్పొంగి పోయాయి .
కన్నుల నిండా ఆనందభాష్పాలు , చేతులనిండా అక్షింతలు 
చిరుజల్లు లా అక్షింతలు ఆ నవ వధూవరుల పై కురిపిస్తూ
 పెద్దలు ఆశీర్వదిస్తూ , పిన్నలు ఐన మనము నమస్కరిస్తూ 
నయన  మనోహరంగా అత్యంత వైభోగాముగా సీతా రాముల కళ్యాణము జరిగింది .